Neha Kakkar: స్టేజ్ పైనే పరువు తీసిన ఫ్యాన్స్.. దెబ్బకు బోరున ఏడ్చిన సింగర్.. ఏం జరిగిందంటే..
సాధారణంగా జనాలు సినీతారలను అడియన్స్ ఎంతగా ప్రేమిస్తారో.. అంతే విమర్శిస్తారు. సెలబ్రేటీలు చేసే పొరపాట్లతో ఫ్యాన్స్ నోటికొచ్చినట్లు తిడుతుంటారు. తాజాగా బాలీవుడ్ సింగర్ నేహా కక్కర్ విషయంలోనూ అదే జరిగింది. ఫ్యాన్స్ చేసిన పనికి దెబ్బకు స్టేజ్ పైనే బోరున ఏడ్చేసింది. అసలు ఏం జరిగిందంటే..

బాలీవుడ్ సింగర్ నేహా కక్కర్ గురించి చెప్పక్కర్లేదు. హిందీలో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే హిందీలో ఫేమస్ అయిన ఇండియన్ ఐడల్ సింగింగ్ షోకు జడ్జీగా వ్యవహరించి మరింత ఫేమస్ అయ్యారు. పాటలతోనే కాకుండా పర్సనల్ విషయాలతోనూ నిత్యం వార్తలలో నిలుస్తుంటుంది నేహా. అయితే సింగింగ్ షోలలో జడ్జిమెంట్ ఇస్తూ ప్రతిసారి కన్నీళ్లు పెట్టుకుంటుంది నేహా. దీంతో ఆమె కావాలని డ్రామా చేస్తుందని నెటిజన్స్ ట్రోల్ చేస్తుంటారు. తాజాగా ఆమె తీరుపై ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల మెల్‌బోర్న్‌లో సింగర్ నేహా కక్కర్ లైవ్ కాన్సర్ట్ నిర్వహించారు. అయితే ఈ కచేరీకి నేహా కక్కర్ గంట కాదు.. ఏకంగా మూడు గంటలు ఆలస్యంగా వచ్చింది.
సాయంత్రం ఏడున్నరకు ప్రోగ్రాంకు రావాల్సి ఉండగా.. నేహా కక్కర్ ఏకంగా మూడు ఆలస్యంగా వచ్చి కేవలం గంట పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. దీంతో టికెట్ కొని ఆమె షో కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. స్టేజ్ పై నేహా కక్కర్ పాటలు పాడుతుండగానే.. గో బ్యాక్.. హోటల్ కు వెళ్లి రెస్ట్ తీసుకో అంటూ అరుస్తూ సీరియస్ అయ్యారు. దీంతో ఏం చేయాలో తెలీక స్టేజీపైనే బోరున ఏడ్చేసింది. నేహా మాట్లాడేందుకు ప్రయత్నిస్తుడంగా అభిమానులు మరింత ఫైర్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది.
ఈ వీడియోను ఓ యూజర్ షేర్ చేస్తూ.. “7.30 షో కోసం రాత్రి 10 గంటలకు స్టేజ్ పైకి వచ్చారు. ఆ తర్వాత ఏడుస్తూ నాటకం ఆడారు. స్టేజ్ పై గంట మాత్రమే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇది చెత్త కచేరీ” అంటూ రాసుకోచ్చారు. మెల్‌బోర్న్ షోకు ముందు, నేహా సిడ్నీలో ప్రదర్శన ఇచ్చింది.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..