AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదిరిపోయే డిజైన్‌తో కొత్త మోడల్‌ లాంచ్‌ చేసిన నిస్సాన్‌.. టెక్టాన్‌ ధర, ఫీచర్లు ఇవే

నిసాన్ భారత మార్కెట్‌లో ఆల్-న్యూ టెక్టాన్ SUVను లాంచ్ చేసింది. రూ.10.49 లక్షల నుంచి ప్రారంభమయ్యే ధరతో, పవర్‌ఫుల్ టర్బో పెట్రోల్ ఇంజన్లు, 5-స్టార్ సేఫ్టీ, ప్రీమియం ఫీచర్లతో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్‌ను ఛాలెంజ్ చేసేలా 'బేబీ పెట్రోల్' స్టైలింగ్‌తో వస్తోంది.

అదిరిపోయే డిజైన్‌తో కొత్త మోడల్‌ లాంచ్‌ చేసిన నిస్సాన్‌.. టెక్టాన్‌ ధర, ఫీచర్లు ఇవే
Nissan Texton
Nikhil
|

Updated on: Jul 09, 2026 | 9:10 PM

Share

నిస్సాన్ ఇండియా ఆకర్షణీయమైన కాంపాక్ట్ SUV టెక్టాన్‌ను లాంచ్ చేసింది. బోల్డ్ బాక్సీ స్టైలింగ్, అధునాతన ఫీచర్లు, శక్తివంతమైన ఇంజన్లతో మార్కెట్‌లో దూసుకెళ్లేందుకు రెడీ అయ్యింది. ఎక్స్-షోరూమ్ ధర రూ.10.49 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. ఇప్పటికే బుకింగ్స్ స్టార్ట్ అవ్వగా జూలై 20 నుంచి డెలివరీలు కూడా చేయడానికి కంపెనీ రెడీగా ఉంది.

డిజైన్..

ఫ్రంట్‌లో పెద్ద గ్రిల్, క్రోమ్ లోగో, రెడ్ స్ట్రిప్, C-షేప్ LED DRLలు, కనెక్టెడ్ లైట్ బార్ టెక్టార్‌‌ను అట్రాక్టివ్‌గా చేశాయి. సైడ్ ప్రొఫైల్ బాక్సీ సిల్హౌట్, 18 ఇంచ్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, మస్క్యులర్ హాంచెస్ ఆకట్టుకుంటున్నాయి. రియర్‌లో కనెక్టెడ్ LED టైల్ ల్యాంప్స్, రూఫ్ స్పాయిలర్ హైలైట్‌గా నిలుస్తున్నాయి

డైమెన్షన్స్..

పొడవు 4348 mm, వెడల్పు 1815 mm, ఎత్తు 1674 mm, వీల్‌బేస్ 2657 mm.

ఇంటీరియర్ & ఫీచర్లు..

క్యాబిన్ లేయర్డ్ డాష్‌బోర్డ్, ట్రై-టోన్ థీమ్ (బ్లాక్, వైట్, పర్పుల్), గోల్డ్ ఇన్‌సర్ట్స్‌తో ప్రీమియం లుక్‌ను సొంతం చేసుకుంది టెక్టాన్‌. 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ (వైర్‌లెస్ Android Auto, Apple CarPlay), 10.25 ఇంచ్ డిజిటల్ క్లస్టర్, 6-స్పీకర్ ARKAMYS సౌండ్ సిస్టమ్, పెనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ చార్జర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. బూట్ స్పేస్ 700 లీటర్ల వరకు అందుబాటులో ఉంటుంది.

స్పెసిఫికేషన్స్

రెండు టర్బో పెట్రోల్ ఇంజన్లు అందుబాటులోకి తెచ్చింది.

  1. 1.0L టర్బో: 100 PS, 166 Nm, 19.4 kmpl
  2. 1.3L టర్బో: 163 PS, 280 Nm, MT/DCT ఆప్షన్లు (17.8-18.5 kmpl)

నిస్సాన్ టెక్టాన్ 6 వేరియంట్ల వివరాలు

1. Visia

బేస్ వేరియంట్. 1.0L టర్బో పెట్రోల్ ఇంజన్ (100 PS)తో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ . ధర: రూ.10.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ప్రైమరీ ఫీచర్లు, సేఫ్టీ ఎలిమెంట్స్‌తో ప్రారంభ స్థాయి కొనుగోలుదారులకు సరైన ఆప్షన్.

2.  Visia Plus

అదనపు కంఫర్ట్ ఫీచర్లు. 1.0L టర్బో MT. ధర: రూ.11.14 లక్షలు. బడ్జెట్‌లో మెరుగైన అనుభవం కావాలనుకునే వారికి Visia  బెటర్.

3. Acenta

మిడ్ లెవల్ వేరియంట్. 1.0L టర్బో MT (రూ.11.79 లక్షలు), 1.3L టర్బో DCT (రూ.14.99 లక్షలు) ఆప్షన్లు ఉన్నాయి. మరిన్ని కనెక్టివిటీ, కంఫర్ట్ ఫీచర్లు యాడ్ చేశారు.

4. N-Connecta

పాపులర్ మిడ్-టాప్ వేరియంట్. 1.0L MT (రూ.13.69 లక్షలు), 1.3L MT (రూ.14.99 లక్షలు), 1.3L DCT (రూ.16.49 లక్షలు) ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అధిక ఫీచర్లు, బెటర్ ఇన్ఫోటైన్‌మెంట్, సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి.

5. Tekna

హై స్పెక్ వేరియంట్. 1.0L MT (రూ.15.39 లక్షలు), 1.3L MT (రూ.16.39 లక్షలు), 1.3L DCT (రూ.17.79 లక్షలు) ఆప్షన్లు. ప్రీమియం ఫీచర్లు, అడ్వాన్స్డ్ సేఫ్టీ సిస్టమ్స్, కంఫర్ట్ ఎలిమెంట్స్ ఉంటాయి.

6. Tekna Plus

టాప్-ఎండ్ వేరియంట్. 1.0L MT (రూ.16.49 లక్షలు), 1.3L DCT (రూ.18.59 లక్షలు). అత్యధిక ఫీచర్ లోడెడ్ వెర్షన్. పెనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, అడ్వాన్స్డ్ ADAS, ప్రీమియం ఇంటీరియర్ వంటి ఫీచర్లతో ఫుల్ లోడెడ్ అనుభవం ఇస్తుంది.

సేఫ్టీ..

6 ఎయిర్‌బ్యాగ్స్, లెవల్-2 ADAS, 360° కెమెరా, 5-స్టార్ భారత్ NCAP రేటింగ్, TPMS, ESC వంటివి ఉన్నాయి.

నిస్సాన్ టెక్టాన్  డిజైన్, రిచ్ ఫీచర్లు, శక్తివంతమైన పెర్ఫార్మెన్స్‌తో క్రెటా, సెల్టోస్ వంటి పోటీదారులను ఛాలెంజ్ చేస్తుంది.

Follow Us