AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆయన నాకు ఇంటి దేవుడు.. నా కుటుంబాన్ని నిలబెట్టిన దైవం

తెలుగు తెర పై నవ్వులు పూయించే కమెడియన్స్ చాలా మంది ఉన్నారు. మేల్ కమెడియన్స్ మాత్రమే కాదు ఫీమేల్ కమెడియన్స్ కూడా చాలా మంది టాలీవుడ్ లో నవ్వులు పూయించారు. వారిలో సీనియర్ నటి శ్రీలక్ష్మీ ఒకరు. ఎన్నో సినిమాల్లో తన కామెడీతో నవ్వులు పూయించారు శ్రీలక్ష్మీ.

ఆయన నాకు ఇంటి దేవుడు.. నా కుటుంబాన్ని నిలబెట్టిన దైవం
Actress Sri Lakshmi
Rajeev Rayala
|

Updated on: Sep 04, 2026 | 9:51 PM

Share

ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రముఖ నటి శ్రీలక్ష్మి తన సినీ ప్రస్థానాన్ని, దివంగత దర్శకులు జంధ్యాల, కే. విశ్వనాథ్ వంటి దిగ్గజాలతో తన అనుభవాలను, తెలుగు సినిమా రంగంలో వచ్చిన మార్పులను వివరంగా పంచుకున్నారు. జంధ్యాల గారితో తనకున్న అనుబంధాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. శ్రీలక్ష్మి తనను ఒక కామెడీ నటిగా నిలబెట్టిన ఘనత పూర్తిగా దర్శకుడు జంధ్యాల గారిదేనని పేర్కొన్నారు. నీకు కామెడీ రాదు” అని ఒకరు అన్నప్పుడు, జంధ్యాల గారు నేను చేయిస్తాను చూడు, నువ్వు రాదు అనే మాట ఇంకొకసారి అనకు’ అని తనకు ధైర్యం చెప్పి కామెడీ చేయించారని గుర్తు చేసుకున్నారు. ఈ రోజు తాను కామెడీయన్ గా పేరు తెచ్చుకున్నానంటే అది ఆయన ఆశీస్సుల వల్లేనని, జంధ్యాల గారిని తన ఇంటి దేవుడుగా, కుటుంబాన్ని నిలబెట్టిన దైవంగా భావిస్తున్నానని, రెండు చేతులు జోడించి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని భావోద్వేగానికి లోనయ్యారు.

Jabardasth Komaram: జబర్దస్త్‌లో నాకు లైఫ్ ఇచ్చి, అన్నం పెట్టింది ఆయనే.. ఆ అన్న వల్లే ఇప్పుడు ఇదంతా

దర్శకుడు కే. విశ్వనాథ్ తో శుభ సంకల్పం చిత్రంలో పని చేసిన అనుభవాన్ని కూడా శ్రీలక్ష్మి పంచుకున్నారు. అప్పటి కాలంలో నటులు కేవలం నటనకు మాత్రమే పరిమితం కాకుండా, డాన్స్, స్విమ్మింగ్, కూచిపూడి, భరతనాట్యం వంటి అనేక కళలు నేర్చుకోవాల్సి వచ్చేదని వివరించారు. సరైన ఎత్తు, మంచి వాయిస్ ఉండేవారని, ఇన్ని నైపుణ్యాలు ఉంటేనే వేషాలు లభించేవని పేర్కొన్నారు. నటులు కష్టపడి పని చేసేవారని, నాగేశ్వరరావు వంటి దిగ్గజాలతో ఒకే ఒక్క డాన్స్ బిట్ చేయడానికి కూడా ఎన్నో కష్టాలు పడ్డానని తెలిపారు.

మంచి ఛాన్స్ మిస్ అయ్యాయంది.. ఆ సినిమా చేయలేకపోయా అని చాలా ఫీల్ అయ్యా..

అప్పటి తరం సినిమా చిత్రీకరణ పద్ధతులను, ఇప్పుడున్న టెక్నిక్‌ల మధ్య తేడాలను శ్రీలక్ష్మి వివరించారు. గతంలో ఒక డైలాగ్ చెప్పడానికి ఎన్నో రిహార్సల్స్ ఉండేవని, దర్శకుడు టేక్ అనగానే డైలాగ్ చెప్పి, సన్నివేశాన్ని పూర్తి చేయాల్సి వచ్చేదని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు రిహార్సల్స్ లేవని, టెక్నిక్ పూర్తిగా మారిపోయిందని, ఒకేసారి రెండు, మూడు కెమెరాలతో షూటింగ్ జరుగుతోందని తెలిపారు. అయితే, తాను పాత పద్ధతిలో శిక్షణ పొందడం వల్ల ఇప్పటికీ డైలాగ్ నేర్చుకోవడానికి, పట్టుకోవడానికి భయం ఉంటుందని, అది తనకు ఒక పాఠంగా నిలిచిందని చెప్పారు. నందిని రెడ్డి వంటి దర్శకులతో పనిచేసేటప్పుడు తాను చాలా జాగ్రత్తగా ఉంటానని తెలిపారు.

ఇవి కూడా చదవండి

8 ఏళ్లుగా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సినిమా.. రూ.25 కోట్లు పెడితే రూ.180 కోట్లు వచ్చాయి.. ఇప్పటికీ ఓటీటీలో ట్రెండింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us