ఇంటిమేట్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు విషయం చెప్పిన అందాల కామాక్షి భాస్కర్ల
సినీ పరిశ్రమలో తనదైన గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్న నటి కామాక్షి భాస్కర్ల. కేవలం గ్లామర్‌కు పరిమితం కాకుండా, నటనకు, కథాంశానికి ప్రాధాన్యత ఇస్తూ తన ప్రత్యేకమైన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఒక క్వాలిఫైడ్ డాక్టర్‌గా, ఇండిపెండెంట్ మహిళగా, సినీ రంగంలో తన అనుభవాలను, పాత్రల ఎంపిక వెనుక గల తన ఆలోచనలను ఆమె పంచుకున్నారు.

అందాల భామ కామాక్షి భాస్కర్ల గతంలో ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో బయాస్, మేల్ సెంట్రిక్ ధోరణి ఉందని అభిప్రాయపడిన కామాక్షి, “మహిళలు కేవలం అందంగా కనిపించడానికి మాత్రమే పరిమితం కారాదు” అనే తన ఎజెండాను మొదటి నుంచీ కలిగి ఉన్నానని తెలిపారు. థియేటర్ నేపథ్యం నుంచి వచ్చిన ఆమె, క్రాఫ్ట్‌పై తనకున్న అవగాహనను, నమ్మకాన్ని తెలిపారు. కేవలం గ్లామరస్ పాత్రలు చేసి తాను ఏం సాధిస్తానని ఎప్పుడూ ప్రశ్నించుకుంటానని, సబ్జెక్టివ్ ఎలిమెంట్ అయిన అందం కంటే, బ్యూటీ స్టాండర్డ్స్‌కు ఫిట్ అవ్వడం అనేది ఒక ప్రొఫెషనల్ అంశమని ఆమె వివరించారు. అందుకే, మొదటి నుంచీ డిఫరెంట్, ఇంట్రెస్టింగ్ పాత్రలనే ఎంచుకున్నానని కామాక్షి భాస్కర్ల తెలిపారు.
ఇది కూడా చదవండి : Actress Sudha: ఆ స్టార్ హీరో నాకు దేవుడితో సమానం.. రెండుసార్లు నా ప్రాణాలు కాపాడాడు.
పొలిమేర 1 చిత్రంలో ఇంటిమేట్ సీన్స్ చేసినందుకు చాలా మంది “డాక్టర్ అయ్యుండి ఎందుకు చేశారు?” అని అడిగారని, దానికి సమాధానంగా, “అది వేరే ప్రొఫెషన్, ఇది వేరే ప్రొఫెషన్, ఇందులో నా క్రాఫ్ట్ ఏంటో నాకు తెలుసు కాబట్టి చేశాను” అని ఆమె తెలిపారు. పొలిమేర 2లో లక్ష్మి పాత్ర ఆడియన్స్‌ను థియేటర్లలో కూర్చోబెట్టిందని, విద్యా ప్రాముఖ్యతను తెలియజేసిందని ఆమె గుర్తు చేసుకున్నారు. లైలా చిత్రంలో సుందరి పాత్ర చాలా నావెల్ అని, తన 2010-11 నాటి వ్యక్తిత్వాన్ని పోలి ఉంటుందని వివరించారు. ఒక నటిగా తన ఐడియాలజీకి భిన్నంగా ఉన్న పాత్రలను చేయగలగడమే తన నైపుణ్యమని ఆమె నమ్ముతారు. లైలాలోని సుందరి పాత్రకు డార్క్ స్కిన్ ఉండటం, ఆ పాత్ర విమర్శలకు గురవడం, ఎంతో మంది చిన్న పిల్లలు తన దగ్గరికి వచ్చి, సినిమాలో వాళ్ళలా లేమని బాధపడటం వంటి సంఘటనలు తనకు ఆ పాత్ర ఎంచుకోవడానికి ప్రేరణ అని కామాక్షి చెప్పారు.ఇది కూడా చదవండి : Prabhas: ప్రభాస్‌కు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆమె నా క్రష్ అంటున్న రెబల్ స్టార్
ప్రస్తుతం పలు ప్రాజెక్టులలో నటిస్తూ, తన కెరీర్‌లో బిజీగా ఉన్నానని కామాక్షి తెలిపారు. లీడ్ రోల్స్ కాకపోయినా, ప్యాన్ ఇండియా చిత్రాలలో కథాంశాన్ని మలుపు తిప్పే ప్రామినెంట్ పాత్రలకు ఆమె ప్రాధాన్యత ఇస్తున్నారు. తాను ఎప్పుడూ తన నటనను నమ్ముకున్నానని, “ఈ అమ్మాయికి ఎలాంటి రోల్ అయినా ఇవ్వొచ్చు” అని డైరెక్టర్లు, రైటర్లు భావించేలా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సృష్టించుకోవాలని ఆమె ఆకాంక్షిస్తున్నారు. తెలుగు అమ్మాయిలలో, మహిళా నటులలో అటువంటి స్పేస్ లేదని, తాను దానిని సృష్టించాలనుకుంటున్నానని అన్నారు. కామాక్షి భాస్కర్ల తన సినీ ప్రయాణాన్ని జీరో నుంచి ప్రారంభించానని తెలిపారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తన మొదటి చిత్రం అని, అందులో అఖిల్ స్నేహితురాలి పాత్ర చేశానని చెప్పారు. థియేటర్ నేపథ్యం నుంచి వచ్చి, కాస్టింగ్ కాల్స్‌కు దరఖాస్తు చేసుకుంటూ, ఆడిషన్స్ ఇస్తూ చిన్న చిన్న పాత్రల నుండి ఎదిగారు. పొలిమేర 1 తర్వాత OTTలో తన నటనను చూసి, విరూపాక్ష కోసం కార్తీక్ దండు బృందం తనను సంప్రదించిందని అన్నారు. “ఎంత టాలెంట్ ఉన్నా రికగ్నిషన్ లేనప్పుడు ఆఫర్స్ రావు, చిన్న రోల్ అయినా ఇంపాక్ట్ చూపించగలగాలి” అనే సూత్రాన్ని ఆమె నమ్ముతారు.
ఇది కూడా చదవండి : Nagarjuna: నాగార్జునకు విలన్‌గా ఆ అందాల భామ.. కింగ్ 100వ సినిమా కోసం మాస్టర్ ప్లాన్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




