AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మిలటరీ మాధవరం.. ప్రతి ఇంటికో సైనికుడు! దేశభక్తికి నిలువెత్తు నిదర్శనంగా ఆ గ్రామం

Military Madhavaram: పశ్చిమగోదావరి జిల్లాలోని మాధవరం దేశ రక్షణలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గ్రామం. ఒకప్పుడు ప్రతి కుటుంబం నుంచి యువకులు సైన్యంలో చేరడం ఆనవాయితీగా ఉండేది. బ్రిటిష్ కాలం నాటి ప్రపంచ యుద్ధాల నుంచి నేటి సరిహద్దు పోరాటాల వరకు ఈ గ్రామానికి చెందిన ఎందరో సైనికులు సేవలందించారు. అందుకే మాధవరం కాస్తా ‘మిలటరీ మాధవరం’గా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది.

మిలటరీ మాధవరం.. ప్రతి ఇంటికో సైనికుడు! దేశభక్తికి నిలువెత్తు నిదర్శనంగా ఆ గ్రామం
Military Madhavaram
B Ravi Kumar
| Edited By: |

Updated on: Aug 15, 2026 | 9:08 AM

Share

Military Madhavaram: దేశ రక్షణలో ఆ గ్రామం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ ఊరిలో ప్రతి ఇంటి నుంచి కనీసం ఒక్కరైనా సైన్యంలో సేవలందిస్తున్నారంటే నమ్మగలరా? పశ్చిమగోదావరి జిల్లాలోని ‘మిలిటరీ మాధవరం’. దేశభక్తికి, అసలైన క్రమశిక్షణకు నిలువెత్తు రూపంగా ఆ గ్రామం కొనసాగుతుంది. ఇది సాధారణ పల్లెటూరు కాదు.. దేశ సరిహద్దుల్లో శత్రువుల గుండెల్లో నిదురించే వీరుల గ్రామం. బ్రిటిష్ కాలం నాటి ప్రపంచ యుద్ధాల నుంచి నేటి సరిహద్దు పోరాటాల వరకు.. ప్రతి చారిత్రక ఘట్టంలోనూ ఈ ఊరి రక్తం చిందింది. ఒకప్పుడు గ్రామంలోని ప్రతి కుటుంబం నుంచి యువకులు సైన్యంలో చేరడం ఆనవాయితీగా ఉండేది. అందుకే ఊరి అసలు పేరు మాధవరం అయినప్పటికీ.. దేశం మొత్తం దీన్ని సగర్వంగా ‘మిలట్రీ మాధవరం’ అని పిలుచుకుంటోంది.

“మా గ్రామంలో ఆర్మీలో చేరడం అనేది కేవలం ఒక ఉద్యోగం కాదు.. అదొక జీవన విధానం, మా రక్తంలోనే ఉన్న దేశభక్తి. తాత, తండ్రి, కొడుకు.. ఇలా మూడు నాలుగు తరాలుగా దేశ సరిహద్దుల్లో నిలబడి కాపలా కాస్తున్నారని స్థానికులు గర్వంగా చెప్పుకుంటారు’ అని మాజీ సైనికుడు ఒకరు తెలిపారు.

ఇక్కడి యువతకు సైన్యంలో చేరడం కేవలం జీవనోపాధి కాదు.. భరతమాతకు సేవ చేయాలనే బలమైన ఆకాంక్ష! తరాలు మారుతున్నా.. ఈ ఊరి స్పూర్తి ఏమాత్రం తగ్గలేదు. గ్రామంలోని మాజీ సైనికులే స్వయంగా కొత్త తరానికి శిక్షణ ఇస్తూ, సైన్యంలోకి అడుగుపెట్టేలా మార్గనిర్దేశం చేస్తున్నారు. పొలాల్లో కష్టపడే సాధారణ రైతుల ఇళ్లలోనే.. దేశాన్ని కాపాడిన లెఫ్టినెంట్లు, సుబేదార్లు, సైనికుల వీరగాథలు వినిపిస్తాయి. గ్రామంలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్మారక చిహ్నాలు నేటి యువతకు ప్రతిరోజూ దేశభక్తి పాఠాలు నేర్పుతున్నాయని గ్రామస్తులు తెలిపారు.

“దేశ రక్షణే పరమావధిగా.. రక్తాన్ని సైతం దేశానికి అర్పించేందుకు సిద్ధపడే ఇలాంటి గ్రామాలు మన దేశానికి నిజమైన రక్షణ కవచాలు. ప్రతి ఇంటికో సైనికుడిని అందించిన ‘మిలట్రీ మాధవరం’ యావత్ భారతదేశానికే ఆదర్శప్రాయం!” అని వారు పేర్కొన్నారు.

వీడియో చూడండి..

Follow Us
మిలటరీ మాధవరం.. ప్రతి ఇంటికో సైనికుడు! దేశభక్తికి నిలువెత్తు..
మిలటరీ మాధవరం.. ప్రతి ఇంటికో సైనికుడు! దేశభక్తికి నిలువెత్తు..
వామ్మో.. రాచనాగు మరో పామును మింగడం ఎప్పుడైనా చూశారా..?
వామ్మో.. రాచనాగు మరో పామును మింగడం ఎప్పుడైనా చూశారా..?
పీఎఫ్ విత్ డ్రా రూల్స్‌లో కేంద్రం భారీ మార్పులు.. రెండు నెలల..
పీఎఫ్ విత్ డ్రా రూల్స్‌లో కేంద్రం భారీ మార్పులు.. రెండు నెలల..
వేడివేడి అన్నం, టిఫిన్లలోకి అద్భుతమైన రుచినిచ్చే పల్లీ కారంపొడి
వేడివేడి అన్నం, టిఫిన్లలోకి అద్భుతమైన రుచినిచ్చే పల్లీ కారంపొడి
కంగనా రనౌత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా ఆ క్రేజీ హీరోయిన్..
కంగనా రనౌత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా ఆ క్రేజీ హీరోయిన్..
తలలకు కెమెరాలు.. రోబోలకు పని నేర్పిస్తున్న శ్రామికులకే చివరికి..
తలలకు కెమెరాలు.. రోబోలకు పని నేర్పిస్తున్న శ్రామికులకే చివరికి..
భారత్‌ త్వరలోనే శక్తివంతమైన దేశంగా మారుతోంది: ప్రధాని మోదీ
భారత్‌ త్వరలోనే శక్తివంతమైన దేశంగా మారుతోంది: ప్రధాని మోదీ
భారత్‌లో ఉన్న ఏకైక మగ నది.. దీన్ని మిస్టరీ తెలిస్తే అవాక్కే..
భారత్‌లో ఉన్న ఏకైక మగ నది.. దీన్ని మిస్టరీ తెలిస్తే అవాక్కే..
ఆధార్ కార్డు అప్డేట్ చేస్తామంటూ ఇంట్లో చోరీ
ఆధార్ కార్డు అప్డేట్ చేస్తామంటూ ఇంట్లో చోరీ
IND vs SL 1st Test: స్పెషల్ డేన స్పెషల్ మ్యాచ్‌కు సిద్ధమైన భారత్
IND vs SL 1st Test: స్పెషల్ డేన స్పెషల్ మ్యాచ్‌కు సిద్ధమైన భారత్