Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood:అజితే కాదు ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కూడా కార్ రేసరే.. డేరింగ్ అండ్ డ్యాషింగ్.. ఎవరంటే?

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఈ మధ్యన సినిమాలతో పాటు కార్ రేసుల్లోనూ దూసుకుపోతున్నాడు. కప్పుల మీద కప్పులు కొట్టేస్తున్నాడు. అయితే అజిత్ తో పాటు ఒక టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కార్ రేసుల్లో రయ్ రయ్ మంటూ దూసుకెళ్లుతోంది. ఆమె ఎవరంటే?

Tollywood:అజితే కాదు ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కూడా కార్ రేసరే.. డేరింగ్ అండ్ డ్యాషింగ్.. ఎవరంటే?
Tollywood Actress
Follow us
Basha Shek

|

Updated on: Mar 25, 2025 | 5:29 PM

బైక్ అండ్ కార్ రేసింగుల్లో పాల్గొనాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఈ పోటీల్లో చిన్న తప్పు జరిగినా ఘోర ప్రమాదాలు జరుగుతుంటాయి. ప్రాణాలు గాల్లో ఉంటాయి. అందుకే ఈ రేసింగ్ గేమ్ లో పాల్గొనాలంటే డేరింగ్ అండ్ డ్యాషింగ్ పర్సన్సే అయి ఉండాలి. ప్రస్తుతం స్టార్ హీరో అజిత్ కుమార్ కార్ రేసుల్లో రయ్ రయ్ మంటూ దూసుకెళుతున్నాడు. ప్రమాదాలు జరుగుతున్నా జంకకుండా వరుసగా పోటీల్లో పాల్గొంటున్నాడు. తాజాగా ఇటలీలో జరిగిన పోటీల్లోనూ అజిత్ అండ్ టీమ్ మూడో స్థానంలో నిలిచింది. అయితే సినిమా ఇండస్ట్రీలో అజిత్ తో పాటు మరో టాలీవుడ్ హీరోయిన్ కూడా కారు రేసుల్లో సత్తా చాటుతోంది. చిన్నప్పటి నుంచి కార్లపై మోజు పెంచుకున్న ఈ ముద్దుగుమ్మ ఫార్ములా కార్ రేస్ కార్ ట్రైనింగ్ ప్రోగ్రాం లెవల్ 1ని పూర్తి చేసింది. ఇప్పటికే ఈ పోటీల్లో పలు పతకాలు కూడా సాధించింది. ప్రస్తుతం సినిమాలతోనే బిజిగా ఉంటోన్న ఈ ముద్దుగుమ్మ తీరిక దొరికనప్పుడల్లా కారు రేసుల్లో పాల్గొంటోంది. మరి ఈ డేరింగ్ అండ్ డ్యాషింగ్ బ్యూటీ ఎవరో కనిపెట్టారా? తను మరెవరో కాదు తెలుగుతో పాటు తమిళ్ లో వరుసగా సినిమాలు చేస్తోన్న నివేదా పేతురాజ్.

నిజం చెప్పాలంటే నివేదా పేతురాజ్ మల్టీ ట్యాలెంటెడ్ వుమన్. తన నటనతో ఆకట్టుకోవడమే కాకుండా కార్ రేసింగ్, బ్యాడ్మింటన్ పోటీల్లోనూ సత్తా చాటుతోంది. ముఖ్యంగా ఈ మధ్యన తన తమ్ముడితో కలిసి ఫార్ములా కారు రేసింగ్‌లో పార్టిసిపేట్ చేస్తూనే ఉంటుంది. ” గతంలో కార్ రేసింగ్ ఛాంపియన్ షిప్‌ లకు సంబంధించి నన్ను చాలా మంది సంప్రదించారు. అయితే ఈ గేమ్ లో పాల్గొనాలంటే ఎంతో ప్రాక్టీస్ చేయాలి. డబ్బుతో పాటు ఎంతో అంకిత భావం ఉంటేన ఈ గేమ్ లో సత్తా చాటగలం. ముఖ్యంగా ఇది ఖరీదైన క్రీడ ఎందుకంటే ప్రతి రేసుకు దాదాపు రూ.15 లక్షలు ఖర్చవుతుంది. అందుకే అన్ని విధాలా ఆలోచించే కార్ రేసుల్లో పాల్గొంటాను’ అని ఒక సందర్భంలో చెప్పుకొచ్చింది నివేద.

ఇవి కూడా చదవండి

నివేద పేతురాజ్ లేటెస్ట్ ఫొటోస్..

ప్రస్తుతం సినిమాలతో పాటు పలు వెబ్ సిరీసుల్లోనూ నటిస్తూ బిజీగా ఉంటోంది నివేద పేతురాజ్. చివరిగా ఆమె నటించిన పరువు వెబ్ సిరీస్ జీ5 ఓటీటీలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

సోదరుడితో కలిసి ట్రాక్ సూట్ లో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మాస్టర్ బ్లాస్టర్ స్టైల్‌లో కమిన్స్ అప్పర్-కట్
మాస్టర్ బ్లాస్టర్ స్టైల్‌లో కమిన్స్ అప్పర్-కట్
బంగారాన్ని ఎక్కువ కాలం వాడకపోతే తుప్పు పడుతుందా?
బంగారాన్ని ఎక్కువ కాలం వాడకపోతే తుప్పు పడుతుందా?
కాలేజ్‌ క్యాంపస్‌లో తిరుగుతున్న భారీ మొసలి వీడియో వైరల్
కాలేజ్‌ క్యాంపస్‌లో తిరుగుతున్న భారీ మొసలి వీడియో వైరల్
ఇదేం చేస్తుందిలే అని చీప్‌గా చూసేరు.. ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం..
ఇదేం చేస్తుందిలే అని చీప్‌గా చూసేరు.. ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం..
ఆరుగురు హీరోయిన్స్ తర్వాత విజయ్ సినిమాలో ఆమె ఫిక్స్ అయ్యిందా..?
ఆరుగురు హీరోయిన్స్ తర్వాత విజయ్ సినిమాలో ఆమె ఫిక్స్ అయ్యిందా..?
మీ మతిమరుపునకు అసలు కారణం తెలిస్తే.. వీడియో
మీ మతిమరుపునకు అసలు కారణం తెలిస్తే.. వీడియో
సంగారెడ్డిలో ఘోరం..ముగ్గురు పిల్లల‌కు విష‌మిచ్చి తానూ తాగిన తల్లి
సంగారెడ్డిలో ఘోరం..ముగ్గురు పిల్లల‌కు విష‌మిచ్చి తానూ తాగిన తల్లి
ఈ పండు తినాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.. వీడియో
ఈ పండు తినాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.. వీడియో
అమెరికా వెళ్లాలనుకునే విద్యార్ధులకు షాక్‌.. ట్రంప్ ఏం చేశారంటే?
అమెరికా వెళ్లాలనుకునే విద్యార్ధులకు షాక్‌.. ట్రంప్ ఏం చేశారంటే?
ముల్లును ముల్లుతోనే తీయాలి.. తూర్పు లద్దాఖ్‌లో అధునాతన బలగాలు
ముల్లును ముల్లుతోనే తీయాలి.. తూర్పు లద్దాఖ్‌లో అధునాతన బలగాలు