AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: మహేష్ అభిమానులను కన్నీళ్లు పెట్టిస్తోన్న వీడియో.. ఆయన చూస్తే గుండె చెరువు అవ్వాల్సిందే ?..

ఒక నటుడిగా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుని.. ప్రిన్స్.. సూపర్ స్టార్‏గా క్రేజ్ సంపాదించుకున్నారు మహేష్. ప్రస్తుతం

Mahesh Babu: మహేష్ అభిమానులను కన్నీళ్లు పెట్టిస్తోన్న వీడియో..  ఆయన చూస్తే గుండె చెరువు అవ్వాల్సిందే ?..
Mahesh Babu, Krishna
Rajitha Chanti
|

Updated on: Nov 20, 2022 | 3:53 PM

Share

సూపర్ స్టార్ కృష్ణ మరణాన్ని టాలీవుడ్ ఇండస్ట్రీ ఇంకా జీర్ణించుకోలేకపోతుంది. ఆయన మృతితో ఘట్టమనేని కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల తెలుగు చిత్రపరిశ్రమ ఘన నివాళి అర్పించింది. తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సాంకేతికతలను.. సరికొత్తదనాన్ని తీసుకువచ్చి.. వేలాది అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. దాదాపు 350కి పైగా చిత్రాల్లో నటించి అలరించారు. ఇక ఆయన వారసుడిగా బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన కృష్ణ తనయుడు మహేష్ బాబు.. ప్రస్తుతం సూపర్ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు.

ఒక నటుడిగా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుని.. ప్రిన్స్.. సూపర్ స్టార్‏గా క్రేజ్ సంపాదించుకున్నారు మహేష్. ప్రస్తుతం మహేష్ మనసు పడే వేదన వర్ణనాతీతం. ఒకే ఏడాదిలో నెలల వ్యవధిలోనే అన్నయ్య.. తల్లి.. తండ్రిని కోల్పోయి.. విషాదంలో మునిగిపోయారు. గుండె బద్దలయ్యేంత దుఃఖాన్ని పెదవి చాటున దాచేసి తన తండ్రి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మహేష్. మరోవైపు సోషల్ మీడియాలో కృష్ణ జ్ఞాపకాలను షేర్ చేసుకుంటున్నారు సూపర్ స్టార్ అభిమానులు..

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలోనే మహేష్ అభిమానులను ఓ వీడియో కన్నీళ్లు పెట్టిస్తోంది. అందులో తండ్రి కొడుకులను చూసి ఎమోషనల్ అవుతున్నారు. కృష్ణ, మహేష్ నటించిన సినిమాల్లోని కొన్ని షాట్స్, సాంగ్స్, ఎక్స్ ప్రెషన్స్.. సీన్స్ మ్యాచ్ చేస్తూ. సింక్ అయ్యేలా చేసిన 2.20 నిమిషాల నిడివిగల వీడియో నెట్టింట వైరలవుతుంది. అలాగే ఆ వీడియోలో తన తండ్రి గురించి మహేష్ చెప్పిన మాటలు.. ఆయనకు కృష్ణ పట్ల ఉన్న ప్రేమను తెలియజేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో చూసి భావోద్వేగానికి గురవుతున్నారు. స్టే స్ట్రాంగ్ మహేష్ అన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.