Superstar Krishna: కృష్ణానదిలో కృష్ణ అస్థికల నిమజ్జనం.. ఉండవల్లి కరకట్ట వద్దకు చేరుకున్న మహేష్, త్రివిక్రమ్..
సూపర్ స్టార్ కృష్ణ అస్థికలను నేడు కృష్ణానదిలో నిమజ్జనం చేయనున్నారు. తండ్రి అస్థికలను నిమజ్జనం చేయడం కోసం ఇప్పటికే ప్రిన్స్ మహేష్ బాబు విజయవాడ చేరుకున్నారు.

సనాతన హిందూ ధర్మంలో మరణించిన వ్యక్తి చిన కర్మ అయిన తర్వాత అతని అస్థికలను పుణ్య నదుల్లో నిమజ్జనం చేస్తారు. ఇలా చేయడం వలన తమ కుటుంబ సభ్యులకు సద్గతులు కలుగుతాయని విశ్వాసం.. ఈ నేపథ్యంలో ఇటీవల తుదిశ్వాస విడిచిన సూపర్ స్టార్ కృష్ణ అస్థికలను కృష్ణా నది సహా దేశంలోని పవిత్ర నదుల్లో నిమజ్జనం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ముందుగా కృష్ణ అస్థికలను నేడు కృష్ణానదిలో నిమజ్జనం చేయనున్నారు. తండ్రి అస్థికలను నిమజ్జనం చేయడం కోసం ఇప్పటికే ప్రిన్స్ మహేష్ బాబు విజయవాడ చేరుకున్నారు.
మహేష్ బాబు తో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆయన బావ ఎంపీ గల్లా జయదేవ్, మహేష్ బాబు బాబాయ్ శేషగిరిరావు, నాగ సుధీర్, సూర్య సహా పలువురు హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి కారులో కృష్ణా నది ఉండవల్లి కరకట్ట మీద ఉన్న ధర్మనిలయం వద్దకు మహేష్ బాబు సహా కృష్ణ కుటుంబ సభ్యులు చేరుకున్నారు. కృష్ణానదిలో కృష్ట అస్తికలు కలిపి, శాస్త్రోక్తమైన కార్యక్రమాలు నిర్వహించనున్నారు మహేష్ బాబు.




Mahesh Babu Reached Gannavaram Airport. pic.twitter.com/XsUzSew2Cx
— Naveen MB Vizag (@NaveenMBVizag) November 21, 2022
మహేష్ బాబు విజయవాడ రాక సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. కృష్ణా ఘాట్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..