AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie : ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్.. సునీల్ అదరగొట్టేశాడు భయ్యా

ప్రస్తుత కాలంలో సినిమా ప్రేక్షకుడి ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది. థియేటర్‌లో పెద్దగా ఆదరణ నోచుకోని ఎన్నో సినిమాలు, డిజిటల్ మాధ్యమాలకు వచ్చేసరికి సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా క్రైమ్, సస్పెన్స్ , ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోనర్ చిత్రాలకు ఓటీటీలో అద్భుతమైన ఆదరణ లభిస్తోంది.

OTT Movie : ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్.. సునీల్ అదరగొట్టేశాడు భయ్యా
Ott
Rajeev Rayala
|

Updated on: Oct 24, 2026 | 1:26 PM

Share

తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే విభిన్నమైన కథాంశాలతో తెరకెక్కుతున్న సినిమాలకు ఓటీటీలో మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా సైకలాజికల్ థ్రిల్లర్, క్రైమ్ మిస్టరీ సినిమాలను ఇష్టపడేవారికి ఆసక్తి కలిగించేలా ‘ఫైట్ మహా’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. అఖిల్ రాజ్, సునీల్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తోంది. ‘ఫైట్ మహా’ సినిమాకు ఆనంద్ చంద్ర దర్శకత్వం వహించారు. గతంలో ‘మర్డర్’ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఈసారి సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశాన్ని ఎంచుకున్నారు. న్యూ ఐ మూవీస్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై ఏవీఎస్ రాజు, ఆర్. కుమార్ రాజు, ఆనంద్ చంద్ర సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

‘కలలు నిజమైతే.. అది ఎవరి నిజం?’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 21న థియేటర్లలో విడుదలైంది. కథలోని మానసిక సంఘర్షణలు, మిస్టరీ అంశాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ సినిమాలో మహా అనే యువకుడి పాత్రలో అఖిల్ రాజ్ కనిపిస్తారు. విశాఖపట్నానికి చెందిన మహాకు ఆర్టిస్ట్ కావాలనే కోరిక ఉంటుంది. తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి హైదరాబాద్‌కు వచ్చిన అతడికి పోలీస్ శాఖలో క్రైమ్ స్కెచ్ ఆర్టిస్ట్‌గా పనిచేసే అవకాశం లభిస్తుంది. నిందితుల రూపురేఖలను చిత్రాల రూపంలో గీస్తూ పోలీసులకు కేసుల దర్యాప్తులో సహాయం చేస్తుంటాడు. అయితే, మహా జీవితంలో ఒక తీవ్రమైన సమస్య ఉంటుంది. నిద్రలో నడిచే అలవాటు, భయంకరమైన కలలు అతడిని ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. చిన్నతనంలో కోల్పోయిన తండ్రికి సంబంధించిన జ్ఞాపకాలు కూడా అతడిని మానసికంగా వెంటాడుతుంటాయి. ఈ పరిస్థితులు అతడి జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పాయన్నదే కథలో కీలకమైన అంశం. తన సమస్యకు పరిష్కారం వెతుక్కుంటూ మహా సైకాలజిస్ట్ గుప్తాను సంప్రదిస్తాడు. ఈ క్రమంలో యోగా టీచర్ అమీనా అతడి జీవితంలోకి వస్తుంది. అంతా సవ్యంగా సాగుతోందనుకున్న సమయంలో అనూహ్యంగా ఓ హత్య కేసులో మహా చిక్కుకుంటాడు.

తనకు తెలియకుండానే జరిగినట్లు భావించే ఈ నేరం వెనుక అసలు నిజమేంటి.? హత్యకు గురైన మహిళ ఎవరు.? మహాకు, ఆ ఘటనకు ఉన్న సంబంధం ఏమిటి? అతడిని వెంటాడుతున్న కలలకు, గత జ్ఞాపకాలకు ఈ కేసుతో ఏమైనా సంబంధం ఉందా.? అనే ప్రశ్నలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతాయి. ఈ రహస్యాల చుట్టూ సినిమా కథనం సాగుతుంది. ‘ఫైట్ మహా’లో అఖిల్ రాజ్, సునీల్‌తో పాటు శ్రీకాంత్ అయ్యంగార్, డాక్టర్ శ్రీవాణి గోపిచంద్, వైష్ణవి, సిద్ధార్థ్, సమీర్, దీపక్ కేశవ్, కృష్ణరాజు, జబర్దస్త్ శాంతి కుమార్, ఆయేషా, హరీష్, పూర్ణ శ్రీ, మాస్టర్ రోహన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. థియేటర్లలో విడుదలైన ఈ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ఇప్పుడు ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అక్టోబర్ 22 నుంచి ఈ సినిమా డిజిటల్ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఐఎమ్‌డీబీలో ఈ చిత్రానికి 9/10 రేటింగ్  వచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us