AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Rains: తీరం అల్లకల్లోలం.. ఏపీకి వాయుగుండం హెచ్చరిక.. ఈ జిల్లాలకు భారీ వర్షాలు!

నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతోన్న తీవ్ర అల్పపీడనం ఆదివారం నాటికి వాయుగుండంగా మారిందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

AP Rains: తీరం అల్లకల్లోలం.. ఏపీకి వాయుగుండం హెచ్చరిక.. ఈ జిల్లాలకు భారీ వర్షాలు!
Ap Rains
Ravi Kiran
|

Updated on: Nov 21, 2022 | 8:45 AM

Share

నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతోన్న తీవ్ర అల్పపీడనం ఆదివారం నాటికి వాయుగుండంగా మారిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ.. అదే రోజు రాత్రి చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశగా 570 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఈ వాయుగుండం రానున్న 24 గంటల్లో ఉత్తర తమిళనాడు-దక్షిణ కోస్తాంద్ర తీరాల వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అనంతరం అది క్రమంగా అల్పపీడనంగా బలహీనపడుతుందని అంచనా వేసింది. చెన్నై-నెల్లూరు మధ్య తీరం దాటనుందని తెలిపింది. దీని ప్రభావంతో సోమవారం, మంగళవారాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది. దక్షిణ కోస్తాలోని ప్రకాశం, నెల్లూరు, శ్రీహరికోట, మహాబలిపురం, తిరుపతి జిల్లాల్లో.. రాయలసీమలోని చిత్తూరు, వైఎస్‌ఆర్ జిల్లా, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే రెండు రోజులు దక్షిణ కోస్తాంద్ర, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులు కూడా సంభవించవచ్చునని వివరించింది.

మరోవైపు దక్షిణ కోస్తా, తమిళనాడు తీరం వెంబడి 45-55 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఆదివారం తిరుపతి జిల్లాలో సముద్రం అల్లకల్లోలంగా మారడంతో చిల్లకూరు, కోట, వాకాడు, సూళ్లూరుపేట, తడ మండలాల తీర ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ రెండు రోజులు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఆదేశాలు జారీ చేసింది. కాగా, వాయుగుండం ప్రభావంతో కోస్తా జిల్లాల్లో చలి తీవ్రత బాగా పెరిగింది. ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోయాయి. అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో దట్టంగా పొగమంచు కురుస్తోంది. అరకు, పాడేరు, చింతపల్లిలో 17 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అల్లూరి జిల్లా మినుములూరులో 10, పాడేరులో 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

Follow Us
50 ఏళ్ల తర్వాత కలుసుకున్న స్కూల్ ఫ్రెండ్స్..1976 బ్యాచ్ రీయూనియన్
50 ఏళ్ల తర్వాత కలుసుకున్న స్కూల్ ఫ్రెండ్స్..1976 బ్యాచ్ రీయూనియన్
ఏపీలో పేషెంట్లకు గుడ్‌న్యూస్‌.. రూ.75 వేల విలువ టెస్ట్‌ ఉచితం..!
ఏపీలో పేషెంట్లకు గుడ్‌న్యూస్‌.. రూ.75 వేల విలువ టెస్ట్‌ ఉచితం..!
జై గణేశా.. జై జై గణేశా..! వినాయకుడికి హెలికాప్టర్‌తో పూల వర్షం..
జై గణేశా.. జై జై గణేశా..! వినాయకుడికి హెలికాప్టర్‌తో పూల వర్షం..
యజమాని అంతిమ యాత్రలో శునకం..
యజమాని అంతిమ యాత్రలో శునకం..
ఈ వారం ఓటీటీలోకి టెన్షన్ పుట్టించే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు..
ఈ వారం ఓటీటీలోకి టెన్షన్ పుట్టించే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు..
వెస్టిండీస్‌తో తొలి వన్డే.. ఓపెనర్లుగా ఎవరంటే?
వెస్టిండీస్‌తో తొలి వన్డే.. ఓపెనర్లుగా ఎవరంటే?
నీటి గెడ్డలో ఏదో కదలిక.. ఏంటా అని వెళ్లి చూడగా..
నీటి గెడ్డలో ఏదో కదలిక.. ఏంటా అని వెళ్లి చూడగా..
రాజకీయాల్లోకి టీమిండియా స్టార్ ప్లేయర్.. ఆర్ఎల్‌డీ చీఫ్‌తో భేటీ
రాజకీయాల్లోకి టీమిండియా స్టార్ ప్లేయర్.. ఆర్ఎల్‌డీ చీఫ్‌తో భేటీ
జామకాయతో ఎప్పుడైనా ఇలా కూర చేశారా? 10 నిమిషాల్లో ప్రోటీన్, ఫైబర్
జామకాయతో ఎప్పుడైనా ఇలా కూర చేశారా? 10 నిమిషాల్లో ప్రోటీన్, ఫైబర్
ఏమి తినబుద్ది కానప్పుడు ఇది ట్రై చేయండి.. వేడి అన్నంలో తింటుంటే..
ఏమి తినబుద్ది కానప్పుడు ఇది ట్రై చేయండి.. వేడి అన్నంలో తింటుంటే..