Comedy Stock Exchange: మరో క్రేజీ షోతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్న ఆహా.. ఇక పై నవ్వులే నవ్వులు
లైట్ హార్టెడ్ ఫ్యామిలీ కామెడీ షో కామెడీ స్టాక్ ఎక్సేంజ్ అనే ప్రోగ్రాంతో మన ముందుకు రానుంది ఆహా. డిసెంబర్ 2 నుంచి ఈ కామెడీ షో స్ట్రీమింగ్ కానుంది. పాపులర్ కమెడియన్స్ ఈ షోలో మనల్ని ఎంట్రటైన్ చేయనున్నారు.
మనసు తేలికగా ఉండాలన్నా, నవ్వి నవ్వి కడుపు నొప్పి రావాలన్నా మంచి కామెడీని ఆస్వాదించాలి. అలాంటి ఆహ్లాదకరమైన హాస్యాన్ని సంపూర్ణంగా అందించడానికి మన ముందుకొస్తోంది తెలుగు ఓటీటీ సంస్థ ఆహా. లైట్ హార్టెడ్ ఫ్యామిలీ కామెడీ షో కామెడీ స్టాక్ ఎక్సేంజ్ అనే ప్రోగ్రాంతో మన ముందుకు రానుంది ఆహా. డిసెంబర్ 2 నుంచి ఈ కామెడీ షో స్ట్రీమింగ్ కానుంది. పాపులర్ కమెడియన్స్ ఈ షోలో మనల్ని ఎంట్రటైన్ చేయనున్నారు. సరిలేరు నీకెవ్వరు, ఎఫ్3 సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న రైటర్, స్టార్ డైరక్టర్ అనిల్ రావిపూడి ఈ షో ద్వారా ఓటీటీకి రంగప్రవేశం చేస్తున్నారు. కామెడీ స్టాక్ ఎక్సేంజ్ షోకి ఆయన ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
అనిల్‌రావిపూడి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఈ షోని సుడిగాలి సుధీర్, దీపిక పిల్లి హోస్ట్ చేస్తారు. ఈ షోలో సెలబ్రిటీ కమెడియన్స్ వేణు, ముక్కు అవినాష్, సద్దాం, ఎక్స్‌ప్రెస్ హరి, భాస్కర్, జ్ఞానేశ్వర్ స్టాక్స్ గా ఉంటారు. ప్రేక్షకులకు చక్కటి నవ్వులతో గిలిగింతలు పెట్టడానికి వీరంతా రెడీ అయ్యారు. ఈ షోలో మూడు రౌండ్స్ ఉంటాయి. స్టాక్ (కమెడియన్)కి లైవ్ ఆడియన్స్ ఓట్లు వేస్తారు. అక్కడ ఎక్కువ ఓట్లు గెలుచుకున్నవారు ఛైర్మన్ మనసు గెలుచుకుని టాప్ స్టాక్‌గా పేరు తెచ్చుకుంటారు. ఈ కామెడీ షో 10 ఎపిసోడ్లుగా సాగుతుంది.
కామెడీ స్టాక్ ఎక్సేంజ్‌తో ఓటీటీలోకి ప్రవేశిస్తున్న అనిల్ రావిపూడి మాట్లాడుతూ, “హాస్యంలోని కోణాలను ఆవిష్కరించడానికి ఇంత గొప్ప ప్లాట్‌ఫార్మ్ దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి ప్లాట్‌ఫార్మ్, కామెడీ స్టాక్ ఎక్సేంజ్ అనే బ్రాండ్ న్యూ కామెడీ షోని నాకు ఇచ్చినందుకు ఆహా వారికి ధన్యవాదాలు చెబుతున్నాను. ఇప్పటిదాకా నేను చేసిందంతా ఆఫ్‌కెమెరాలోనే. ఇప్పుడు ఆడియన్స్ కి నేను సరికొత్తగా పరిచయం కాబోతున్నందుకు ఆనందంగా ఉంది. అన్నారు.
అలాగే సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ “ఇన్నేళ్లుగా ప్రేక్షకులు నా పట్ల చూపిస్తున్న ఆదరణకు, ప్రేమను ధన్యవాదాలు. వాళ్లు నా మీద పెట్టుకున్న నమ్మకం ఇస్తున్న ప్రోత్సాహంతోనే నేను ప్రతి అడుగూ ముందుకు వేస్తున్నాను. గడపగడపలోనూ ఈ షో ద్వారా నవ్వులు పూయిస్తాననే నమ్మకం ఉంది. తొలిసారి ఆహాతో కలిసి పనిచేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ ప్రాజెక్టు నా మనసుకు చాలా దగ్గరగా ఉంటుంది. ఈ షోని చూసి నా ఫ్యాన్స్ ఎంతలా ఆస్వాదిస్తారో చూడాలని ఉత్సాహంగా ఉంది. అని అన్నారు.