Tiruchanoor: హంస వాహనంపై సరస్వతి అలంకారంలో సిరుల‌త‌ల్లి… జ్ఞానం, అజ్ఞానం మధ్య తేడాని గుర్తించమని..

పద్మావతి అమ్మవారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్క భజనలు , కోలాటాలు క‌ళాప్ర‌ద‌ర్శ‌న‌లు..

Tiruchanoor: హంస వాహనంపై సరస్వతి అలంకారంలో సిరుల‌త‌ల్లి... జ్ఞానం, అజ్ఞానం మధ్య తేడాని గుర్తించమని..
Hamsa Vahana Seva
Follow us

|

Updated on: Nov 22, 2022 | 8:39 AM

చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన సోమవారం రాత్రి హంస వాహనంపై సరస్వతి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి అమ్మవారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్క భజనలు , కోలాటాలు క‌ళాప్ర‌ద‌ర్శ‌న‌లు భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. కళాకారులు అమ్మవారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూరహారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.

హంసకున్న విలక్షణ ప్రతిభ ఏమిటంటే పాల‌ను, నీటిని వేరు చేయగలగడం. అలాగే యోగిపుంగవులు కూడా జ్ఞానం, అజ్ఞానం తెలిసి మెలగుతారు. అలాంటి మహాయోగి పుంగవుల హృదయాలలో జ్ఞానస్వరూపిణియైన అలమేలుమంగ విహరిస్తూ ఉంటుంది. జ్ఞానార్జనకై సరస్వతీదేవిని ఉపాసించే సాధకులు ”హంసవాహన సంయుక్తా విద్యాదానకరీ మమ” అని ఆ తల్లిని ఆరాధిస్తారు.

తిరుపతి యాత్రకు వెళ్లిన భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం తిరుచానూరులో కొలువై ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోవాలి.. లేదంటే ఆ యాత్రకు ఫలం లభించదని ప్రతీతి. శ్రీవారి ఆలయంలో జరిగిన విధంగానే ప్రతి రోజు అలిమేలు అమ్మకు పూజాభిషేకాలు నిర్వహిస్తారు. . ప్రతి సోమవారం “అష్టదళ పదపద్మారాధన” జరుగుతుంది. శుక్రవారం అభిషేకం జరుగుతుంది. గురువారం తిరుప్పావడ సేవ ఉంటుంది.శ్రావణమాసంలోను, మరి కొన్ని ముఖ్య రోజుల్లోనూ లక్ష్మీపూజను నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..