Bruce Lee Death Mystery: 49 ఏళ్ల తరువాత వీడిన ‘బ్రూస్ లీ’ మరణ రహస్యం.. ఆయన మృతికి కారణం అదేనట..!
మార్షల్ ఆర్ట్స్ లెడెంజ్ బ్రూస్ లీ గురించి తెలియని వారు ఉండరు. పంచ్ ఇస్తే కెమెరా స్లో మోషన్‌కి కూడా చిక్కని వేగం ఆయన సొంతం. తనకున్న ఆ స్పెషాలిటీతోనే..
మార్షల్ ఆర్ట్స్ లెడెంజ్ బ్రూస్ లీ గురించి తెలియని వారు ఉండరు. పంచ్ ఇస్తే కెమెరా స్లో మోషన్‌కి కూడా చిక్కని వేగం ఆయన సొంతం. తనకున్న ఆ స్పెషాలిటీతోనే యావత్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు బ్రూస్ లీ. అయితే, బ్రూస్ లీ యుక్త వయసులోనే ప్రాణాలు కోల్పోయాడు. ఆయన మరణంపై రకరకాల ఊహాగానాలు, ప్రచారాలు జరిగాయి. హత్య అని కొందరు, కుట్ర అని కొందరు రకరకాల పుకార్లు షికారు చేశాయి. ఆ పుకార్లన్నింటినీ చెక్ పెడు ఆయన మరణ రహస్యాన్ని ఇన్నాళ్లకు తేల్చారు నిపుణులు. దాదాపు 49 ఏళ్ల తరువాత బ్రూస్ లీ మరణానికి కారణం ఏంటో కనిపెట్టారు నిపుణులు. నివేదిక ప్రకారం.. బ్రూస్ లీ ‘సెరిబ్రల్ ఎడెమా/మెదడు వాపు వ్యాధి’తో ప్రాణాలు కోల్పోయాడు.
శవ పరీక్ష సమయంలో బ్రూస్ లీ మెదడు 1,575 గ్రాముల వరకు ఉబ్బినట్లు వెల్లడైంది. ఇది సగటు 1,400 గ్రాముల కంటే ఎక్కువగా ఉంది. ఈ వాపు కారణంగానే బ్రూస్ లీ చనిపోయాడని పరిశోధకులు నిర్ధారించారు. Independent.co.uk నివేదించిన ప్రకారం.. హైపోనాట్రేమియా వల్ల ఎడెమా ఏర్పడిందని పరిశోధకులు పేర్కొన్నారు. అంతేకాదు.. కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా బ్రూస్ లీ ని వేధించాయని, అది కూడా అతను చనిపోవడానికి కారణమైందని శాస్త్రవేత్తలు క్లినికల్ కిడ్నీ జర్నల్‌లో ప్రచురించారు.
‘లీ.. అధికంగా నీటిని తీసుకోవడం, అంతే స్థాయిలో మూత్ర విసర్జన చేయకపోవడం వల్ల హైపోనాట్రేమియాకు దారి తీసింది. బ్రూస్ లీ మూత్రపిండాలు సరిగా పని చేయకపోవడం వల్లే ఇది జరిగింది. ఇది కూడా అతని మరణానికి కారణమైంది.’ అని పరిశోధకులు పేర్కొన్నారు. ‘బి వాటర్ మై ఫ్రెండ్’ అనే కోట్ లీ పేరిట ప్రసిద్ధి చెందింది. ఆ వాటరే అతని ప్రాణం తీసిందంటున్నారు నిపుణులు. మార్షల్ ఆర్ట్స్ చేసే సమయంలో లీ డైట్‌లో దాహాన్ని పెంచే జ్యూస్‌లు, ప్రోటీన్ డ్రింక్స్ బాగా తీసుకునేవారని నివేదిక పేర్కొన్నారు. అంతేకాదు.. లీ తన శరీరంలోని సోడియంను తొలగించడానికి, కండరాలు మరింత పెరగడానికి ప్రయోగాలు చేసినట్లు తెలిపారు. అంతేకాదు.. లీ చనిపోవడానికి ముందు.. నెలల్లో 10 నుంచి 20 సిరామిక్ బాటిల్ షేక్స్ తాగేవారని అతని సన్నిహితులు చెబుతున్నారు.
నివేదిక ప్రకారం.. లీ చనిపోయిన రోజు రాత్రి గంజాయి తాగి, అనంతరం నీరు తాగాడు. ఆ కొద్దిసేపటికే అంటే రాత్రి 7.30 గంటల సమయంలో తలనొప్పి, తల తిరగడం పరిస్థితి ఎదుర్కొన్నాడు. దాంతో అతను ఈక్వేజిక్ అనే పెయిన్ కిల్లర్ తీసుకుని పడుకున్నాడు. ఆ తరువాత 2 గంటల తరువాత అతనిలో ఎలాంటి చనలం, స్పందన కనిపించలేదు.
గమనిక: బ్రూస్‌లీ మరణం నిపుణులు తమ అభిప్రాయాన్ని మాత్రమే వెల్లడించారు. ఇదే కారణమని నిర్ధారించలేదు.(Source)
Bruce Lee is perhaps the greatest movie martial artist the world has ever seen ?
He died suddenly in 1973 at 32-years-old and the cause has been debated ever since, until now…
Let’s find out more ?https://t.co/K2s836Pmmm
— Metro (@MetroUK) November 18, 2022
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..