అందాల భామ హెబ్బాపటేల్ సైలెంట్ అయిపోయిందే.. 

14 August   2026

Pic credit - Instagram

Rajeev 

హెబ్బా పటేల్ కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం సుకుమార్ నిర్మాణంలో వచ్చిన 'కుమారి 21F' సినిమా 

ఈ చిత్రంలో హెబ్బా పోషించిన కుమారి పాత్ర యూత్‌లో ట్రెండ్ సెట్ చేసింది. దాంతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. 

ఆతర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది. కుర్ర హీరోలందరూ ఈ ముద్దుగుమ్మ కోసం క్యూ కట్టారు. 

ఈడో రకం ఆడో రకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, అంధగాడు, ఏంజెల్, 24 కిస్సెస్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

హెబ్బా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలోకి కూడా అడుగుపెట్టింది. పలు వెబ్ సిరీస్‌లు సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

విభిన్నమైన, సవాలుతో కూడిన పాత్రలను పోషిస్తూ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఇప్పుడు అవకాశాలు తగ్గిపోయాయి. 

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యుల గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.