సింపుల్‌గా.. క్యూట్‌గా.. యాంకర్ రష్మి ఫొటోస్

Samatha

15  August 2026

అందాల ముద్దుగుమ్మ యాంకర్ రష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.

ఈ బ్యూటీ ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా తెలుగు అభిమానుల మనసు దోచుకుంది. యాంకరింగ్ చేస్తూ మంచి ఫేమ్ సంపాదించుకుంది.

జబర్దస్త్‌లో యాంకరింగ్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చున్న ఈ ముద్దుగుమ్మ సుధీర్‌తో లవ్ ట్రాక్ వలన విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకుంది.

వీరిద్దరు లవ్ లో ఉన్నారంటూ అనేక వార్తలు కూడా నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. దానికి తగ్గట్టు వీరు షోలలో పంచ్ డైలాగ్స్ ఇవన్నీ కూడా నిజమనిపించేలా ఉండేవి.

కానీ వీరు చాలా సార్లు దానిపై క్లారిటీ ఇవ్వడం జరిగింది. కేవలం షో వరకు మాత్రమే, మేము మంచి స్నేహితులం అంటూ చాలా సార్లు చెప్పుకొచ్చారు.

ఇక జబర్దస్త్ నుంచి సుధీర్ బయటకు వచ్చిన తర్వాత, రష్మి, శ్రీదేవి డ్రామ కంపెనీ, కామెడీ షో.. ఇలా కొన్ని షోలలో కనిపిస్తుంది.

ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు నచ్చిన బ్యూటిఫుల్ ఫొటోస్ అభిమానులతో పంచుకుంటుంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టా గ్రామ్‌లో షేర్ చేసి క్యూట్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన వారు క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.