AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : కంగనా రనౌత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా ఆ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.12 కోట్లు.. ఫాలోయింగ్ చూస్తే..

ప్రస్తుతం కంగనా రనౌత్ నటించిన ఒక సినిమా ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. అందులో తన పక్కన చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించిన ఒక అమ్మాయి ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో క్రేజీ హీరోయిన్. స్టార్ హీరోలకు మించిన ఫాలోయింగ్ ఆమె సొంతం, సహజ నటన, సహజ సౌందర్యంతో కట్టిపడేస్తుంది. అయితే ఒకప్పుడు ఆమె చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లో నటించిందని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టగలరా... ?

Tollywood : కంగనా రనౌత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా ఆ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.12 కోట్లు.. ఫాలోయింగ్ చూస్తే..
Sai Pallavi
Rajitha Chanti
|

Updated on: Aug 15, 2026 | 8:42 AM

Share

చిత్ర పరిశ్రమలో తమకంటూ ఒక పేరు సంపాదించుకోవడానికి చాలా మంది ఈ రంగంలోకి అడుగుపెడతారు. కానీ ఇందులో అందరూ విజయం సాధించలేరు. ఈ విజయాన్ని అందుకోవడానికి ఎన్నో కఠిన పరీక్షలను, కష్టాలను, ఇబ్బందులను అధిగమించాల్సి ఉంటుంది. అందుకే పరిశ్రమలో సెలబ్రిటీల పేరే మారుమోగుతుంది. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ ఒకరు. ఒకప్పుడు ఆమె చైల్డ్ ఆర్టిస్ట్.. దక్షిణాది నుంచి నార్త్ ఇండస్ట్రీ వరకు సినిమాల్లో నటించిందని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. అందులో బాలీవుడ్ ‘పంగా క్వీన్’ కంగనా రనౌత్ వెనుక ఒక నటి గుంపులో నిలబడి ఉంది. ఆ సమయంలో ఆ నటి 6వ తరగతి చదువుతోంది. కానీ ఇప్పుడు కోట్లాది మంది హృదయాలు గెలుచుకుంది. ఆమె మరెవరో కాదు.. న్యాచులర్ బ్యూటీ.. లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి. బాలనటిగా గుర్తింపు లేని చిన్న చిన్న పాత్రలతో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. కానీ 2015లో విడుదలైన ప్రేమమ్ సినిమా మాత్రం ఆమె లైఫ్ మార్చేసింది. ఆ తర్వాత ఫిదా మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి స్టార్ డమ్ సంపాదించుకుంది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : పెళ్లి కాకుండానే కలిసి ఉంటున్నాం.. అప్పుడే విడిపోవాలని అనుకున్నాం.. టాలీవుడ్ నటి..

ఆమె కంగనా రనౌత్ నటించిన ధామ్ ధూమ్ సినిమాలో నటించింది. 2008లో విడుదలైన ఈ చిత్రాన్ని దివంగత డైరెక్టర్ జీవా తెరకెక్కించారు. ఈ సినిమాలో జయం రవి, కంగనా రనౌత్, లక్ష్మీ రాయ్, జయరామ్ ప్రధాన పాత్రలు పోషించారు. ముఖ్యంగా, ఈ చిత్రంతో కంగనా రనౌత్ తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రంలో సాయి పల్లవి, షెన్బా (కంగనా) స్నేహితురాలి పాత్రను పోషించారు. ఈ సినిమా సమయంలో సాయి పల్లవి కేవలం 6వ తరగతి మాత్రమే చదువుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం సాయి పల్లవి పాన్ ఇండియా క్రేజీ హీరోయిన్. డ్యాన్స్ లో ఎలాంటి శిక్షణ లేకుండానే తెలుగులో ఢీ షోలో పాల్గొని తన అదృష్టం పరీక్షించుకుంది. అయితే, గ్రాండ్ ఫినాలేకు చేరుకున్నప్పటికీ ఆమె ఆ షోను గెలవలేకపోయింది.

ఎక్కువ మంది చదివినవి : Hemachandra: నేను చేసిన మొదటి తప్పు అదే.. వాటి నుంచి ఎన్నో నేర్చుకున్నాను.. సింగర్ హేమచంద్ర..

ఆమె ఒకవైపు తన వైద్య విద్యను పూర్తి చేస్తూ, మరోవైపు నటనపై తనకున్న అభిరుచిని విడిచిపెట్టలేదు. ధనుష్‌తో కలిసి ఆమె పాడిన ‘రౌడీ బేబీ’ పాట యూట్యూబ్‌లో 100 కోట్లకు పైగా వ్యూస్ సాధించి చారిత్రాత్మక ప్రపంచ రికార్డు సృష్టించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు 4000 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్న రామాయణం చిత్రంలో సీతమాత పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రానికి ఆమె రూ.12 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి :  Tollywood: ఆ సినిమాను ఆ హీరో తప్ప మరెవరు చేయలేరు.. అందుకే నేను రిజెక్ట్ చేశా.. నటుడు సుమంత్..

సాయి పల్లవి

Shyam Singha Roy

Shyam Singha Roy

ఎక్కువ మంది చదివినవి : Cinema : చనిపోయిన అమ్మాయిని వేధించే కుర్రాడు.. ప్రతి 20 నిమిషాలకు ఊహించని మలుపులు.. ఓటీటీని శాసిస్తున్న సినిమా..

Follow Us