Sapthami Gowda: కాంతార తర్వాత నేచురల్ బ్యూటీ సప్తమి నటిస్తున్న సినిమా ఎదో తెలుసా..?
నేచుర్ బ్యూటీ సప్తమీ గౌడ్ కూడా సినిమాలో వన్ ఆఫ్ ది హైలైట్ అనే చెప్పాలి. అంతకు ముందు కొన్ని సినిమాలు చేసినా వేటితోనూ రాని గుర్తింపు కాంతార సినిమాతో దక్కించుకుంది ఈ బ్యూటీ.
Updated on: Nov 20, 2022 | 1:10 PM

కాంతార సినిమాతో ఒక్కసారిగా స్టార్ అయిపోయింది అందాల సప్తమి గౌడ. కాంతార సినిమా హిట్ తో పాన్ ఇండియాలో ఫేమస్ అయిపోయింది సప్తమి గౌడ. ఇందులో అమ్మడు రోల్ చిన్నదే అయినా ప్రేక్షకుల మనసులో చోటు సంపాదించుకుంది.

నేచుర్ బ్యూటీ సప్తమీ గౌడ్ కూడా సినిమాలో వన్ ఆఫ్ ది హైలైట్ అనే చెప్పాలి. అంతకు ముందు కొన్ని సినిమాలు చేసినా వేటితోనూ రాని గుర్తింపు కాంతార సినిమాతో దక్కించుకుంది ఈ బ్యూటీ.

సోషల్ మీడియాలో కొత్త ఫోటోలతో వైరల్ గామారడంతో బ్యూటీ మరింత పాపులర్ అయింది. హిట్ తో ఇతర భాషల్లోనూ అవకాశాలు వస్తున్నాయి.

కాంతారా సినిమా తర్వాత ఈ చిన్నదానికి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. తెలుగు నుంచి కూడా ఈ బ్యూటీ పిలుపులు వస్తున్నాయని తెలుస్తోంది.

తాజాగా ఈ బ్యూటీ 90కాలం నాటి ఓ ప్రేమ కథలోఒ నటిస్తోందని టాక్. ఇందులో ప్రముఖ నటుడు అంబీష్ తనయుడు అభిషేక్ హీరోగా నటిస్తున్నాడు.

ఈ సినిమాలో సప్తమి గౌడ్ హీరోతో ఘాటైన రొమాంటిక్ సన్నివేశాల్లో మెప్పించబోతుందిట. ప్రస్తుతం ఆందుకు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట.

కాంతార లాంటి సినిమా తర్వాత ఇప్పుడు రొమాంటిక్ మూవీతో వస్తున్న సప్తమి ఎలాంటి హిట్ అనుకుంటుందో.. ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.




