AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shraddha Walker: త్వరలోనే వెండితెరపై శ్రద్ధా వాకర్‌ మర్డర్‌ మిస్టరీ..! 35 ముక్కలైన ప్రేమకథా చిత్రం..! కథ, స్క్రిన్‌ప్లే ఎవరో తెలుసా..?

ప్రియుడి ముసుగులో ఉన్న నరరూప రాక్షసుడి చేతిలో బలైన ఆ అమ్మాయి పేరే శ్రద్దా వాకర్. ప్రేమించింది.. అతడితో పూర్తి జీవితం ఊహించుకుంది..

Shraddha Walker: త్వరలోనే వెండితెరపై శ్రద్ధా వాకర్‌ మర్డర్‌ మిస్టరీ..! 35 ముక్కలైన ప్రేమకథా చిత్రం..! కథ, స్క్రిన్‌ప్లే ఎవరో తెలుసా..?
Shraddha Walker
Rajitha Chanti
|

Updated on: Nov 21, 2022 | 3:08 PM

Share

దేశంలోని ప్రతి పౌరుడిని ఉలిక్కిపడేలా చేసింది ఓ పేరు. ఆమె హత్య జరిగిన విధానం.. కనీసం దహనసంస్కారాలకు కూడా నోచుకోకుండా ఎక్కడెక్కడో పడిసేన శరీరాభాగాలు.. ఆమె మర్డర్ కేసు అందరి హృదయాలను కదిలించింది. రోజుకో ట్విస్ట్ భయటపడుతుండడంతో సామాన్యులే కాదు.. పోలీసులు సైతం షాక్ అవుతున్నారు. ప్రియుడి ముసుగులో ఉన్న నరరూప రాక్షసుడి చేతిలో బలైన ఆ అమ్మాయి పేరే శ్రద్దా వాకర్. ప్రేమించింది.. అతడితో పూర్తి జీవితం ఊహించుకుంది.. కన్నవాళ్లు వద్దని వారిస్తే ప్రేమికుడి కోసం కుటుంబాన్నే వదిలేసింది. గత సంవత్సర కాలంగా తల్లిదండ్రులతో మాట్లాడుకుండా.. అతడిని పూర్తిగా నమ్మి.. ఆ మృగాడి చేతిలోనే దారుణ హత్యకు గురైంది. చివరకు కూతురి కోసం కన్నతండ్రి ఇచ్చి ఫిర్యాదుతో ఆమె హత్యోదంతం బయటకు వచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న శ్రద్ధావాకర్ హత్య కేసు ఇప్పుడు వెండితెరపైకి రాబోతుంది. ఈ కేసును సినిమాగా తెరకెక్కించనున్నట్లు బాలీవుడ్ డైరెక్టర్ మనీష్ సింగ్ తెలిపారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయని అన్నారు.

శ్రద్ధా వాకర్ హత్య కేసుపై సినిమా తీస్తున్నట్లు నిర్మాత-దర్శకుడు మనీష్ ఎఫ్ సింగ్ గురువారం ముంబైలో ప్రకటించారు. తాను తెరకెక్కించే సినిమా అఫ్తాబ్ తన ప్రేయసి శ్రద్దా వాకర్ హత్య నుంచి ప్రేరణ పొందిందని.. ఇప్పటికే ఈ స్క్రిప్ట్ పై పనిచేయడం స్టార్ట్ చేసినట్లు తెలిపారు. ప్రేమ, పెళ్లి అంటూ అబ్బాయిలను నమ్మి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్న అమ్మాయిలు.. వారికి లైఫ్ లేకుండా చేస్తున్న ప్రేమపిశాచాల గురించి ఈ సినిమాలో బయటపెడతానని అన్నారు. బృందావన్ ఫిల్మ్స్ పతాకంపై మనీష్ ఎఫ్ సింగ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఢిల్లీ చుట్టూ ఉన్న అడవుల వీడియో క్లిప్‌లను పరిశోధించి వాటిని సేకరించే పనిని ప్రారంభించారు అతని టీమ్. షూటింగ్ కోసం లొకేషన్ కూడా వెతుకుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఢిల్లీ పోలీసులు ఈ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసే వరకు సినిమా స్క్రిప్ట్ ఖరారు చేయబడదని తెలిపారు. ఛార్జ్ షీట్ మాత్రమే తమకు పూర్తి వివరాలు ఇవ్వగలదని అన్నారు. తన సినిమా పూర్తిగా శ్రద్ధా హత్య కేసు ఆధారంగా ఉండదని, దాని నుండి ప్రేరణ పొందుతుందని చెప్పారు. త్వరలోనే నటీనటులను అనౌన్స్ చేస్తామన్నారు.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్