Punch Prasad: జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ హెల్త్ అప్డేట్.. డాక్టర్స్ ఏమన్నారంటే..
చాలా రోజులుగా కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆయన.. ఇటీవల ఆరోగ్యం మరింత క్షీణించడంతో.. పూర్తిగా నడవలేని స్థితికి చేరుకున్నారు.
బుల్లితెరపై తన కామెడీ పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన పంచ్ ప్రసాద్ కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. చాలా రోజులుగా కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆయన.. ఇటీవల ఆరోగ్యం మరింత క్షీణించడంతో.. పూర్తిగా నడవలేని స్థితికి చేరుకున్నారు. వెన్ను భాగం నుంచి కాళ్ల వరకు చీము రావడంతో అడుగు కూడా వెయలేకపోతున్నాడంటూ.. అతని ఆరోగ్య పరిస్థితిని వ్లాగ్ చేసి పంచ్ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాడు మరో జబర్దస్త్ కమెడియన్ నూకరాజు. దీంతో అతను కోలుకోవాలని ఫాలోవర్స్, ప్రేక్షకులు కోరుకున్నారు.
అయితే తాజాగా పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి గురించి మరో వీడియో పోస్ట్ చేశాడు నూకరాజు. పంచ్ ప్రసాద్ ఆరోగ్యం కాస్త కోలుకున్నాడని.. ఓ మనిషి సాయం… లేదా కర్ర సాయంతో మెల్లగా నడుస్తున్నాడని చూపించాడు. గత నాలుగు రోజులుగా ఆయనకు చికిత్స జరుగుతుందని. అప్పటి నుంచి రోజంత సైలెన్స్ ఎక్కుతున్నాయని.. అతడికి ప్రత్యేకంగా ఓ నర్స్ ఇంట్లోనే ఉండి 24 గంటలు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. మరో నాలుగు రోజులు ఇలాగే చికిత్స తీసుకోవాలని.. సైలెన్స్ ద్వారా పంచ్ ప్రసాద్ కు యాంటి బయోటిక్స్ ఇస్తున్నారని పేర్కొన్నారు.
అలాగే పంచ్ ప్రసాద్ ఆసుపత్రికి వెళ్లి స్కానింగ్ కూడా చేయించుకున్నాడు. మరో వారం గడిచిన తర్వాతే ప్రసాద్ నడవగలడా ? లేదా ? అనే విషయం చెబుతామని డాక్టర్స్ చెప్పినట్లు వీడియోలో చెప్పుకొచ్చారు. దీంతో పంచ్ ప్రసాద్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.