AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishwanath And Sons: సూర్యకు బావగా కనిపించిన ఈ నటుడు ఎవరో తెలుసా?  తమ్ముడు తెలుగులో ఫేమస్ హీరో.. తండ్రేమో..

సూర్య హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'విశ్వనాథ్ అండ్ సన్స్' సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లుతోంది. వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాలో మమితా బైజు హీరోయిన్ గా చేసింది. అయితే ఇదే సినిమాలో సూర్య బావ పాత్రలో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు ఓ నటుడు.

Vishwanath And Sons: సూర్యకు బావగా కనిపించిన ఈ నటుడు ఎవరో తెలుసా?  తమ్ముడు తెలుగులో ఫేమస్ హీరో.. తండ్రేమో..
Vishwanath And Sons Movie
Basha Shek
|

Updated on: Aug 18, 2026 | 7:57 PM

Share

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళం బ్యూటీ మమితా బైజు హీరోయిన్ గా నటించింది. అలాగే సీనియర్ హీరోయిన్లు రాధికా శరత్ కుమార్, రవీనా టాండన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 14న రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 150 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. తద్వారా సూర్య కెరీర్ లోనే వేగంగా ఈ మార్క్ ను చేరుకున్న చిత్రంగా విశ్వనాథ్ అండ్ సన్స్ నిలిచింది. కాగా ఈ సినిమాలో చాలా మంది యాక్టర్స్ కనిపించారు. నాజర్, హర్ష చెముడు, రాజీవ్ మేనన్, సర్వదమన్ బెనర్జీ, హైపర్ ఆది, మైమ్ గోపీ, కాళీ వెంకట్, జార్జ్ మరియన్, దీపా శంకర్, రఘు బాబు.. ఇలా ఎంతో మంది స్టార్స్ వివిధ పాత్రల్లో కనిపించారు. అయితే ఈ విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో హీరో సూర్యకు బావ పాత్రలో సునీల్ రెడ్డి అనే ఓ నటుడు కనిపించారు. నిత్యం సూర్య తోడుగా ఉండే అడ్వకేట్ రామలింగం అలియాస్ రాము పాత్రలో ఆయన అదరగొట్టాడు. సినిమాలో బాగా హైలెట్ గా నిలిచిన రోల్స్ లో ఇది కూడా ఒకటి. ముఖ్యంగా రాధిక- సునీల్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చే సీన్స్ ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి. అలాగే సూర్య- సునీల్ కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు కూడా బాగా హైలెట్ అయ్యాయి. విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా సక్సెస్ నేపథ్యంలో సునీల్ రెడ్డి కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

ఇదిలా ఉంటే ఈ సునీల్ రెడ్డి మరెవరో కాదు. ఒకప్పటి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి కుమారుడు. మెగాస్టార్ చిరంజీవికి ఖైదీ, అభిలాష, పసివాడి ప్రాణం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, ముఠామేస్త్రి.. ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించారు కోదండరామిరెడ్డి. వీరి కాంబినేషన్ లో దాదాపు 20 కు పైగా సినిమాలు వస్తే దాదాపు 90 శాతం హిట్ చిత్రాలే. కోదండరామిరెడ్డి వారసుడిగా 2018 లో విజయ్ సేతుపతి సీతకత్తి సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు సునీల్ రెడ్డి . ఆ తర్వాత తమిళ్ లో వరుసగా సినిమాలు చేస్తున్నారు. డాక్టర్, బీస్ట్, జైలర్, మమన్నన్, పెరుసు ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు సునీల్ రెడ్డి. కమెడియన్ గా, సహాయక నటుడిగా తన ప్రతిభను చాటుకున్నారు. ఇక తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ కిష్కింధపురి సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు సునీల్ రెడ్డి. ఆ తర్వాత కపుల్ ఫ్రెండ్లి సినిమాలో కూడా యాక్ట్ చేశారు. ఇప్పుడు సూర్య విశ్వనాధ్ & సన్స్ సినిమాతో మరోసారి వార్తల్లో నిలిచారీ ట్యాలెంటెడ్ యాక్టర్.

సునీల్ రెడ్డి ఫ్యామిలీ..

Sunil Reddy Family

Sunil Reddy Family

ఇక సునీల్ రెడ్డి సోదరుడు వైభవ్ తెలుగు ఆడియెన్స్ కు బాగా పరిచయమే. గొడవ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అతను సరోజ, కాస్కో, గోవా, గ్లాంబ్లర్, యాక్షన్ త్రీడీ, బిర్యానీ, అనామిక, కట్టేరి, మన్మథ లీల, కస్టడీ.. తదితర సినిమాల్లో హీరోగా, సెకెండ్ హీరోగా, సహాయక నటుడిగా మెప్పించాడు. ప్రస్తుతం వైభవ్ కూడా నటుడిగా బిజీగా ఉంటున్నాడు.

ఇవి కూడా చదవండి

విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us