AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కంటికి మేలు.. జుట్టుకు బలం.. వారంలో ఒక్కరోజైనా ఇంటిల్లిపాదీ తినాల్సిన కూర

మన వంటింట్లో ప్రతిరోజూ వాడే పోపు దినుసుల్లో కరివేపాకు చాలా ముఖ్యమైనది. ఏ కూర వండినా రుచి కోసం, మంచి సువాసన కోసం కరివేపాకును వేస్తాం. కానీ, తినేటప్పుడు చాలా మంది దాన్ని ఏరి పక్కన పారేస్తుంటారు. కరివేపాకు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలిసినా, ఇలా చేయడం వల్ల దానిలోని పోషకాలను మనం పూర్తిగా పొందలేకపోతున్నాం.

Phani CH
|

Updated on: Jul 09, 2026 | 8:44 PM

Share
అందుకే, కరివేపాకును పక్కన పెట్టకుండా, దాంతోనే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన ఒక ప్రత్యేకమైన కూరను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. వారంలో కనీసం ఒక్కరోజైనా కూరగాయలన్నీ పక్కన పెట్టేసి ఈ కూర తింటే శరీరానికి ఎంతో మంచిది.  ఈ కూరను తయారు చేయడానికి ముందుగా రెండు కప్పుల తాజా కరివేపాకును శుభ్రంగా కడిగి, తడి లేకుండా బాగా ఆరబెట్టుకోవాలి .

1 / 5
ఒక కడాయిలో రెండు మూడు స్పూన్ల నూనె వేడి చేసి, అందులో ఈ కరివేపాకును వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు మధ్యస్థ మంట మీద బాగా వేయించుకోవాలి. వేగిన కరివేపాకు చల్లారిన తర్వాత, మిక్సీ జార్‌లో లేదా రోట్లో వేసి మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత, అదే కడాయిలో మరికొంచెం నూనె వేసి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి పోపు పెట్టుకోవాలి. ఇందులో గుప్పెడు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి .

2 / 5
వెల్లుల్లి ఇష్టం లేని వారు దీన్ని వదిలేయవచ్చు. అనంతరం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి ఉల్లిపాయలు మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు, కారం, మనం ముందుగా సిద్ధం చేసుకున్న కరివేపాకు పేస్ట్ వేసి కలపాలి. ఇక్కడ ఒక చిన్న బెల్లం ముక్కను కూడా జోడించాలి.

3 / 5
కరివేపాకులో ఉండే స్వల్ప చేదును బ్యాలెన్స్ చేయడానికి బెల్లం చాలా ముఖ్యం. ఆపై తగినన్ని నీళ్లు పోసి కూరను ఉడికించుకోవాలి. కూర కొద్దిగా మగ్గిన తర్వాత నిమ్మకాయ సైజంత చింతపండు రసాన్ని మరియు గ్రేవీకి సరిపడా నీటిని పోసి, నూనె పైకి తేలే వరకు సన్నని మంటపై ఉడికిస్తే ఎంతో రుచికరమైన కరివేపాకు కూర సిద్ధమవుతుంది.

4 / 5
ఆరోగ్య ప్రయోజనాలు: కరివేపాకు కేవలం రుచికే కాదు, ఔషధ గుణాలకు నిలయం. ఇది కంటి చూపును మెరుగుపరచడానికి, జుట్టు కుదుళ్లను బలంగా ఉంచడానికి ఎంతో సహాయపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను, మలినాలను తొలగించి, రక్తాన్ని శుద్ధి చేయడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇది రోగనిరోధక శక్తిని ఇస్తుంది. కూరల్లో వేస్తే తీసిపారేసే పిల్లలు కూడా, ఈ విధంగా కూర చేసి పెడితే వేడివేడి అన్నంలోనో లేదా రోటీలోనో లొట్టలేసుకుంటూ ఎంతో ఇష్టంగా తింటారు. కాబట్టి, ఈ ఆరోగ్యకరమైన వంటకాన్ని మీ ఇంట్లో కూడా తప్పకుండా ప్రయత్నించండి!.

5 / 5
Follow Us