Epic Movie Trailer: అదరగొట్టిన ఆనంద్ దేవరకొండ.. ఆకట్టుకుంటున్న ఎపిక్ ట్రైలర్
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ‘దొరసాని’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆనంద్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు ఆనంద్. ఇక ఇప్పుడు ఎపిక్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సోదరుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆనంద్ దేవరకొండ. అయితే దొరసాని, మిడిల్ క్లాస్ మెలొడీస్, పుష్పక విమానం, హైవే, బేబీ.. ఇలా డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ఓ ఐడెంటిటీని సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా సినిమా కథల ఎంపికలో ఆనంద్ దేవరకొండ చాలా డిఫరెంట్‌గా ఆలోచిస్తున్నాడు. బేబీతో బ్లాక్ బస్టర్ మూవీని ఖాతాలో వేసుకున్నాడు ఆనంద్ దేవర కొండ ఇప్పుడు ఎపిక్ సినిమాతో ప్రేక్షకుల ,ముందుకు రానున్నాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో ఆదిత్య హాసన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఇప్పటివరకు విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. హీరోయిన్ రష్మిక మందన్న ఈ ఈవెంట్ కి గెస్ట్ గా హాజరయి ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




