Raadhika Sarathkumar: మా సినిమాలో కంటెంటే కింగ్.. నేను గర్వంగా చెప్పగలను.. రాధికా శరత్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ క్రమంలోనే వచ్చిన కాంతార సినిమా సంచలన హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఇదే బాటలో లవ్ టుడే సినిమా రానుంది. ఇప్పటికే తమిళంలో విడుదలైన ఈ చిత్రం ఫన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తి ఘన విజయాన్ని అందుకుంది.
ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్ టుడే’. తమిళ్ లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలకు వస్తున్న క్రేజ్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే./ తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిని రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి చిన్న సినిమాలు. ఈ క్రమంలోనే వచ్చిన కాంతార సినిమా సంచలన హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఇదే బాటలో లవ్ టుడే సినిమా రానుంది. ఇప్పటికే తమిళంలో విడుదలైన ఈ చిత్రం ఫన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తి ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ సినిమాను నవంబర్ 25న విడుదల చేయటానికి నిర్మాత దిల్‌రాజు సిద్ధమవుతున్నారు. శుక్రవారం ఈ మూవీ ట్రైలర్, ఆడియో లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. వంశీ పైడపల్లి, అనీల్ రావిపూడి, రాధికా శరత్ కుమార్ బిగ్ సీడీని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా…
రాధికా శరత్‌కుమార్ మాట్లాడుతూ ‘‘తెలుగులో లవ్‌టుడే సినిమాను విడుదల చేస్తున్నారు. తమిళంలో చాలా మంచి విజయాన్ని సాధించిన చిత్రమిది. ముఖ్యంగా యువన్ సంగీతం అందించిన ఈ మూవీ సాంగ్ చాలా రోజులుగా నా మైండ్‌లోనే ఉండిపోయింది. ప్రదీప్ రంగనాథన్ తొలిసారి కథ చెప్పగానే సినిమా పెద్ద హిట్ అవుతుందని నేను చెప్పాను. తెలుగు సినిమా మార్కట్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సినిమా గురించి ఇక్కడ ఉండే అవుట్ లుక్ గొప్పగా ఉంటుందని నేను గర్వంగా చెప్పగలను. తెలుగు ఆడియెన్స్ హీరోలైన చిరంజీవి, ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ వంటి వారిని చూసే తీరు వేరేలా ఉంటుంది. దిల్ ఉండే నిర్మాత దిల్‌రాజు ఈ సినిమాను తీసుకున్నారని తెలియగానే, ఆయనెలా చేస్తారోనని ఆసక్తిగా వెయిట్ చేశాను.
ఇక్కడ మహేష్, ప్రభాస్, పవన్ కళ్యాణ్‌లను ఎలాగైతే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారో, లవ్ టుడే సినిమా తర్వాత ప్రదీప్ రంగనాథన్ కూడా అలాగే ఆదరిస్తారు. ఈ మూవీలో కంటెంట్ కింగ్. నేను చాలా సంవత్సరాలుగా చాలా మంది నటీనటులతో కలిసి సినిమా చూశాను. చాలా ఏళ్ల తర్వాత థియేటర్‌లో ఆడియెన్స్ సినిమాను సెలబ్రేట్ చేయటాన్ని నేను గమనించాను. ప్రతీ ఒక్కరూ సబ్జెక్ట్‌కు కనెక్ట్ అవుతున్నారు. సినిమాలో ఫోన్స్ ఎక్సేంజ్ చేసినట్లు చూపించారు. కానీ అసలు విషయం క్యారెక్టర్స్ ఎక్సేంజ్ అనే చెప్పాలి. యువన్ అద్భుతమైన వర్క్ ఇచ్చారు. మీలో చాలా మంది మిమ్మల్ని మీరు తెరపై చూసుకుంటారు’’ అని అన్నారు రు రాధిక.