Sonu Sood: సోనూ సూద్ భార్యకు రోడ్డు ప్రమాదం.. పరిస్థితి ఎలా ఉందంటే..
మంగళవారం ముంబై-నాగ్‌పూర్ హైవేపై జరిగిన ఒక పెద్ద ప్రమాదంలో సోను సూద్ భార్య సోనాలి సూద్ గాయపడినట్లు సమాచారం. సోనాలి తన సోదరి కుమారుడు, మరో మహిళతో ప్రయాణిస్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

టాలీవుడ్ నటుడు సోనూ సూద్ భార్య సోనాలీ సూద్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఈరోజు ఉదయం ఆమె తన సోదరి కుమారుడితోపాటు మరో మహిళతో కలిసి వస్తుండగా.. వారి కారును ముంబై-నాగ్‌పూర్ హైవేపై ఓ ట్రక్కు ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ఘటనలో సోనాలి సూద్ తీవ్రంగా గాయపడగా.. ఆమె సోదరి కుమారుడు, మరో మహిళ సురక్షితంగా బయటపడ్డారు. అలాగే ఈ ఘటనలో వారి కారు తీవ్రంగా దెబ్బతింది. వెంటనే సోనాలిని నాగ్ పూర్ లోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటన గురించి తెలుసుకున్న సోనూసూద్ వెంటనే నాగ్ పూర్ బయలుదేరారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని సోనూసూద్ ప్రతినిధి వెల్లడించారు. యాక్సిడెంట్ ఎలా జరిగిందనే వివరాలు బయటకు రావాల్సి ఉంది.
సోను సూద్ చివరిసారిగా ఫతేలో కనిపించాడు. ఈ చిత్రం కోవిడ్-19 మహమ్మారి సమయంలో నిజ జీవిత సైబర్ క్రైమ్ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..