Pawan Kalyan: రాణి లక్ష్మీ బాయి స్ఫూర్తితో మహిళలు రాజకీయాల్లోకి రావాలి.. జనసేనాని పవన్ కల్యాణ్ పిలుపు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీ ఆఫీస్ లో రాణి లక్ష్మీ బాయి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భారీగా జనసేన మహిళా నేతలు, కార్యకర్తలు పాల్గొనున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..
స్వాతంత్య్ర సమరయోధులు ఝాన్సీ లక్ష్మీబాయి 194వ జయంతి నేడు. ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం నవంబర్ 19 న బ్రిటిష్ వారిపై పోరాడిన తొలితరం మహిళా స్వాతంత్య సమరయోధురాలి జయంతిని దేశం ఘనంగా జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీ ఆఫీస్ లో రాణి లక్ష్మీ బాయి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భారీగా జనసేన మహిళా నేతలు, కార్యకర్తలు పాల్గొనున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రాణి లక్ష్మీ బాయి మాతృభూమి రక్షణ కోసం చేసిన పోరాటం స్ఫూర్తినివ్వాలని ఆమె స్ఫూర్తిని వీరమహిళలు పుణికి పుచ్చుకోవాలని తెలిపారు.
రాజకీయ నాయకులు అంటే గొంతెసుకుని పడిపోవడం, నోటికొచ్చినట్లు తిట్టడం కాదని.. చదువుకున్న వాళ్ళు పాలనా పరమైన విధానపరమైన పాలసీలపై అవగాహన కలిగిన మహిళలు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు జనసేనాని. సాధారణ కుటుంబాల నుంచే అలాంటి మహిళలు వస్తారని పేర్కొన్నారు. రాజకీయాల్లో బాధ్యత కలిగిన మహిళా నాయకులు ఉండాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు.
నుదుట కుంకుమ లేకపోయినా పర్వాలేదు.. దైర్యం కోల్పోవద్దని చెప్పి తన భర్త ఖడ్గ తిక్కనను యుద్ధానికి పంపిన భార్య , తల్లి వంటి మహిళలే జనసేన పార్టీకి స్ఫూర్తిదాయకం అని అన్నారు పవన్ కళ్యాణ్.
1857 మొదటి భారత స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న ప్రముఖ వ్యక్తులలో లక్ష్మీబాయి ఒకరు. రాణి లక్ష్మీ బాయి నవంబర్ 19న (మణికర్ణిక) జన్మించారు. బితూర్ జిల్లాకు చెందిన పీష్వా బాజీ రావు II వద్ద మణికర్ణిక తండ్రి పనిచేసేవారు. దీంతో ఝాన్సీ పీష్వా బాజీ రావు వద్ద పెరిగారు. రాణి లక్ష్మీ బాయి జూన్ 17, 1958న బ్రిటిష్ వలస పాలకులతో పోరాడుతూ మరణించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..