AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గూగుల్‌ AIలో సంచలనం.. కోడ్‌ నుంచి సైబర్‌ సెక్యూరిటీ వరకు.. Gemini 4 Organ లాంచ్!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో గూగుల్ మరో కీలక అడుగు వేసింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, ఎంటర్‌ప్రైజ్ పనులు, సైబర్‌సెక్యూరిటీ వంటి క్లిష్టమైన టాస్క్‌లను దృష్టిలో పెట్టుకుని ‘జెమిని 4 ఆర్గన్‌’ పేరుతో కొత్త AI మోడల్‌ను ప్రకటించింది. భారీ స్థాయి కోడ్, డేటా, దీర్ఘకాలిక కాంటెక్స్ట్‌ను ప్రాసెస్ చేయగల సామర్థ్యంతో ఈ మోడల్‌ను రూపొందించినట్లు కంపెనీ వెల్లడించింది.

గూగుల్‌ AIలో సంచలనం.. కోడ్‌ నుంచి సైబర్‌ సెక్యూరిటీ వరకు.. Gemini 4 Organ లాంచ్!
Gemini 4 Organ Features
Balaraju Goud
|

Updated on: Oct 02, 2026 | 1:04 PM

Share

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో గూగుల్ మరో కీలక అడుగు వేసింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, ఎంటర్‌ప్రైజ్ పనులు, సైబర్‌సెక్యూరిటీ వంటి క్లిష్టమైన టాస్క్‌లను దృష్టిలో పెట్టుకుని ‘జెమిని 4 ఆర్గన్‌’ పేరుతో కొత్త AI మోడల్‌ను ప్రకటించింది. భారీ స్థాయి కోడ్, డేటా, దీర్ఘకాలిక కాంటెక్స్ట్‌ను ప్రాసెస్ చేయగల సామర్థ్యంతో ఈ మోడల్‌ను రూపొందించినట్లు కంపెనీ వెల్లడించింది.

‘జెమిని 4 ఆర్గన్‌’ ప్రత్యేకతల్లో ముఖ్యమైనది దాని 1 మిలియన్ అవుట్‌పుట్ టోకెన్ సామర్థ్యం. గత మోడల్‌లో ఉన్న 64,000 టోకెన్ల పరిమితితో పోలిస్తే ఇది భారీ పెరుగుదల. దీంతో పెద్ద కోడ్‌బేస్‌లను విశ్లేషించడం, దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ ప్రాజెక్టులపై పనిచేయడం, సంక్లిష్టమైన ఎంటర్‌ప్రైజ్ వర్క్‌ఫ్లోలను నిర్వహించడం వంటి పనుల్లో మోడల్ ఉపయోగపడుతుందని గూగుల్ చెబుతోంది.

సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌లో కీలక సామర్థ్యాలు

సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌ పనితీరును అంచనా వేసే DeepSWE v1.1 బెంచ్‌మార్క్‌లో ‘జెమిని 4 ఆర్గన్‌’ 77.9 శాతం స్కోర్ సాధించినట్లు గూగుల్ తెలిపింది. లాంగ్-వీడియో అండర్‌స్టాండింగ్‌కు సంబంధించిన LVBenchలో 91.7 శాతం, వ్యాపార ఆటోమేషన్ పనులను పరీక్షించే Zapier AutomationBenchలో 51.3 శాతం స్కోర్ సాధించినట్లు పేర్కొంది.

గూగుల్ తన అంతర్గత ఇంజినీరింగ్ పనుల్లోనూ ఈ మోడల్‌ను ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. క్వాంటం కంప్యూటింగ్, కోడ్‌బేస్ మైగ్రేషన్ వంటి క్లిష్టమైన ప్రాజెక్టులతో పాటు libgav1 వీడియో డీకోడర్‌కు రస్ట్ వెర్షన్ అభివృద్ధిలోనూ అర్గన్ సహకరించిందని వెల్లడించింది. ఈ డీకోడర్‌ ప్రస్తుతం ఉన్న Rust పోర్ట్‌తో పోలిస్తే అదే వీడియో అవుట్‌పుట్‌ను ఇస్తూనే 2.7 రెట్లు వేగంగా పనిచేసినట్లు కంపెనీ పేర్కొంది.

సైబర్‌సెక్యూరిటీలోనూ ప్రత్యేక దృష్టి

సైబర్‌సెక్యూరిటీ రంగంలో సాఫ్ట్‌వేర్ బలహీనతలను గుర్తించడం, వాటిని ధృవీకరించడం, పరిష్కారాలను రూపొందించడం వంటి పనుల కోసం ‘జెమిని 4 ఆర్గన్‌’ను పరీక్షిస్తున్నారు. CWE-Bench v1లో 68 శాతం స్కోర్ సాధించి అగ్రస్థానాన్ని పంచుకున్నట్లు గూగుల్ తెలిపింది. ప్రారంభ దశలో ఎంపిక చేసిన సైబర్‌సెక్యూరిటీ నిపుణులకు గూగుల్ ఫేర్‌విండ్ కార్యక్రమం ద్వారా మోడల్‌ను అందిస్తోంది. సాధారణ సైబర్‌ రక్షణ వ్యవస్థల పరిమితులు లేకుండా మోడల్‌ను నిపుణులు పరీక్షించేలా చేసి, దాని సామర్థ్యాలు, ప్రమాదాలను అంచనా వేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అదే సమయంలో CBRN దుర్వినియోగం, పరోక్ష ప్రాంప్ట్ ఇంజెక్షన్, అనుకోని మోడల్ ప్రవర్తన వంటి భద్రతా సమస్యలపైనా గూగుల్ పరీక్షలు నిర్వహిస్తోంది.

తొలి దశలో పరిమిత యాక్సెస్

‘జెమిని 4 ఆర్గన్‌’ను దశలవారీగా అందుబాటులోకి తీసుకురానున్నారు. మొదట ఎంపిక చేసిన సైబర్‌సెక్యూరిటీ నిపుణులకు అందించిన తర్వాత చెల్లింపు API కస్టమర్లు, గూగుల్ AI అల్ట్రా సబ్‌స్క్రైబర్లకు యాక్సెస్ విస్తరించనున్నారు. అనంతరం డెవలపర్లు, సంస్థలు, సాధారణ వినియోగదారులకు అందుబాటును పెంచే ప్రణాళిక ఉన్నట్లు గూగుల్ తెలిపింది. ధర విషయానికి వస్తే.. ప్రతి 10 లక్షల ఇన్‌పుట్ టోకెన్లకు 2 డాలర్లు, ప్రతి 10 లక్షల అవుట్‌పుట్ టోకెన్లకు 10 డాలర్లుగా గూగుల్ నిర్ణయించింది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.200, రూ.1,000గా ఉంటుంది.

మొత్తంగా, భారీ కోడ్‌బేస్‌లు, సుదీర్ఘ డాక్యుమెంట్లు, ఎంటర్‌ప్రైజ్ ఆటోమేషన్, సైబర్‌సెక్యూరిటీ వంటి క్లిష్టమైన పనులను ఒకే AI మోడల్‌తో నిర్వహించాలనే లక్ష్యంతో ‘జెమిని 4 ఆర్గన్‌’ను గూగుల్ రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే విస్తృత వినియోగానికి ముందు భద్రత, దుర్వినియోగ నిరోధక పరీక్షలు పూర్తి చేయడం కీలకంగా మారనుంది.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us