Happy Birthday Allu Arha: అల్లు అర్జున్ ముద్దుల తనయ అల్లరి పిల్ల అర్హ పుట్టిన రోజు నేడు.. తండ్రికి కందిరీగలు కథ వినిపిస్తోన్న కూతురు
నేడు అర్హ పుట్టిన రోజు. దీంతో ఓ వీడియో షేర్ చేసిన బన్నీ హ్యాపీ బర్త్ డే మై క్యూట్ బేబీ అర్హ అని శుభాకంక్షాలు తెలిపాడు.. అంతేకాదు తనకు తన కూతురు కందిరీగలు గురించి తండ్రికి చెబుతున్న ఓ వీడియో ఒకటి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు బన్నీ.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఎంత ఫేమస్సో.. బన్నీ ముద్దుల తనయ అర్హ కూడా అంతే ఫేమస్.. ముద్దు ముద్దు మాటలు, చిలిపి శేష్ఠలు, అల్లరితో అందరినీ ఆకట్టుకుంటుంది అల్లు అర్జున్, స్నేహల కూతురు. తండ్రి, కూతురు కలిసి చేసే సందడి సంబంధించిన వీడియోలు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. నేడు అర్హ పుట్టిన రోజు. దీంతో ఓ వీడియో షేర్ చేసిన బన్నీ హ్యాపీ బర్త్ డే మై క్యూట్ బేబీ అర్హ అని శుభాకంక్షాలు తెలిపాడు.. అంతేకాదు తనకు తన కూతురు కందిరీగలు గురించి తండ్రికి చెబుతున్న ఓ వీడియో ఒకటి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు బన్నీ.
తన కూతురికి కందిరీగలు అంటే భయపడవద్దు అని చెబుతుంటే.. కాదు.. భయం వేస్తుంది.. ఎందుకంటే చాలా ఎక్కువ కందిరీగలున్నాయి అని అర్హ మాటలకు యాక్షన్ జతచేసి మరీ అక్కడ సన్నివేశాన్ని విస్తరిస్తోంది తండ్రికి. తమ ఇంట్లో కింద ప్లోర్ లో ఉన్న కందిరీగలు అక్కడ ఉన్న వాళ్ళ జుట్టులోకి వెళ్తున్నదని చెబుతోంది.. అర్హ స్టోరీ చెబుతోన్న వీడియో ప్రస్తుతం ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఫ్యాన్స్ అర్హకు ఫుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.
View this post on Instagram
అర్హ ‘శాకుంతలం’ సినిమాతో వెండి తెర ఎంట్రీ ఇచ్చిందీ చిన్నారి. తొలి సినిమాలోనే తన అద్భుత నటనతో ఆకట్టుకుంది అర్హ. అంతేకాదు అల్లు అర్హ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. అత్యంత పిన్న వయసులోనే చెస్‌లో శిక్షణ ఇస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే అత్యంత తక్కువ వయసులోనే ప్రఖ్యాత నోబుల్ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..