పెళ్లి తర్వాత తిరుపతి వస్తా.. కానీ ఇప్పుడు.. నిధి అగర్వాల్..

Rajitha Chanti

Pic credit - Instagram

09  July 2026

టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ తాజాగా తన పెళ్లి, కాబోయే భర్త గురించి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

ఇటీవల కాలంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు కథానాయికలు వరుసగా వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే.

తాజాగా తిరుపతిలో జరిగిన ఒక ప్రైవేట్ మొబైల్ స్టోర్ ఓపెనింగ్ వేడుకలో పాల్గొన్న నిధి అగర్వాల్, తన వివాహ ప్రణాళికలపై రియాక్ట్ అయ్యారు.

 ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నిధి అగర్వాల్.. తన పెళ్లిపై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టారు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.

ప్రస్తుతానికి నాకు వివాహం చేసుకునే ఆలోచనలు, ప్లాన్స్ ఏమీ లేవు. ఇంకా నాకు తగ్గ పెళ్లికొడుకు కూడా దొరకలేదు. ఒకవేళ భవిష్యత్తులో నాకు పెళ్లైతే..

వివాహం జరిగిన తర్వాత కచ్చితంగా భర్తతో కలిసి మళ్లీ తిరుపతికి వస్తాను అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు. ఇప్పుడు కామెంట్స్ వైరల్ గా మారాయి.

ఇక కెరీర్ విషయానికొస్తే.. నిధి అగర్వాల్ మొదట హిందీ చిత్ర పరిశ్రమ ద్వారా వెండితెరకు పరిచయమైంది. తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది.

అఖిల్‌తో 'మిస్టర్ మజ్ను', రామ్‌తో నటించిన 'ఇస్మార్ట్ శంకర్' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ముఖ్యంగా 'ఇస్మార్ట్ శంకర్'తో ఈ భామకు క్రేజ్ పెరిగింది.