AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్.. మారిన ఆర్టీసీ బస్సు రూట్‌లు! ఇదిగో కొత్త మ్యాప్!

జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, బంజారాహిల్స్, రోడ్ నంబర్ 45, పరిసర ప్రాంతాల వైపు వెళ్లే ప్రయాణికులు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు కీలక సూచనలు చేశారు. ఈ రూట్‌లో వన్‌వే అమలు నేపథ్యంలో ప్రధాన బస్సు రూట్లలో స్వల్ప మార్పులు చేసినట్టు పేర్కొన్నారు. కాబట్టి ప్రయాణికులు ఈ క్రింది రూట్‌ల ఆధారంగా ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచించారు.

Hyderabad: ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్.. మారిన ఆర్టీసీ బస్సు రూట్‌లు! ఇదిగో కొత్త మ్యాప్!
Tgsrtc Bus Route Changes
Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: Aug 18, 2026 | 8:14 PM

Share

నగరవాసులకు హైదరాబాద్‌ ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో అండర్‌పాస్, ఫ్లైఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా అమలు చేస్తున్న వన్-వే నిబంధనల దృష్ట్యా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక కార్యాచరణను చేపట్టింది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రధాన బస్సు రూట్లలో స్వల్ప మార్పులు చేస్తూ, బస్సు స్టాప్‌లు, స్టేజీల వివరాలను టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ప్రకటనలో వెల్లడించింది.

మారిన నిబంధనల ప్రకారం ప్రధాన రూట్లలో బస్సు సర్వీసుల ప్రయాణ మార్గాలను క్రమబద్ధీకరించినట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రయాణించే రూట్ నం. 127K: కొండాపూర్ – కోఠి, రూట్ నం. 222A: పటాన్‌చెరు – కోఠి, రూట్ నం. 47L: మణికొండ – సికింద్రాబాద్ / JBS, రూట్ నం. 10H: కొండాపూర్ – సికింద్రాబాద్ బస్సులు ఈ క్రింది రూట్‌లో రాకపోకలు కొనసాగిస్తాయని తెలిపారు.

47L బస్సు ప్రయాణించే రూట్:

సికింద్రాబాద్ టూ మణికొండ: సికింద్రాబాద్ నుండి మణికొండ వెళ్లే 47L నెంబర్ గల బస్సులు సికింద్రాబాద్ స్టేషన్‌ నుంచి స్టార్ట్ అయి బేగంపేట ➔ పంజాగుట్ట పి.ఎస్ ➔ నాగార్జున సర్కిల్ ➔ టీవీ9 మసీదు ➔ ఎల్.వి. ప్రసాద్ ➔ బసవతారకం హాస్పిటల్ ➔ బీఆర్ఎస్ భవన్ ➔ ఎమ్మెల్యే కాలనీ ➔ ఒమేగా ➔ అపోలో ఆస్పత్రి ➔ ఫిల్మ్ నగర్ ➔ దర్గా ➔ మణికొండకు చెరుకుంటాయి.

మణికొండ టూ సికింద్రాబాద్: అలాగే మణింకొండ నుంచి సికింద్రాబాద్ వెళ్లే 47L నెంబర్‌ బస్సు మణికొండ బస్‌స్టాండ్‌ నుంచి స్టార్ట్ అయి పంచవటి కాలనీ ➔ దర్గా ➔ ఫిల్మ్ నగర్ ➔ జర్నలిస్ట్ కాలనీ ➔ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ➔ అన్నపూర్ణ స్టూడియో ➔ ఎల్.వి. ప్రసాద్ హాస్పిటల్ ➔ టీవీ9 (మసీద్) ➔ పంజాగుట్ట పి.ఎస్ ➔ ఆర్.జె. కాలేజీ ➔ పోలీస్ లైన్ ➔ ప్లాజా మీదుగా సికింద్రాబాద్ చేరుకుంది.

