AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ నటుడికి జరిగిన ప్రమాదం నా జీవితంలో ఎంతో బాధను కలిగించింది.. ఎమోషనల్ అయిన రాజేంద్ర ప్రసాద్

దివంగత నటుడు నూతన ప్రసాద్‌గారికి ఎదురైన తీవ్ర ప్రమాదంపై నటుడు రాజేంద్ర ప్రసాద్ గతంలో సంచలన విషయాలను పంచుకున్నారు. కారు స్టంట్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుందని ఆయన వెల్లడించారు. క్రేన్‌కు కట్టి కారును పైకి లేపుతుండగా, ఒక్కసారిగా తాళ్లు తెగిపోయి కారు 18 అడుగుల ఎత్తు నుంచి నేరుగా కిందపడిందని వివరించారు.

ఆ నటుడికి జరిగిన ప్రమాదం నా జీవితంలో ఎంతో బాధను కలిగించింది.. ఎమోషనల్ అయిన రాజేంద్ర ప్రసాద్
Rajendra Prasad
Rajeev Rayala
|

Updated on: Jul 09, 2026 | 9:18 PM

Share

బామ్మ మాట బంగారు బాట చిత్ర చిత్రీకరణ సమయంలో దివంగత నటుడు నూతన ప్రసాద్‌గారికి ఎదురైన ప్రమాదంపై నటుడు రాజేంద్ర ప్రసాద్ గతంలో ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాలను పంచుకున్నారు. ఈ సంఘటన తన జీవితంలో ఒక తీరని విషాదంగా మిగిలిందని ఆయన పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన తీరును వివరిస్తూ, కారు స్టంట్ సన్నివేశం కోసం ఆరు కార్లను సిద్ధం చేశారని, వాటిలో రెండు కార్లను రెండు భాగాలుగా చేసి ఉపయోగించారని తెలిపారు. సన్నివేశం ప్రకారం, కారు ఎగిరి, కిందపడి, విడిపోయి, తిరిగి కలవాలి. ఈ షాట్ కోసం క్రేన్‌కు కారును కట్టి ఎత్తుతుండగా, తెల్లవారుజాము నుంచి జరుగుతున్న ఈ ప్రక్రియలో గొలుసు తెగిపోయిందని రాజేంద్ర ప్రసాద్ వివరించారు. “కెమెరామెన్ గారు 50 అడుగులు అక్కర్లేదు, ఈ హైట్ చాలు, నాకు కింద నుంచి క్లోజ్ కావాలి, ఆపండి అన్నాడు. వాళ్ళు సడెన్‌గా బ్రేక్ వేసేటప్పటికి, ఆ చైన్ తెగి కారు 18 అడుగుల ఎత్తు నుంచి నేరుగా కింద పడింది” అని ఆయన వివరించారు.

ఇది కూడా చదవండి : Actress Sudha: ఆ స్టార్ హీరో నాకు దేవుడితో సమానం.. రెండుసార్లు నా ప్రాణాలు కాపాడాడు.

ఆ ప్రమాద సమయంలో తాను డ్రైవింగ్ సీట్లో వంగి ఉన్నానని, నూతన ప్రసాద్‌గారు వెనుక సీట్లో కూర్చొని.. అరుస్తూ ఉన్నారని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. కారు ఒక్కసారిగా కింద పడటంతో, తాను వంగి ఉండటం వల్ల ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నానని, అయితే వెనుక సీట్లో కూర్చొని ఉన్న నూతన ప్రసాద్‌గారికి తీవ్ర గాయాలయ్యాయని పేర్కొన్నారు. ఆయన స్పైనల్ కార్డ్‌లోని 16, 17 ఎముకలు జామ్ అయ్యి, రెండు కాళ్లు పక్షవాతానికి గురయ్యాయని రాజేంద్ర ప్రసాద్ ఎమోషనల్ అయ్యారు. ఆ తర్వాత ఎప్పుడు కలిసినా.. నూతన ప్రసాద్‌గారు “చిన్నోడు, నేను ఇద్దరం కలిసి ఒకే కారులో, ఒకేచోట నుంచి ఒకేసారి పడ్డాం. తను ఎందుకో అలాగా, నేను ఎందుకో ఇలాగా అనుకునేవాడు” అని రాజేంద్ర ప్రసాద్ గుర్తు చేసుకున్నారు. ఆయనకు ధైర్యం చెప్పడానికి ప్రయత్నించినా, ఆ దుర్ఘటన ప్రభావం తీవ్రంగానే ఉందని తెలిపారు.

