బడ్జెట్ రూ. 6 కోట్లు, వసూళ్లు రూ. 42 కోట్లు.. ఇంతకీ ఏంటా సినిమా? అంతలా ఏముంది.?
కథలో కంటెంట్ ఉండాలే కానీ ఎలాంటి భారీ ఆర్భాటాలు, తారాగణం లేని సినిమాలు కూడా సంచలన విజయం సాధిస్తాయని ప్రేక్షకులు చాటి చెబుతున్నారు. హీరో, హీరోయిన్లు ఎవరు.? దర్శకుడు ఎవరన్న విషయాలు తెలియక పోయినా బాక్సాఫీస్ ముందు..
కథలో కంటెంట్ ఉండాలే కానీ ఎలాంటి భారీ ఆర్భాటాలు, తారాగణం లేని సినిమాలు కూడా సంచలన విజయం సాధిస్తాయని ప్రేక్షకులు చాటి చెబుతున్నారు. హీరో, హీరోయిన్లు ఎవరు.? దర్శకుడు ఎవరన్న విషయాలు తెలియక పోయినా బాక్సాఫీస్ ముందు సంచలన విజయాలను అందుకొని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతున్నాయి. కాంతర, ఆండ్రాయిడ్ కట్టప్ప ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితాలో ఎన్నో సినిమాలు. తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో సినిమా వచ్చి చేరింది. అదే మలయాళ ఇండస్ట్రీకి చెందిన ‘జయ జయ జయహే’ సినిమా. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ జరుగుతోంది.
అక్టోబర్ 28న చిన్న చిత్రంగా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకొని ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకుంది. కేవలం రూ. 6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ. 42 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది. అంతేకాదు ఈ సినిమాను కేవలం 42 రోజుల్లోనే తెరకెక్కించడం విశేషం. బేసిల్ జోసెఫ్, దర్శన రాజేంద్రన్ జంటగా విపిన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అసాధారణ విజయాన్ని నమోదు చేసుకుంది. అత్యంత సహజంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల మదిని దోచింది.
ఇంతకీ ఈ సినిమా కథేంటంటే..
మధ్య తరగతికి చెందిన ఓ తెలివైన అమ్మాయి (దర్శన రాజేంద్రన్) చదువు పూర్తి కాకముందే కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు వివాహం చేసుకుంటుంది. ఆ తర్వాత భర్త ఆమెను శారీరకంగా హింసించడం మొదలు పెడతాడు. దీంతో భర్త (బేసిల్ జోసెఫ్) వేధింపులు భరించలేక తల్లిదండ్రులకు విషయాన్ని చెబుతుంది. అయితే వారు సర్దుకుపొమ్మని చెప్పడంతో.. తనకు ఎవరూ సాయం చేయరన్న నిజాన్ని గ్రహించిన హీరోయిన్ తన కష్టానికి ఎలా ముగింపు పలికింది అనేదే మిగతా కథా. మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ తెలుగు హక్కులను సొంతం చేసుకుంది. సినిమాను థియేటర్‌లో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. మరి తెలుగులో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..