Actress Sudha: ఆ స్టార్ హీరో నాకు దేవుడితో సమానం.. రెండుసార్లు నా ప్రాణాలు కాపాడాడు.
నటి సుధ అక్కినేని నాగార్జున గారితో తనకున్న అనుబంధం గురించి గతంలో ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. రెండు కీలక సందర్భాలలో నాగార్జున తన ప్రాణాలను కాపాడారని సుధ వెల్లడించారు. అందుకే నాగార్జున గారు తనకు అందరికంటే ఒక మెట్టు ఎక్కువే అని ఆమె అన్నారు.

ప్రముఖ నటి సుధ ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాత్రలు చేసి మెప్పించారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అక్కినేని నాగార్జున గారితో తనకున్న అత్యంత బలమైన, ప్రత్యేకమైన అనుబంధం గురించి పంచుకున్నారు సుధ. ఆయన తనకు రెండు కీలక సందర్భాలలో ప్రాణదాతగా నిలిచారని, ఆయన వల్లే ఈరోజు తాను బ్రతికి ఉన్నానని సుధ తెలిపారు. నాగార్జున గారు తనకు అందరికంటే ఒక మెట్టు ఎక్కువే అని, ఆయనే తనకు దేవుడిచ్చిన వరమని ఆమె పేర్కొన్నారు. సుధ తన సినీ జీవిత ప్రారంభంలో అల్లు రామలింగయ్య కుటుంబంతో, చిరంజీవి కుటుంబంతో మంచి సంబంధాలు ఏర్పరచుకున్నారని తెలిపారు. అయితే, నాగార్జున గారితో మాత్రం తనది ఇంకా సన్నిహితమైన కుటుంబ అనుబంధమని ఆమె వివరించారు. దీనికి కారణం కొన్ని కీలకమైన సంఘటనలే అని చెప్పారు.
ఇది కూడా చదవండి : OTT Movie : పెద్దికి పోటీగా ఓటీటీలోకి క్రేజీ మూవీ.. రిలీజ్ అయిన 5 వారాల్లోనే స్ట్రీమింగ్ రెడీ..
మొదటి సంఘటన 1991లో జరిగింది. ప్రెసిడెంట్ గారి పెళ్ళాం సినిమా షూటింగ్ అప్పుడు సుధ తీవ్రమైన అపెండిసైటిస్‌తో బాధపడ్డారట, అయితే పని ఒత్తిడిలో దానిని నిర్లక్ష్యం చేశానని తెలిపారు. రెండు మూడు రోజుల నుంచి నొప్పి ఉన్నా షూటింగ్‌కు వెళ్లారని, చివరికి అది సీరియస్ కండిషన్‌కు చేరిందని ఆమె వివరించారు. అంతకుముందు రాత్రి తనకు తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, అధిక జ్వరం (102 డిగ్రీలు) వచ్చాయని, కళ్లు తెరవలేకపోయానని సుధ గుర్తు చేసుకున్నారు. తన మేనేజర్‌కు చంద్రమోహన్ గారు ఫోన్ చేసి విషయం చెప్పడంతో, తెల్లవారుజామున 4:30 గంటలకు మేనేజర్ వచ్చారని, 5:30 గంటలకు అపోలో హాస్పిటల్‌కు వెళ్లినట్లు ఆమె తెలిపారు. హాస్పిటల్‌లో ఐదుగురు డాక్టర్లు తనను పరీక్షించి, అపెండిక్స్ పగిలిపోయిందని, మరో గంట సమయం ఆలస్యమైతే రక్తం అంతా పాయిజన్ అయ్యి తాను చనిపోయేదాన్ని అని చెప్పినట్లు సుధ తెలిపారు. అపోలో హాస్పిటల్‌కు వెనుక గేటు గుండా రహస్యంగా కారులో మండువా హౌస్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుగుతున్న ప్రెసిడెంట్ గారి పెళ్ళాం సెట్‌కి చేరుకున్నారని ఆమె చెప్పారు. అప్పటికి సినిమా షూటింగ్ మొదలై మూడో రోజు. అక్కడ రెడీ అయ్యి సెట్‌లోకి వస్తుండగా నాగార్జున గారి మీదనే కుప్పకూలిపోయానని ఆమె వివరించారు. వెంటనే నాగార్జున గారు తనను పట్టుకుని తిరిగి అపోలో హాస్పిటల్‌కు తరలించి, 45 నిమిషాలలో ఆపరేషన్ జరిగేలా చూశారని సుధ తెలిపారు. ఆయనే తన ప్రాణాలను కాపాడారని ఆమె స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి : అతను ఓ సైకో.. నన్ను సిగరెట్‌తో కాల్చాడు, పిచ్చి పిచ్చిగా కొట్టాడు.. షాకింగ్ విషయం చెప్పిన టాలీవుడ్ హీరోయిన్
రెండో సంఘటన రావోయి చందమామ సినిమా షూటింగ్ సమయంలో జరిగింది. కబడ్డీ సీన్ చిత్రీకరణలో చంద్రమోహన్ గారు కాలు లాగడంతో తనకు స్లిప్‌డ్ డిస్క్ సమస్య వచ్చిందని సుధ తెలిపారు. తన లోయర్ పార్ట్ పనిచెయ్యక, బెడ్ మీద పడిపోయినప్పుడు నాగార్జున గారు మళ్లీ వెంటనే స్పందించి, తన వ్యక్తిగత డాక్టర్‌ను పిలిపించి చికిత్స అందించారని ఆమె గుర్తు చేసుకున్నారు. అందుకే నాగార్జున గారు తనకు దేవుడిచ్చిన వరమని, ఆయన ద్వారానే తన జీవితం తిరిగి వచ్చిందని సుధ పేర్కొన్నారు. ఈ విషయాన్ని తాను గతంలో ఊపిరి సినిమా షూటింగ్ సమయంలో కూడా నాగార్జున గారితో చెప్పినప్పుడు, ఆయన తనను ఆటపట్టించారని, వారి మధ్య ఉన్న సన్నిహిత అనుబంధాన్ని తెలియజేశారు. సినిమాల్లో ఆయనకు తల్లి పాత్రలో నటించినా, ఆయన తనకు తండ్రిలాగే ప్రతి అడుగడుగునా అండగా నిలిచి కాపాడుతున్నారని నటి సుధ తెలిపారు.
ఇది కూడా చదవండి : పెళ్లి రోజున సర్‌ప్రైజ్ అని విడాకులు ఇచ్చాడు.. కన్నీళ్లు పెట్టుకున్న టాలీవుడ్ హీరోయిన్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