ఇది కూడా చదవండి : Prabhas: ప్రభాస్‌కు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆమె నా క్రష్ అంటున్న రెబల్ స్టార్

ఇవి కూడా చదవండి

నూతన ప్రసాద్‌గారు ఆ తర్వాత డబ్బింగ్‌లు, చిన్న చిన్న వేషాలు వేస్తూ జీవనం సాగించారని, కానీ ఆ గాయాల కారణంగా ఎక్కువ కాలం కొనసాగలేకపోయారని రాజేంద్ర ప్రసాద్ వివరించారు. ఆతర్వాత మరణించారని.. ఈ సంఘటన తన జీవితంలో ఎంతో బాధను కలిగించిందని ఆయన తెలిపారు రాజేంద్ర ప్రసాద్. యాక్సిడెంట్‌కు ముందు 365 చిత్రాల్లో నటిస్తే, ప్రమాదం తర్వాత కూడా 110 సినిమాల్లో  నటించారు నూతన ప్రసాద్. నూతన్ ప్రసాద్, 2011 మార్చి 30న కన్నుమూశారు.

ఇది కూడా చదవండి : Nagarjuna: నాగార్జునకు విలన్‌గా ఆ అందాల భామ.. కింగ్ 100వ సినిమా కోసం మాస్టర్ ప్లాన్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఏపీకి కేంద్రం శుభవార్త.. ఏంటంటే..?
ఏపీకి కేంద్రం శుభవార్త.. ఏంటంటే..?
క్రేజీ ఉద్యోగం.. జస్ట్ మేఘాలను వీడియో తీస్తూ నెలకు రూ. 8.5 లక్షలు
క్రేజీ ఉద్యోగం.. జస్ట్ మేఘాలను వీడియో తీస్తూ నెలకు రూ. 8.5 లక్షలు
తల్లిదండ్రుల మధ్య హాయిగా నిద్రపోతున్న విజయ్..
తల్లిదండ్రుల మధ్య హాయిగా నిద్రపోతున్న విజయ్..
పాక్‎ను కుప్పకూల్చి బంతిని రెండు ముక్కలు చేసిన ఇంగ్లాండ్ బౌలర్లు
పాక్‎ను కుప్పకూల్చి బంతిని రెండు ముక్కలు చేసిన ఇంగ్లాండ్ బౌలర్లు
ఒంట్లో విటమిన్ డి తగ్గితే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా..?
ఒంట్లో విటమిన్ డి తగ్గితే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా..?
చంద్ర గ్రహణం వీరికి మహా యోగం.. ఉద్యోగ ఆఫర్లు, ఆర్థిక కష్టాలు ఖతం!
చంద్ర గ్రహణం వీరికి మహా యోగం.. ఉద్యోగ ఆఫర్లు, ఆర్థిక కష్టాలు ఖతం!
ఇంగ్లిష్ అవసరం లేదు.. Multilingual AIతో మారనున్న డిజిటల్‌ వరల్డ్‌
ఇంగ్లిష్ అవసరం లేదు.. Multilingual AIతో మారనున్న డిజిటల్‌ వరల్డ్‌
అరెరే ఎలుకలను తరిమికొట్టడం ఇంత ఈజీనా.. ఇన్నాళ్లు ఎంత కష్టపడ్డామో!
అరెరే ఎలుకలను తరిమికొట్టడం ఇంత ఈజీనా.. ఇన్నాళ్లు ఎంత కష్టపడ్డామో!
దేశానికి షుగర్ టెన్షన్.. ఊహించని విధంగా పెరుగుతున్న ధరలు..
దేశానికి షుగర్ టెన్షన్.. ఊహించని విధంగా పెరుగుతున్న ధరలు..
ఎస్బీఐ అకౌంట్ ఉన్నవారికి బ్యాడ్‌న్యూస్.. మారిన నిబంధనలు..
ఎస్బీఐ అకౌంట్ ఉన్నవారికి బ్యాడ్‌న్యూస్.. మారిన నిబంధనలు..
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర