ప్రెజెంట్ యూత్ క్రష్ కాయదు లోహర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 2021లో కన్నడ చిత్రం "మొగిల్‌పేట"తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
తాజాగా వచ్చిన డ్రాగన్ సినిమాతో బాగా పేరు తెచ్చుకుంది. ఈ చిత్రంలో కాయదు గ్లామర్ తో కుర్రకారు గుండెల్లో సెగలు రేపింది.
ఇది ఇలా ఉంటే 16 ఏళ్లున్నప్పుడు తనకు జరిగిన ఓ చేదు అనుభవాన్ని గుర్తుచేసుకుంది. ‘పదో తరగతి చదువుకుంటున్న రోజుల్లో మా ఇంటికి దగ్గరలోనే ట్యూషన్‌కు వెళ్తుండేదాన్ని.
అయితే ప్రతిరోజూ ట్యూషన్‌కు వెళ్లే మార్గంలో కొందరు అబ్బాయిలు నన్నుఈవ్ టీజింగ్ చేసేవారు. సూటి పోటి మాటలతో వేధించేవారు.
మొదటి రెండు రోజులు ఏమీ అనకుండా మౌనంగా భరించాను. కానీ మూడో రోజు కూడా ఒక కుర్రాడు హద్దులు మీరి ప్రవర్తించాడు. దీంతో భయం, కోపం, నిస్సహాయత ఒక్కసారిగా ముంచుకొచ్చాయి.
భరించలేక రోడ్డు పక్కన ఉన్న ఒక పెద్ద రాయిని తీసుకుని ఆ కుర్రాడి వైపు బలంగా విసిరాను. అది వెళ్లి అతడి తలకు బలంగా తగలడంతో రక్తం కారింది.
చూడటానికి నేను చాలా సాఫ్ట్‌గా కనిపిస్తాను. కానీ ఎవరైనా తప్పు చేస్తే నాలోని కోపం బయటికి వస్తుంది. అవసరమైతే మళ్లీ మళ్లీ కొడతానని’ అని అప్పటి విషయాన్ని గుర్తు తెచ్చుకుంది కయాదు.