AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ప్రపంచం భారత్‌ వైపు చూస్తోంది.. త్వరలోనే శక్తివంతమైన దేశంగా మారుతోంది: ప్రధాని మోదీ

దేశ రాజధాని ఢిల్లీలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. చారిత్రకమై ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర సమరయోధులను స్మరించుకున్నారు ప్రధాని మోదీ. వరుసగా 13వ సారి జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రధాని మోదీ రికార్డ్ క్రియేట్ చేశారు.

PM Modi: ప్రపంచం భారత్‌ వైపు చూస్తోంది.. త్వరలోనే శక్తివంతమైన దేశంగా మారుతోంది: ప్రధాని మోదీ
Pm Modi Red Fort Speech At Read Port
Anand T
|

Updated on: Aug 15, 2026 | 9:22 AM

Share

80వ స్వతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశంలోని యువతకు ప్రధాని మోదీ అదిరిపోయే శుభవార్త చెప్పారు. రానున్న సంవత్సరంలో దేశ వ్యాప్తంగా ఏఐ స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో కోటి మంది యువతకు ఏఐ శిక్షణ ఇవ్వబోతున్నట్టు మోదీ తెలిపారు. అలాగే పోటీ పరీక్షలకు సిద్దమయ్యే యువతకు ఉచితంగా ఆన్‌లైన్‌ కోచింగ్ ఇవ్వనున్నట్టు తెలిపారు.

Modi

Modi

ఈ సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకున్నారు. తొలిసారి ఎర్రకోటలో వందేమాతరం ఆలపించామని తెలిపారు. దేశం సరికొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతోందని, ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడుతోందని పేర్కొన్నారు. ప్రతి హృదయం వందేమాతరంతో మార్మోగుతోందని, దేశ ప్రజలంతా పెద్ద కలలు కనాలని పిలుపునిచ్చారు.

వికసిత్ భారత్ లక్ష్యం – పేదరిక నిర్మూలన

దృఢ సంకల్పంతో ముందుకెళ్లి, 2047 నాటికి ‘వికసిత్ భారత్’గా నిలవాలన్నదే మన లక్ష్యమని ప్రధాని అన్నారు. నేడు ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందని, గత కొన్నేళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటకు వచ్చారని వెల్లడించారు. భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమని, 140 కోట్ల మంది సంకల్పాన్ని అడ్డుకోవడం ఎవరికీ సాధ్యం కాదన్నారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి ‘ఆత్మనిర్భర్ భారత్’గా ఎదగాలని ఆకాంక్షించారు. అలాగే ‘మేక్ ఇన్ ఇండియా’, స్వదేశీ ఉత్పత్తులు, ‘వోకల్ ఫర్ లోకల్’ విధానాలను దేశ ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారని కొనియాడారు.

పారిశ్రామిక, ఇంధన రంగాల్లో ముందడుగు

దేశంలో సెమీకండక్టర్ ప్లాంట్లు త్వరలోనే ఏర్పాటు కాబోతున్నాయని ప్రధాని తెలిపారు. డిజిటల్, క్రిటికల్ మినరల్స్‌పై ప్రత్యేక దృష్టి సారించామని, ఇప్పటికే అనేక దేశాలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నామని వివరించారు. భారత్ న్యూక్లియర్ ఎనర్జీ వైపు వడివడిగా అడుగులు వేస్తోందని, త్వరలోనే 5 కొత్త న్యూక్లియర్ ప్లాంట్లు రాబోతున్నాయని చెప్పారు. భవిష్యత్తులో 100 గిగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అలాగే ‘సముద్ర మంథన్’ ద్వారా కొత్త ఆవిష్కరణలు చేపట్టామని, 1.75 కోట్ల ఇళ్లకు గ్యాస్ పైప్‌లైన్, 50 లక్షల ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయడమే కాకుండా, హైడ్రోజన్ రైళ్లు కలిగిన దేశాల సరసన భారత్ చేరిందని వివరించారు.

మోదీ ప్రసంగం..

స్వయం సమృద్ధి – అడ్డంకుల అధిగమనం

భారత ప్రజలను భయపెట్టి ఆనందించాలని కొందరు చూశారని మోదీ విమర్శించారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్, ఎరువుల కొరత వస్తుందంటూ అసత్యాలు ప్రచారం చేసినప్పటికీ, ఎన్ని అడ్డంకులు ఎదురైనా దేశ ప్రజలకు ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నామని స్పష్టం చేశారు. భారత్ తన అంతర్గత సామర్థ్యాన్ని మాత్రమే నమ్ముకుని నిరంతరం ముందుకు సాగుతుందని ప్రధాని తన ప్రసంగంలో పేర్కొన్నారు.

ప్రధాని మోదీ లైవ్ ప్రసంగం ఇక్కడ చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అమరావతిలో మువ్వెన్నెల జెండాను ఎగురవేసిన సీఎం చంద్రబాబు
అమరావతిలో మువ్వెన్నెల జెండాను ఎగురవేసిన సీఎం చంద్రబాబు
మిలటరీ మాధవరం.. ప్రతి ఇంటికో సైనికుడు! దేశభక్తికి నిలువెత్తు..
మిలటరీ మాధవరం.. ప్రతి ఇంటికో సైనికుడు! దేశభక్తికి నిలువెత్తు..
వామ్మో.. రాచనాగు మరో పామును మింగడం ఎప్పుడైనా చూశారా..?
వామ్మో.. రాచనాగు మరో పామును మింగడం ఎప్పుడైనా చూశారా..?
పీఎఫ్ విత్ డ్రా రూల్స్‌లో కేంద్రం భారీ మార్పులు.. రెండు నెలల..
పీఎఫ్ విత్ డ్రా రూల్స్‌లో కేంద్రం భారీ మార్పులు.. రెండు నెలల..
వేడివేడి అన్నం, టిఫిన్లలోకి అద్భుతమైన రుచినిచ్చే పల్లీ కారంపొడి
వేడివేడి అన్నం, టిఫిన్లలోకి అద్భుతమైన రుచినిచ్చే పల్లీ కారంపొడి
కంగనా రనౌత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా ఆ క్రేజీ హీరోయిన్..
కంగనా రనౌత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా ఆ క్రేజీ హీరోయిన్..
తలలకు కెమెరాలు.. రోబోలకు పని నేర్పిస్తున్న శ్రామికులకే చివరికి..
తలలకు కెమెరాలు.. రోబోలకు పని నేర్పిస్తున్న శ్రామికులకే చివరికి..
భారత్‌ త్వరలోనే శక్తివంతమైన దేశంగా మారుతోంది: ప్రధాని మోదీ
భారత్‌ త్వరలోనే శక్తివంతమైన దేశంగా మారుతోంది: ప్రధాని మోదీ
భారత్‌లో ఉన్న ఏకైక మగ నది.. దీన్ని మిస్టరీ తెలిస్తే అవాక్కే..
భారత్‌లో ఉన్న ఏకైక మగ నది.. దీన్ని మిస్టరీ తెలిస్తే అవాక్కే..
ఆధార్ కార్డు అప్డేట్ చేస్తామంటూ ఇంట్లో చోరీ
ఆధార్ కార్డు అప్డేట్ చేస్తామంటూ ఇంట్లో చోరీ