AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Weather: బంగాళాఖాతంలో అల్పపీడనం.. వాయుగుండంగా మారే చాన్స్.. ఏపీకి భారీ వర్షసూచన

రానున్న రెండు రోజుల్లో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వానలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.

AP Weather: బంగాళాఖాతంలో అల్పపీడనం.. వాయుగుండంగా మారే చాన్స్.. ఏపీకి భారీ వర్షసూచన
Andhra Pradesh Weather Update
Ram Naramaneni
|

Updated on: Nov 19, 2022 | 3:10 PM

Share

దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతం, దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా నైరుతి, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై రాగల 24 గంటల్లో వాయుగుండంగా కేంద్రీకృతం అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత, తదుపరి 2 రోజులలో ఇది పశ్చిమ వాయువ్య దిశగా తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు కదులుతూ కొనసాగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, యానాం లలో దిగువ ట్రోపోస్పిరిక్ స్థాయిలలో ఈశాన్య గాలులు వీస్తాయి. ఈ క్రమంలో ఏపీలోని పలు ప్రాంతాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ.

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :–

ఈ రోజు, రేపు, ఎల్లుండి :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-

ఈ రోజు :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

రేపు :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.

ఎల్లుండి:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. మెరుపులతో కూడిన ఉరుములు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

రాయలసీమ :-

ఈ రోజు:  వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది.

రేపు:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది

ఎల్లుండి:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. మెరుపులతో కూడిన ఉరుములు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
యువతలో గుండెపోటు మరణాలు పెరగడానికి అసలు కారణం ఇదే
యువతలో గుండెపోటు మరణాలు పెరగడానికి అసలు కారణం ఇదే
ధోనీ అభిమానులకు గుడ్‌న్యూస్.. రీఎంట్రీ డేట్ ఫిక్స్
ధోనీ అభిమానులకు గుడ్‌న్యూస్.. రీఎంట్రీ డేట్ ఫిక్స్
నకిలీ టూత్‌పేస్ట్‌ను చిటికెలో కనిపెట్టే 'స్మార్ట్' టిప్స్ ఇవే!
నకిలీ టూత్‌పేస్ట్‌ను చిటికెలో కనిపెట్టే 'స్మార్ట్' టిప్స్ ఇవే!
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక
శ్రీవారి భక్తులకు హెచ్చరిక! వీఐపీ దర్శనం పేరుతో మోసపోకండి
శ్రీవారి భక్తులకు హెచ్చరిక! వీఐపీ దర్శనం పేరుతో మోసపోకండి