కాంగ్రెస్ నేత చిన్నా రెడ్డి తన పదవిని కోల్పోవడంపై స్పందిస్తూ, తనకు బాధ లేదని స్పష్టం చేశారు. తాను ఎప్పుడో ఇలాంటివాటిని వదిలేసుకున్నానని తెలిపారు. తన పదవికి నిర్దిష్ట గడువు లేదని, టిల్ ఫర్దర్ ఆర్డర్స్ అని మాత్రమే ఉందని, ఆ ఆదేశాలు ఇప్పుడు వచ్చాయని ఆయన వివరించారు.