Singer Mangli: సింగర్ మంగ్లీకి అరుదైన గౌరవం.. ఎస్‌వీబీసీ ఛానెల్ సలహాదారుగా నియామకం..

వాస్తవానికి మంగ్లీని ఎస్‌వీబీసీ ఛానెల్ సలహాదారుగా నియమిస్తూ.. ఈ ఏడాది మార్చి నెలలోనే ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం మంగ్లీ బాధ్యతలను స్వీకరించిన తర్వాత వెలుగులోకి వచ్చింది.

Singer Mangli: సింగర్ మంగ్లీకి అరుదైన గౌరవం.. ఎస్‌వీబీసీ ఛానెల్ సలహాదారుగా నియామకం..
singer mangli
Follow us
Surya Kala

|

Updated on: Nov 22, 2022 | 8:12 AM

తన గాత్రంతో జానపదులకు సొగసులు అద్దిన గాయని.. తెలంగాణ యాసతో ఆటపాటలతో తెలుగు రాష్ట్రాల్లో అభిమానులను సంపాదించుకున్న సింగర్  సత్యవతి రాథోడ్  అలియాస్ మంగ్లీ (28 ) అరుదైన గౌరవం అందుకున్నారు. మంగ్లీ టీటీడీకి చెందిన ఎస్‌వీబీసీ ఛానెల్ సలహాదారుగా నియమితులయ్యారు. ఈ పదవిలో మంగ్లీ రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. వాస్తవానికి మంగ్లీని ఎస్‌వీబీసీ ఛానెల్ సలహాదారుగా నియమిస్తూ.. ఈ ఏడాది మార్చి నెలలోనే ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం మంగ్లీ బాధ్యతలను స్వీకరించిన తర్వాత వెలుగులోకి వచ్చింది. నాలుగు రోజుల క్రితమే బాధ్యతలు తీసుకున్నట్లు తెలుస్తోంది.  ఈ పదవిని నిర్వహిస్తున్నందుకు మంగ్లీకి నెలకు రూ.లక్ష వేతనం ఇవ్వనున్నారు.

ఒక న్యూస్ ఛానెల్ లో కెరీర్ ని ప్రారంభించిన మంగ్లీ తన పాటలతో సంగీత ప్రేక్షకులను మళ్ళీ ఓ రేంజ్ లో అలరిస్తున్నారు. వర్థమాన టీవీ వాఖ్యాత, జానపద, సినీ గాయని, సినీ నటి. 2020లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ జానపద కళాకారిణిగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. అయితే ఈ స్థాయికి ఈజీగా చేరుకోలేదు.. ఒక చిన్న తండా లో పుట్టిన మంగ్లీ జర్నీ లో ఎన్నో కష్టాలు ఎత్తుపల్లాలు ఉన్నాయి. తనకు ఎదురైన ప్రతి కష్టాన్ని ఇష్టంగా ఎదుర్కొని ఈరోజు తనకంటూ ఓ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు మంగ్లీ. తాజాగా మంగ్లీకి ఎస్‌వీబీసీ ఛానెల్ లో పదవి రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి