jagananna gorumudda: విద్యార్థుల్లో శారీరక దృఢత్వాన్ని పెంచేందుకు సర్కారు బడుల్లో కొత్త మెనూ.. నేటి నుంచి అమలు
జగనన్న గోరుముద్ద, మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు చోటు చేసుకున్నాయి. సీఎం జగన్ ఆదేశాల మేరకు కొత్త మెనూ తయారు చేసి.. నేటి నుంచి అమలు చేయనున్నారు.

నేటి బాలలే రేపటి పౌరులు.. సర్కారీ బడుల్లో చదువుకునే సమయంలో స్టూడెంట్స్ మంచి ఆరోగ్యంగా ఉండడం పౌష్టికాహారాన్ని ఏపీ ప్రభుత్వం అందిస్తోంది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడానికి అమలు చేస్తోన్న జగనన్న గోరుముద్ద, మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు చోటు చేసుకున్నాయి. సీఎం జగన్ ఆదేశాల మేరకు కొత్త మెనూ తయారు చేసి.. నేటి నుంచి అమలు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు పోషక విలువలతో కూడిన ‘ గోరుముద్ద ‘ ను ప్రభుత్వం వడ్డించనుంది. ఈ మేరకు పాఠశాల విద్యా విభాగం మిడ్ డే మీల్స్ డైరెక్టర్ ఉత్తర్వు లు జారీ చేశారు. విద్యార్థినీ, విద్యార్థులకు పోషకాహారంతో కూడిన మెనూను పక్కాగా అమలు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
మెనూ వివరాలు:
సోమవారం : ప్రస్తుత మెనూ: అన్నం, పప్పుచారు, కోడిగుడ్డుకూర, చిక్కీ ఉండగా..




కొత్తమెనూ : హాట్‌పొంగల్, ఉడికించిన కోడిగుడ్డు/ కూరగాయల పులావ్, కోడిగుడ్డుకూర, చిక్కీ
మంగళవారం : ప్రస్తుతం: చింతపండు/నిమ్మకాయ పులిహోర,టమాట పప్పు, ఉడికించిన కోడిగుడ్డు
కొత్తమెనూ: చింతపడు/నిమ్మకాయ పులిహోరా, టమాట పచ్చడి/దొండకాయ పచ్చడి, ఉడికించిన కోడిగుడ్డు
బుధవారం : ప్రస్తుతం: కూరగాయల అన్నం, బంగళాదుంపకుర్మా, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ
కొత్తమెనూ: కూరగాయల అన్నం, బంగాళదుంపకుర్మా, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ
గురువారం : ప్రస్తుతం: కిచిడి, టమాటపచ్చడి, ఉడికించిన కోడిగుడ్డు
కొత్తమెనూ: సాంబార్‌బాత్, ఉడికించిన కోడిగుడ్డు
శుక్రవారం : ప్రస్తుతం: అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ
కొత్తమెనూ: అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ
శనివారం : ప్రస్తుత మెనూ: అన్నం, సాంబార్, తీపిపొంగలి
కొత్తమెనూ: ఆకుకూర అన్నం, పప్పుచారు, తీపిపొంగలి.
ఈ కొత్త మెనూ నేటి నుంచి ఏపీలోని సర్కారు బడుల్లో అమలు కానుంది. విద్యార్థుల్లో శారీరక దృఢత్వాన్ని పెంపొందించేందుకు పోషకవిలువలతో కూడిన భోజనం అందించనున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..