AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonu Sood: సోనూసూద్ ఇంటి ఆవరణలోకి పాము.. రియల్ హీరో ఏం చేశాడో తెలుసా? వీడియో చూస్తే ఒళ్లు జలదరిస్తుంది

సాధారణంగా పాములను చూస్తేనే చాలా మంది భయపడిపోతారు. ఆ దరిదాపుల్లో లేకుండా పరుగులు తీస్తారు. ఇంకొందరైతే కర్రలు లేదా రాళ్లతో పామును చంపడానికి చూస్తారు. కానీ మన రియల్ హీరో సోనూసూద్ మాత్రం అలా చేయలేదు. మూగజీవాల పట్ల కూడా తన మానవత్వాన్ని చాటుకున్నాడు.

Sonu Sood: సోనూసూద్ ఇంటి ఆవరణలోకి పాము.. రియల్ హీరో ఏం చేశాడో తెలుసా? వీడియో చూస్తే ఒళ్లు జలదరిస్తుంది
Actor Sonu Sood
Basha Shek
|

Updated on: Jul 20, 2025 | 8:41 AM

Share

సినిమాల కంటే తన మంచి పనులు,  సామాజిక సేవా కార్యక్రమాలతోనే అభిమానుల్లో గుర్తింపు సంపాదించుకున్నాడు సోనూసూద్. రీల్ లైఫ్ లో ఎక్కువగా విలన్ గా కనిపించే ఆయన నిజ జీవితంలో ఎన్నో మంచి పనులు చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. కరోనా క్లిష్ట కాలంలో ఈ నటుడు సేవలు, సహాయక కార్యక్రమాలు, దాన ధర్మాలను ఎవరూ అంత ఈజీగా మర్చిపోరు. ఇప్పటికీ సోనూ సేద్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సహాయక కార్యక్రమాలు చేస్తున్నాడీ హ్యాండ్సమ్ హీరో. కష్టాల్లో ఉన్నవారికి నేనున్నాంటూ ఆపన్న హస్తం అందిస్తున్నాడు. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు సోనూసూద్. ఒక మంచి పని చేసి మనుషులే కాదు మూగజీవాల పట్ల కూడా ప్రేమ, దయతో మెలగాలని తన అభిమానులందరికీ సందేశమిచ్చాడు. వివరాల్లోకి వెళితే.. ముంబైలో సోనూసూద్ నివసించే సోసైటీలోకి ఓ పాము ప్రవేశించింది. దానిని చూసి అక్కడున్నవారందరూ భయంతో పరుగులు తీశారు. అయితే అక్కడే ఉన్న సోనూసూద్ మాత్రం అలా చేయలేదు. ఆ పామను ఉత్త చేతులతో జాగ్రత్తగా పట్టుకుని సంచిలో వేసి బంధించారు.  ఆ పాము ర్యాట్‌ స్నేక్‌ అని, విషపూరితం కాదని స్థానికులకు వివరించారు. అయితే, పాముల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పాములు ఇళ్లలోకి ప్రవేశించినప్పుడు నిపుణులైన వారిని పిలిపించి మాత్రమే పట్టుకోవాలన్నారు.  ఆ తర్వాత దానిని సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలేసి రావాలని తన వద్ద పనిచేసే యువకులకు సూచించారు.

ఇందుకు సంబంధించిన వీడియోను సోనూసూద్ తన సోషల్‌మీడియా అకౌంట్లలో షేర్ చేశాడు. దీనికి హర హర మహదేవ్ అని క్యాప్షన్ ఇచ్చాడు.  ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఫేస్ బుక్ ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్, యూట్యూబ్‌లలో లక్షలాది వ్యూస్‌తో ట్రెండింగ్ అవుతోంది. సినీ అభిమానులు, నెటిజన్ల నుంచి ఈ వీడియోకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సోనూసూద్ ధైర్యాన్ని అదే సమయంలో మూగ జీవాలపై ఆయన చూపించే ప్రేమను చూసి అందరూ ఫిదా అవుతున్నారు. ‘మీరు మరోసారి రియల్ హీరో అనిపించుకున్నారు సార్’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం నంది పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు సోనూ సూద్. ఇందులో తాను నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహిస్తున్నాడీ రియల్ హీరో.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..