AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతను ఓ సైకో.. నన్ను సిగరెట్‌తో కాల్చాడు, పిచ్చి పిచ్చిగా కొట్టాడు.. షాకింగ్ విషయం చెప్పిన టాలీవుడ్ హీరోయిన్

అందమైన ప్రేమ కథతో తెరకెక్కిన సినిమాలకు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంటుంది. యువత అలాంటి సినిమాలను బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పటికే ఎన్నో రకాల ప్రేమకథ సినిమాలు వచ్చాయి. అలాంటి సినిమాల్లో మేం వయసుకు వచ్చాం సినిమా ఒకటి .

అతను ఓ సైకో.. నన్ను సిగరెట్‌తో కాల్చాడు, పిచ్చి పిచ్చిగా కొట్టాడు.. షాకింగ్ విషయం చెప్పిన టాలీవుడ్ హీరోయిన్
Niti Taylor
Rajeev Rayala
|

Updated on: Jul 06, 2026 | 1:18 PM

Share

సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా టాలీవుడ్ లో బెస్ట్ లవ్ స్టోరీ అంటే చెప్పే లిస్ట్ లో ఈ సినిమా కూడా ఖచ్చితంగా ఉంటుంది. అదే మేం వయసుకు వచ్చాం. ఈ సినిమా ఓ క్లాసిక్ అనే చెప్పాలి యూత్ ను ఈ సినిమా బాగానే ఆకట్టుకుంది. 2012లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అందమైన ప్రేమ కథతో పాటు ఈ సినిమాలో ఎమోషనల్ సీన్స్ కూడా ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. ఈ మూవీకి త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించారు. తనీష్, నితి టేలర్ ప్రధాన పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. అలాగే ఈ మూవీకి శేఖర్ చంద్ర సంగీతం అందించారు. ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ సినిమాలో తనీష్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన తనీష్ హీరోగా ఆకట్టుకున్నాడు.

ఇది కూడా చదవండి : ఏంటి అమ్మడు ఇది నువ్వేనా.!! ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్

అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన నితి టేలర్ తన క్యూట్ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులనుకట్టిపడేసింది. ముఖ్యంగా ఈ అమ్మడి అందానికి తెలుగు కుర్రాలంతా ఫిదా అయ్యారు. అయితే ఈ సినిమా తర్వాత ఆ చిన్నది ఎక్కువగా కనిపించలేదు. నితి టేలర్ మేం వయసుకు వచ్చాం సినిమాలో ముస్లిం యువతిగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆతర్వాత బాలీవుడ్ లో నటించింది. మేం వయసుకు వచ్చాం సినిమాలో క్యూట్ లుక్స్ తో ఆకట్టుకున్న ఈ చిన్నది.. ఇప్పుడు హాట్ లుక్ లోకి మారిపోయింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : బిగ్ బాస్ వల్ల చాలా కోల్పోయా.. ఉన్న ఫేమ్ మొత్తం పోయింది.. షాకింగ్ విషయం చెప్పిన నటి

తాజాగా ఈ బ్యూటీ తన మాజీ బాయ్ ఫ్రెండ్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఓటీటీ రియాలిటీ గేమ్ షో ‘అలయన్స్’ లో నితి టేలర్ తన జీవితంలో జరిగిన చేదు అనుభవాలను గుర్తు చేసుకుంది. తన మాజీ బాయ్ ఫ్రెండ్ చాలా హింసించాడని, అతను ఓ సైకో అనే తెలిపింది. ఆమె మాట్లాడుతూ.. నా మాజీ ప్రియుడు ఒకసారి నన్ను సిగరెట్‌తో కాల్చాడు. అతను ఓ సైకో. అతని పుట్టినరోజు మరింత మితిమీరిపోయాడు.. పిచ్చివాడిలా చేశాడు.. నన్ను గట్టిగా చెంపదెబ్బ కొట్టాడు. దాంతో  అతనికి గుడ్ బై చెప్పేసి అక్కడి నుంచి వచ్చేసాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అప్పుడు తెలిసి తెలియని వయసు. నేను చాలా చిన్నదాన్ని.. మనుషులను అంచనా వేయడం చేతకాక మోసపోయానని చెప్పుకొచ్చింది. కాగా 2020లో నితి టేలర్ పరిక్షిత్ బవా వివాహం చేసుకుంది.

ఇది కూడా చదవండి : ఆ హీరోతో సినిమా చేస్తే ఇంకెవ్వరితో పని చేయాలనిపించదు.. అంతలా అడిక్ట్ అయిపోతాం : గుణశేఖర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేవారికి ఏపీ ప్రభుత్వం సూపర్ న్యూస్
పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేవారికి ఏపీ ప్రభుత్వం సూపర్ న్యూస్
కలర్స్, స్పెషల్‌ ఎడిషన్‌లో ఆకట్టుకుంటున్న జావా బాబర్​ బైక్
కలర్స్, స్పెషల్‌ ఎడిషన్‌లో ఆకట్టుకుంటున్న జావా బాబర్​ బైక్
'రూ.25 కోట్ల ఆస్తి కోసం.. కొబ్బరి నీళ్లలో సైనైడ్‌ కలిపి ఇచ్చా..'
'రూ.25 కోట్ల ఆస్తి కోసం.. కొబ్బరి నీళ్లలో సైనైడ్‌ కలిపి ఇచ్చా..'
రోహిత్ పై త్రిగుణ్ సంచలన కామెంట్స్.. స్టెరాయిడ్స్ బాడీ అంటూ కామెం
రోహిత్ పై త్రిగుణ్ సంచలన కామెంట్స్.. స్టెరాయిడ్స్ బాడీ అంటూ కామెం
భారీ బ్యాటరీతో మార్కెట్‌లోకి కైనెటిక్​ ఈవీ.. వివరాలివే
భారీ బ్యాటరీతో మార్కెట్‌లోకి కైనెటిక్​ ఈవీ.. వివరాలివే
మేకప్‌ బాక్స్‌ అనే డౌట్‌ వచ్చే రేంజ్‌లో స్మార్ట్‌ఫోన్‌
మేకప్‌ బాక్స్‌ అనే డౌట్‌ వచ్చే రేంజ్‌లో స్మార్ట్‌ఫోన్‌
వీరి కోసం చక్రం తిప్పబోతున్న భారీ గ్రహం.. ఆర్థికంగా తిరుగులేదు
వీరి కోసం చక్రం తిప్పబోతున్న భారీ గ్రహం.. ఆర్థికంగా తిరుగులేదు
IND vs AFG: భారత్‌-అఫ్గానిస్థాన్ తొలి టీ20పై క్లారిటీ..?
IND vs AFG: భారత్‌-అఫ్గానిస్థాన్ తొలి టీ20పై క్లారిటీ..?
తిరుమల వెళ్లేవారికి టీటీడీ అలర్ట్.. ఆ దర్శనాలు రద్దు
తిరుమల వెళ్లేవారికి టీటీడీ అలర్ట్.. ఆ దర్శనాలు రద్దు
ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన 260 కోట్ల బ్లాక్ బస్టర్..తెలుగులోనూ ఉంది
ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన 260 కోట్ల బ్లాక్ బస్టర్..తెలుగులోనూ ఉంది