100కుపైగా సినిమాలు.. చిరు, బాలయ్యతో బ్లాక్ బస్టర్స్.. కట్ చేస్తే ఇప్పుడు క్రైస్తవ మత ప్రచారకురాలు
ఈ ఫొటోలో కనిపిస్తున్న అందాల తారను గుర్తుపట్టారా.? మొదట బాలనటిగా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత హీరోయిన్ గానూ సక్సెస్ అయ్యింది. వందకు పైగా సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, మోహన్ లాల్, మమ్ముట్టి తదితర స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.

సినీ సెలబ్రెటీల కెరీర్ భలే చిత్ర విచిత్రంగా ఉంటుంది. కొందరు అవకాశాలు అందుకొని స్టార్స్ గా మారి లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తుంటారు. మరికొందరు అలా కాదు. అవకాశాలు వచ్చిన సమయంలో ఓ వెలుగు వెలిగి ఆతర్వాత కనిపించకుండా మాయం అవుతుంటారు. కట్ చేస్తే ఎక్కడో ఓ సినిమా ఫంక్షన్స్ లో మెరుస్తూ ఉంటారు. సినిమాలు మానేసి పెళ్లి చేసుకొని సెటిల్ అయినా వాళ్ళు కొందరు ఉంటే.. మరికొందరు మాత్రం ఊహించని విధంగా కొత్త మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు. వారిలో పైన కనిపిస్తున్న హీరోయిన్ ఒకరు. ఆమె ఇండస్ట్రీలో ఓ క్రేజీ హీరోయిన్, స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసింది. కానీ ఇప్పుడు సినిమాలు మానేసి క్రైస్తవ మత ప్రచారకురాలిగా మారిపోయింది. 90స్ డ్రీమ్ గర్ల్ పేరు తెచ్చుకుంది ఆమె. అయితే సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే వివాహం చేసుకుంది. భర్తతో కలిసి అమెరికా వెళ్లిపోయింది. ఇద్దరు పిల్లలకు తల్లయ్యింది.
ఇది కూడా చదవండి : Tollywood : ఇలాంటి లవ్ స్టోరీని కొట్టే సినిమానే లేదు.. 44 ఏళ్లు అవుతున్న అదే క్రేజ్
పెళ్లయ్యాక కూడా కొన్ని సినిమాల్లో నటించి ఆకట్టుకుంది ఆమె.. ఊహించని విధంగా ఇండస్ట్రీకి దూరమైంది. ఆతర్వాత భర్తతో విడాకులు తీసుకొని వార్తల్లో నిలిచింది. ఆతర్వాత ఆమె పెద్దగా ఎక్కడా కనిపించలేదు. కట్ చేస్తే అమెరికాలో నివాసముంటూ క్రైస్తవ మత ప్రచారకురాలిగా మారి బిజి బిజీగా గడుపుతోంది. ఇటీవల ఆమెకు సంబంధించి కొన్ని వీడియోలు కూడా నెట్టింట బాగా వైరలయ్యాయి. వీటిని చూసిన సినీ అభిమానులు అందులో నటిని చూసి ఆశ్చర్యపోయారు.
ఇది కూడా చదవండి : రెమ్యునరేషన్ అడిగితే చంపేస్తాం అంటున్నారు.. రోడ్డు మీద పట్టుకొని కొట్టారు..! కన్నీళ్లు పెట్టుకున్న నటుడు
ఆమె మరెవరో కాదు ఆదిత్య 369 సినిమాలో బాలకృష్ణతో కలిసి నటించిన మోహినీ అలియాస్ మహాలక్ష్మి శ్రీనివాసన్. 1991లో ఈరమన రోజావే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యారు మోహిని. నందమూరి బాలకృష్ణ నటించిన సెన్సేషనల్ మూవీ ఆదిత్య 369 సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు మోహిని. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. మోహన్ బాబు డిటెక్టివ్ నారద, మామ బాగున్నావా, హిట్లర్ సినిమాల్లో నటించారు. మొత్తంగా 100 కి పైగా సినిమాల్లో నటించిన మోహినీ.. టీవీ షోల్లోనూ సందడి చేశారు. మోహిని చివరిసారిగా 2011లో మలయాళ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం కలెక్టర్‌లో కనిపించింది. అదే సమయంలో భరత్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న మోహినీ. అమెరికాలో సెటిలైపోయింది. భర్తతో విడాకులు తీసుకున్న మోహిని ప్రస్తుతం క్రైస్తవ మత ప్రచారకురాలిగా, సింగిల్ మదర్ గా లైఫ్ లీడ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి :చిన్న సినిమా.. కట్ చేస్తే 8 రోజుల్లో 24 కోట్ల వసూళ్లు..! ఎక్కడ చూసిన ఈ మూవీ పేరే వినిపిస్తుంది
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
