AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒళ్లు గగుర్పొడిచే సీన్.. పామును మింగుతూ షెడ్డులో ఇరుక్కున్న రాచనాగు.. వీడియో చూస్తే..

అనకాపల్లి జిల్లాలో రెండు భారీ కింగ్‌ కోబ్రాలు కలకలం సృష్టించాయి. మాడుగుల మండలం కుర్మానాధపురంలో సుమారు 13 అడుగుల కింగ్‌ కోబ్రా మరో పామును మింగుతూ రేకుల షెడ్‌లో ఇరుక్కుపోయింది. సమాచారం అందుకున్న స్నేక్‌ క్యాచర్‌ వెంకటేష్‌ సుమారు రెండు గంటలు శ్రమించి పామును సురక్షితంగా బయటకు తీశారు.

ఒళ్లు గగుర్పొడిచే సీన్.. పామును మింగుతూ షెడ్డులో ఇరుక్కున్న రాచనాగు.. వీడియో చూస్తే..
Anakapalli King Cobra
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Aug 15, 2026 | 9:01 AM

Share

కింగ్ కోబ్రా అనే ఈ పేరు వినగానే హడలెత్తిపోతాం.. విష సర్పాలు కూడా ఈ భారీ పామును చూసి భయపడతాయి.. కింగ్ కోబ్రా కంటపడితే తాము ఎక్కడ వాటికి ఆహారం అయిపోతామేమోనని తప్పించుకొని పారిపోతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో చిక్కి ఇద్దరు నాగులగు ఆహారంగా మారిపోతాయి. అలాగే.. అనకాపల్లి జిల్లాలో ఓ కింగ్ కోబ్రా ఓ పామును ఆహారంగా చేసుకుంటుంది. పొలాల్లో ఉన్న ఓ రేఖ షెడ్ పైకప్పులో ఇరుక్కుని సేద తీరుతుంది. ఇంతలో రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్.. ఆ భారీ రాచనాగును రెస్క్యూ చేసి.. దాని కడుపులోకి వెళ్తున్న మరో పామును కూడా బయటకి రప్పించి ప్రాణం పోశాడు. మరోచోట పొలాల్లో భారీ రాచనాగును రెస్క్యూ చేసి అడవుల్లో విడిచిపెట్టాడు స్నేక్ క్యాచర్.

అనకాపల్లి జిల్లాలో రెండు వేర్వేరు చోట్ల భార్య గిరినాగులు హల్చల్ చేశాయి. వి.మాడుగుల నియోజకవర్గంలో గిరి నాగుల కలకలం సృష్టించాయి. మాడుగుల మండలం కుర్మానాధ పురంలో రేకుల షెడ్ లో పదమూడు అడుగుల గిరినాగు కనిపించింది. ఆహారం వెతుక్కుంటూ వచ్చేసింది. మరో సర్పాన్ని మింగి షెడ్ రేకులలో ఇరుక్కుంది కింగ్ కోబ్రా. సిరిమిరి శెట్టి దొరబాబు అనే రైతు పొలంలో ఈ దృశ్యం చూసిన రైతు గుండెలు పట్టుకుని అడుగు. వెంటనే స్నేక్ క్యాచర్ వెంకటేష్ కు సమాచారం అందించారు. స్నేక్ క్యాచర్ వెంకటేష్ రెండు గంటలపాటు శ్రమించి మింగిన పాముని కక్కించి.. గిరినాగును చాకచక్యంగా బంధించాడు..

వీడియో చూడండి..

మరో 12 అడుగుల కింగ్ కోబ్రా….

ఈ రోజు తెల్లవారు జామున 3 గంటల సమయంలో చీడికాడ మండలం ఖండివరం గ్రామంలో పొలంలో 12 అడుగుల గిరినాగు కనిపించింది. అందరినీ హడలెత్తించింది. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ వెంకటేష్.. గిరినాగును చాకచక్యంగా బంధించాడు. రెండు గిరినాగులతో పాటు.. ఓ గిరి నాగు నోటి నుంచి బయటపడిన మరో సర్పానికి కూడా ప్రాణం పోసాడు స్నేక్ చేశారు. అటవీశాఖ అధికారులు సమక్షంలో రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో రెండు గిరినాగులతో పాటు మరో పామును విడిచిపెట్టాడు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us