AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth Faima: జబర్దస్త్ ఫైమా పెళ్లి.. కొత్త జంటకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన నాగబాబు.. వీడియో ఇదిగో

జబర్దస్త్ ఫైమా ఇటీవలే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తన ప్రియుడు ప్రవీణ్ నాయక్ తో కలిసి ఆమె వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది. అయితే ఈ కొత్త జంటకు జబర్దస్త్ జడ్జి, మెగా బ్రదర్ నాగబాబు మర్చిపోలేని గిఫ్ట్ ను అందించారు.

Jabardasth Faima: జబర్దస్త్ ఫైమా పెళ్లి.. కొత్త జంటకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన నాగబాబు.. వీడియో ఇదిగో
Naga Babu, Jabardasth Faima
Basha Shek
|

Updated on: Jul 09, 2026 | 8:02 PM

Share

జబర్దస్త్ ఫేమ్, ప్రముఖ బుల్లితెర నటి ఫైమా ఇటీవలే తన జీవితంలో సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టింది. తన ప్రియుడు ప్రవీణ్ నాయక్ తో కలిసి మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టిందామె. మొదట రిజిస్టర్ ఆఫీస్ లో సింపుల్ గా పూల దండలు మార్చుకున్న ఈ లవ్ బర్డ్స్ ఆ తర్వాత పెద్దల సమక్షంలో సంప్రదాయ బద్ధంగా వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు. ఈ వేడుకకు బంధువులు, స్నేహితులు, సన్నిహితులతో పాటు జబర్దస్త్ ఆర్టిస్టులు, బుల్లితెర సెలబ్రిటీలు హాజరయ్యారు. కొత్త దంపతులను ఆశీర్వదించారు. కాగా పెళ్లి తంతు పూర్తవ్వడంతో మళ్లీ ప్రొఫెషనల్ లైఫ్ పై దృష్టి సారించింది ఫైమా. జబర్దస్త్ తో పాటు పలు టీవీ షోల్లో సందడి చేస్తోంది. ప్రస్తుతం అత్తారింట్లో ఉంటోన్నఫైమా సోషల్ మీడియాలో తన రోజువారీ దిన చర్యను ఫాలోవర్స్ తో పంచుకుంటోంది. అలాగే అత్తారిటింకి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఇన్ స్టా గ్రామ్ లో పంచుకుంటోంది. తాజాగా ఆమె తన పెళ్లికి జబర్దస్త్ జడ్జి నాగబాబు ఇచ్చిన బహుమతి గురించి చెప్తూ ఎంతగానో మురిసిపోయింది. ఈ మేరకు తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో ఒక వీడియోను షేర్ చేసింది ఫైమా.

ఈ వీడియోలో ఫైమా మాట్లాడుతూ.. ‘నా పెళ్లికి నాగబాబు గారు రాలేదు కానీ , ఈరోజు జబర్దస్త్ షూటింగ్ కి వెళ్లినప్పుడు నాకు ఈ డబ్బులు బహుమతిగా ఇచ్చారు. చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే సార్ నన్ను చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఆయన ఇచ్చే ప్రోత్సాహం వల్ల , నేను ఇంకా బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తుంటాను’ అని మురిసిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఫైమా దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

జబర్దస్త్ ఫైమా షేర్ చేసిన వీడియో ఇదిగో..

కాగా ఈమధ్యనే మెగాబ్రదర్ నాగబాబు జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ షోలో చాలా మార్పులకు శ్రీకారం చుట్టారాయన. అందుకు తగ్గట్టుగానే గత కొన్నేళ్లతో పోల్చుకుంటే ఇప్పుడు జబర్దస్త్ రేటింగ్స్ మెరుగుపడ్డాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

భర్తతో జబర్దస్త్ ఫైమా..

View this post on Instagram

A post shared by FAIMA (@faima_patas)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us