Chhaava Movie: పార్లమెంట్‌లో ఛావా స్పెషల్ షో! విక్కీ, రష్మికల సినిమాను వీక్షించనున్న ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు!
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఛావా. ఎలాంటి అంచనాలు లేకుండా గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పీరియాడికల్ మూవీ ఏకంగా రూ. 750 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

బాలీవుడ్ స్టార్ నటుడు విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం ఛావా. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా మరాఠీ దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఏ మాత్రం అంచనాలు లేకుండా ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలైన ఛావా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కనీవినీ ఎరుగని కలెక్షన్లు సాధించింది. ముఖ్యంగా ఒక మంచి సినిమా విజయం కోసం ఎదురు చూస్తోన్న బాలీవుడ్ కు ఛావా ఊపిరిపోసింది. నార్త్ ఇండియన్స్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. రిపీటెడ్ గా థియేటర్లకు క్యూ కట్టారు. ఇప్పటివరకు ఈ సినిమా ఏకంగా రూ. 750 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఇక మార్చి 7న ఛావా తెలుగు వెర్షన్ రిలీజ్ కాగా ఇక్కడ కూడా మంచి స్పందన వచ్చింది. కాగా ఇప్పుడీ పీరియాడికల్ మూవీకి అరుదైన గౌరవం దక్కనున్నట్లు తెలుస్తోంది. భారత ప్రభుత్వం ఛావా సినిమాను పార్లమెంట్ లో ప్రత్యేకంగా ప్రదర్శించాలని భావిస్తున్నట్లు సమాచారం. గురువారం (మార్చి 27) పార్లమెంటు బాలయోగి ఆడిటోరియంలో ఛావా స్పెషల్ స్క్రీనింగ్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రత్యేక ప్రదర్శనను వీక్షించేందుకు ప్రధాన మంత్రి న నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరవుకానున్నారట. అలాగే విక్కీ కౌశల్, రష్మికతో సహా చిత్ర బృందం మొత్తం ఈ స్పెషల్ స్క్రీనింగ్ కు హాజరవుతుందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం లేదా చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
కాగా గతంలో ది కశ్మీర్ ఫైల్స్, సబర్మతీ రిపోర్ట్ సినిమాలు పార్లమెంట్ లో స్పెషల్ స్క్రీనింగ్ కు నోచుకున్నాయి. ప్రధాని మోడీతో సహా కేంద్ర మంత్రులందరూ ఈ సినిమాలను ప్రత్యేకంగా వీక్షించారు. ఇప్పుడు ఛావా కూడా ఈ జాబితాలో చేరనుంది. శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ పీరియాడికల్ మూవీకి కొన్ని రాష్ట్రాల్లో పన్ను మినహాయింపు కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.
మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్ పై దినేష్ విజన్ నిర్మించిన ఛావా సినిమాలో అక్షయ్ ఖన్నా ఔరంగజేబుగా క్రూరత్వం పండించాడు. అలాగే డయానా పెంటీ, అశుతోష్ రాణా, దివ్య దత్తా, వినీత్ కుమార్ సింగ్, సంతోష్ జువేకర్, అలోక్నాథ్, ప్రదీప్ రావత్ తదితర ప్రముఖులు ఈ సినిమాలో వివిధ పాత్రల్లో మెరిశారు. ఇక ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం సినిమా విజయంలోప్రధాన పాత్ర పోషించింది.
తెలుగు రాష్ట్రాల్లో చావా థియేటర్లలో పరిస్థితి ఇది..
Patriotism and pride in every heart!🤩
The heartfelt tribute to the glorious warrior, Chhatrapati Sambhaji Maharaj, has become an emotion for everyone in India💥🙏
Hindavi Swaraj blockbuster #ChhaavaTelugu roaring in cinemas now❤️🔥
Release by #GeethaArtsDistributions 🎟… pic.twitter.com/vBjZweT9Qs
— Geetha Arts (@GeethaArts) March 17, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.