AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: యశోద జర్నీ చూశారా ?.. సామ్ కష్టం చూస్తే నోరెళ్లాబెట్టాల్సిందే.. డూప్ లేకుండానే యాక్షన్ సీన్స్..

యాక్షన్ సన్నివేశాల్లో సామ్ అదరగొట్టింది. ఓవైపు మయోసైటిస్ సమస్యతో బాధపడుతూనే.. యశోద సినిమాలోని యాక్షన్ సన్నివేశాల్లో నటించింది సమంత. తాజాగా యశోద జర్నీ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్.

Samantha: యశోద జర్నీ చూశారా ?.. సామ్ కష్టం చూస్తే నోరెళ్లాబెట్టాల్సిందే.. డూప్ లేకుండానే యాక్షన్ సీన్స్..
Samantha
Rajitha Chanti
|

Updated on: Nov 20, 2022 | 2:32 PM

Share

ప్రస్తుతం సమంత మయోసైటిస్ వ్యాధితో పోరాడుతుంది. గత కొద్దిరోజులుగా ఈ సమస్య వేధిస్తోన్నా.. పెదవిపై చెరగని చిరునవ్వుతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఆమె నటించిన యశోద సినిమా ఇప్పుడు థియేటర్లలో సక్సెస్‏ఫుల్ గా రన్ అవుతుంది. సరోగసి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగుతోపాటు.. హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలోనూ విడుదలైంది. అన్ని వర్గాల నుంచి మంచి టాక్ సొంతం చేసుకుంటూ భారీగా వసూళ్లు రాబడుతుంది. ఈ చిత్రంలో సామ్ నటనకు విమర్శకుల ప్రశంసలు అందుతున్నాయి. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో సామ్ అదరగొట్టింది. ఓవైపు మయోసైటిస్ సమస్యతో బాధపడుతూనే.. యశోద సినిమాలోని యాక్షన్ సన్నివేశాల్లో నటించింది సమంత. తాజాగా యశోద జర్నీ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్.

తాజాగా విడుదలైన వీడియోస్ సామ్.. రోప్ సాయం లేకుండా కొన్ని సీన్స్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఫైట్ సీన్స్‏లోనూ డూప్ లేకుండా నటించింది. ఓ ఫైట్ సీన్ లో చెంపపై పంచ్ పడడంతో అరగంట వరకు కోలుకోలేకపోయినట్లు సమంత చెప్పుకొచ్చింది. చెంప బూరెలా ఉబ్బిందని కూడా గుర్తు చేసుకుంది. అలాగే ఈ సినిమా విడుదలకు ముందు సుమతో సామ్ ఇంటర్వ్యూ.. మేకింగ్ షాట్స్ కలిపి ఓ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది.

డైరెక్టర్స్ హరి, హరీష్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంతతోపాటు.. వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలకపాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. ఇప్పటివరకు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 30 కోట్లు వరకు కలెక్ట్ చేసినట్లుగా టాక్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్