AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1050కి పైగా సినిమాలు.. అప్పుడు చిరిగిన బట్టలతో స్కూల్ వెళ్లిన పిల్లడు.. ఇప్పుడు ఇండస్ట్రీలో తిరుగులేని నటుడు

సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంత ఈజీ కాదు.. ఎంతో మంది ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్స్ గా రాణిస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటుడు తెలుగు సినిమా చరిత్రలో సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకున్నారు. చిన్నప్పుడు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కున్న ఆయన ఇప్పుడు తోప్ నటుడు.

1050కి పైగా సినిమాలు.. అప్పుడు చిరిగిన బట్టలతో స్కూల్ వెళ్లిన పిల్లడు.. ఇప్పుడు ఇండస్ట్రీలో తిరుగులేని నటుడు
Movie News
Rajeev Rayala
|

Updated on: Jul 07, 2026 | 8:41 AM

Share

సినిమా ఇండస్ట్రీలో ఆయన ఓ లెజెండ్. తెలుగులో తిరుగులేని నటుడు.. ఆయన కోసం స్టార్ హీరోలు కూడా క్యూలో నిలబడేవారు. దర్శక నిర్మాతలు ఆయన డేట్స్ కోసం ఎదురుచూసేవారు. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ గా మారిపోయాడు. 1050  పైగా సినిమాల్లో నటించాడు ఆయన. అంతే కాదు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా క్రియేట్ చేశాడు. సినిమా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న ఆయన చిన్నతనంలో ఎన్నో కష్టాలను, ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కున్నారు. ఆయన మరెవరో కాదు టాలీవుడ్‌లో నవ్వుల రాజుగా కోట్లాది మంది అభిమానుల మనసులు గెలుచుకున్న నటుడు బ్రహ్మానందం. బ్రహ్మానందం జీవితం నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకం. చిన్నప్పుడు తీవ్ర పేదరికంలో పెరిగిన ఆయన స్కూల్‌కు వెళ్లేటప్పుడు చిరిగిన బట్టలు ధరించాల్సిన పరిస్థితులు ఎదుర్కొన్నారని గతంలో స్వయంగా వెల్లడించారు. కొత్త పుస్తకాలు కొనుగోలు చేసే స్థోమత లేక సెకండ్ హ్యాండ్ పుస్తకాలతోనే చదువును కొనసాగించి జీవితంలో ఎన్నో కష్టాలను అధిగమించారు. అధ్యాపకుడిగా కెరీర్ ప్రారంభించిన బ్రహ్మానందం తన అసాధారణ హాస్య ప్రతిభతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి వేలాది చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. 1050కి పైగా సినిమాల్లో నటించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన ఆయన భారతదేశంలోనే అత్యంత విజయవంతమైన హాస్యనటులలో ఒకరిగా నిలిచారు.

ఇది కూడా చదవండి : OTT Movie : పెద్దికి పోటీగా ఓటీటీలోకి క్రేజీ మూవీ.. రిలీజ్ అయిన 5 వారాల్లోనే స్ట్రీమింగ్ రెడీ..

పల్నాడు జిల్లా, ముప్పాళ్ల మండలం, చాగంటి వారి పాలెం గ్రామంలో జన్మించిన బ్రహ్మానందం అత్తిలిలో తొమ్మిది సంవత్సరాలు లెక్చరర్‌గా పని చేశారు. గుంటూరు పీజీ సెంటర్ నుంచి తెలుగు సాహిత్యంలో ఎంఏ పట్టా పొందారు. చదువుకునే రోజుల నుంచే మిమిక్రీలు చేయడం, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం ఆయన నైపుణ్యాలను పెంపొందించాయి. 1985లో దూరదర్శన్‌లో ప్రసారమైన పకపకలు కార్యక్రమంతో ఆయనకు మంచి గుర్తింపు లభించింది. దర్శకుడు వేజళ్ల సత్యనారాయణ 1985లో శ్రీ తాతావతారం చిత్రంలో బ్రహ్మానందంకు తొలిసారి మేకప్ వేసి కెమెరా ముందుకు తీసుకువచ్చారు. ఆతర్వాత జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ఆహా నా పెళ్లంట బ్రహ్మానందం కెరీర్ ను మార్చేసింది. ఈ చిత్రంలోని అరుగుండు పాత్ర బ్రహ్మానందం హాస్యనట విశ్వరూపాన్ని ప్రపంచానికి చాటింది. జంధ్యాల, డాక్టర్ డి. రామానాయుడు, చిరంజీవి వంటి ప్రముఖులు ఆయన కెరీర్‌కు ఎంతో మద్దతుగా నిలిచారు.

ఇది కూడా చదవండి : అతను ఓ సైకో.. నన్ను సిగరెట్‌తో కాల్చాడు, పిచ్చి పిచ్చిగా కొట్టాడు.. షాకింగ్ విషయం చెప్పిన టాలీవుడ్ హీరోయిన్

బ్రహ్మానందం వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే, ఆయన భార్య పేరు లక్ష్మి. ఈ దంపతులకు గౌతమ్, సిద్ధార్థ్ అనే ఇద్దరు కుమారులున్నారు. గౌతమ్ పల్లకిలో పెళ్లికూతురు చిత్రంతో కథానాయకుడిగా పరిచయమయ్యారు. బ్రహ్మానందం తండ్రి శిల్పకళాభిరుచి గలవారు కావడంతో, ఆయనకు కూడా చిత్రలేఖనం, పుస్తక పఠనం వంటి కళలు అలవడ్డాయి. ఆయన ఖాళీ సమయాల్లో బొమ్మలు గీస్తూ ఉంటారు. బ్రహ్మానందం తన నట జీవితంలో ఎన్నో అవార్డులు, సత్కారాలు అందుకున్నారు. రెండు దశాబ్దాలకు పైగా తన హాస్యనటనతో దాదాపు 745 చిత్రాల్లో నటించిన ఘనత బ్రహ్మానందం సొంతం. తక్కువ వ్యవధిలో అత్యధిక చిత్రాల్లో నటించిన నటుడిగా ఆయన తిరుగులేని రికార్డు నెలకొల్పారు. అత్యధిక సినిమాల్లో నటించిన ఏకైక హాస్య నటుడిగా ప్రతిష్టాత్మక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు.ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ సుమారు రూ. 500 కోట్ల వరకు ఉంటుందని పలు నివేదికలు పేర్కొంటుండగా, ఆయన ప్రయాణం కష్టపడితే ఏ స్థాయికైనా చేరుకోవచ్చని నిరూపించే అద్భుత ఉదాహరణగా నిలిచింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : పెళ్లి రోజున సర్‌ప్రైజ్ అని విడాకులు ఇచ్చాడు.. కన్నీళ్లు పెట్టుకున్న టాలీవుడ్ హీరోయిన్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us