10H బస్సులు ప్రయాణించే రూట్

సికింద్రాబాద్ – కొండాపూర్: సికింద్రాబాద్ నుంచి కొండాపూర్ వెళ్లే 10H నెంబర్ గల బస్సులు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి స్టార్ట్ అయి బేగంపేట ➔ మైత్రివనం ➔ యూసఫ్ గూడ ఎక్స్ రోడ్స్ ➔ వెంకటగిరి ➔ నవయుగా ➔ పెద్దమ్మ గుడి ➔ మాదాపూర్ పోలీసు స్టేషన్ మీదుగా కొండాపూర్ చేరుకుంటాయి.

కొండాపూర్ – సికింద్రాబాద్: అలాగే రిటర్న్‌లో వచ్చే 10H బస్సులు కొండాపూర్ బస్‌స్టాండ్ నుంచి ప్రారంభమై పెద్దమ గుడి ➔నవయుగ ➔వెంకటగిరి ➔యూసఫ్ గూడ ఎక్స్ రోడ్స్ ➔మైత్రివనం ➔బేగంపేట మీదుగా సికింద్రాబాద్ చేరుకుంటాయి.

222A బస్సులు ప్రయాణించే రూట్

కోఠి – పటాన్‌చెరు: ఈ రూట్‌లో ప్రయాణించే 222A బస్సులు కోఠి బస్‌ స్టాండ్ నుంచి ప్రారంభమై ➔ లకడికపూల్ ➔ మసబ్ ట్యాంక్ ➔ నాగార్జున సర్కిల్ ➔ ఎల్.వి.ప్రసాద్ ➔ బసవతారకం హాస్పిటల్ ➔ బీఆర్ఎస్ భవన్ ➔ ఎమ్మెల్యే కాలనీ ➔ ఒమేగా ➔ అపోలో ఆస్పత్రి ➔ జర్నలిస్ట్ కాలనీ ➔ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ➔ పెద్దమ్మ గుడి ➔ మాదాపూర్ పీఎస్ మీదుగా పటాన్ చెరుకు చేరుకుంటాయి.

పటాన్‌చెరు – కోఠి: అలాగే రిటర్న్‌లో వచ్చే 222A బస్సులు పటాన్‌చెరు ➔ మాదాపూర్ పీఎస్ ➔పెద్దమ్మ గుడి ➔జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ➔అన్నపూర్ణ స్టూడియో ➔ఎల్ వి.ప్రసాద్ ➔నాగార్జున సర్కిల్ ➔మాసబ్ ట్యాంక్ ➔లకడికపుల్ మీదుగా కోఠి బస్టాండ్‌కు చేరకుంటాయి

127K బస్సులు ప్రయాణించే రూట్:

కోఠి – కొండాపూర్: కోఠి నుంచి కొండాపూర్ వెళ్లే 127K నెంబర్ గల బస్సులు కోఠి బస్టాండ్ నుంచి ప్రారంభమై లకడికపూల్ ➔ మసబ్ ట్యాంక్ ➔ పెన్షన్ హౌస్ ➔ఎమ్మెల్యే కాలనీ ➔అపోలో ఆస్పత్రి ➔రోడ్డు నంబర్ 45 ➔మాదాపూర్ పీఎస్ మీదుగా కొండాపూర్ బస్టాండ్‌కు చేరుకుంటాయి.

కొండాపూర్ – కోఠి: అలాగే రిటర్న్‌లో వచ్చే 127K బస్సులు కొండాపూర్ బస్టాండ్ నుంచి ప్రారంభమై మాదాపూర్ పీఎస్ ➔రోడ్డు నంబర్ 45 ➔జర్నలిస్ట్ కాలనీ➔జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ➔అన్నపూర్ణ స్టూడియో ➔ఎల్.వి.ప్రసాద్ ➔బసవతారకం హాస్పిటల్ ➔బిఆర్ఎస్ భవన్ ➔ఎమ్మేల్యే కాలనీ➔పెన్షన్ హౌస్➔మాసబ్ ట్యాంక్ మీదుగా కోఠి చేరుకుంటాయి.

ప్రయాణికులకు విజ్ఞప్తి: జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, బంజారాహిల్స్, రోడ్ నంబర్ 45, పరిసర ప్రాంతాల వైపు వెళ్లే ప్రయాణికులు ఈ మారిన బస్సు రూట్లను, స్టాప్‌లను గమనించి తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరడమైనది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సు సర్వీసులను నడిపించేందుకు కూడా తగిన ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us