Adipurush: బడ్జెట్ కాదు బాసూ.. ప్రజెంటేషన్ ముఖ్యం.. ఆ సినిమాతో పోలుస్తూ ఓం రౌత్‌పై ట్రోల్స్
మరోవైపు ఈ సినిమా టీజర్.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ఆదిపురుష్ టీజర్‌తో పోలూస్తూ ట్రోల్ చేస్తున్నారు. హనుమాన్ టీజర్ ఆదిపురుష్ కంటే వీఎఫ్ఎక్స్ మెరుగ్గా ఉందని.. తక్కువ బడ్జెట్లోనే అద్భుతంగా తెరకెక్కించారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరోసారి బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్‌ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. ఆదిపురుష్ సినిమా టీజర్‌ను తాజాగా విడుదలైన హనుమాన్ టీజర్‌తో పోలుస్తూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. బడ్జెట్ కాదు… ప్రజెంటేషన్ ముఖ్యమంటూ సలహాలు ఇస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజా సజ్జా ప్రధాన పాత్రలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న లేటేస్ట్ చిత్రం హనుమాన్. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ టీజర్ సోమవారం విడుదల చేశారు మేకర్స్. ఇందులో వీఎఫ్ఎక్స్.. ప్రెజెంటేషన్‌ను మెచ్చుకుంటూ డైరెక్టర్ ప్రశాంత్ వర్మపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు ఈ సినిమా టీజర్.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ఆదిపురుష్ టీజర్‌తో పోలూస్తూ ట్రోల్ చేస్తున్నారు. హనుమాన్ టీజర్ ఆదిపురుష్ కంటే వీఎఫ్ఎక్స్ మెరుగ్గా ఉందని.. తక్కువ బడ్జెట్లోనే అద్భుతంగా తెరకెక్కించారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ హనుమాన్ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నారు. అంజనాద్రి అనే కాల్పనిక గ్రామం నేపథ్యంలో తీసుకువస్తున్నారు. ఇందులో అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా విలువైన ఓ మణి కోసం సాగే పోరాటం నేపథ్యంలో తెరకెక్కినట్లు కనిపిస్తోంది. హనుమాన్ భారీ విగ్రహాన్ని చూపించిన విధానం అద్భుతంగా ఉంది. 1.41 నిమిషాల నిడివి ఉన్న టీజర్ ఆద్యంతం అద్భుతంగా ఉంది. తెలుగుతో పాటు మరికొన్ని భాషల్లో పాన్ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అబ్బుపరిచే విజువల్స్‌తో ఉన్న ఈ టీజర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది.
ఇక ఆదిపురుష్ విషయానికి వస్తే.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్నారు. ముందు నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్ మాత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. ఇందులో ప్రభాస్ .. సైఫ్ అలీ ఖాన్ లుక్స్ పై విమర్శలు వచ్చాయి. దీంతో సినిమాలో మరిన్ని మార్పులు చేస్తున్నట్లు ఇటీవల చిత్రయూనిట్ ప్రకటించింది.
HanuMan teaser out 200% better than Adipurush after watching HanuMan Teaser ???️ i can say Bollywood is a fraud and Black market Adipurush is not a 500 crores movie
Retweet#Adipurush #Bollywood #filmfare #HanuManTeaser #HanuMan #prabhas #KritiSanon pic.twitter.com/M6dqIEnELx
— Gautam Gada (@GautamGada) November 21, 2022
Hanuman teaser is 100000 batter than Adipurush ?jay shree ram#HanuManTeaser #Adipurush Thanks for this blockbuster teaser @PrasanthVarma sir and @tejasajja123 sir? pic.twitter.com/9T3hReXyix
— rajkanade?? (@RajKanade09) November 21, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.