National Film Awards Winners: 71జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో సత్తా చాటిన తెలుగు చిత్రాలు.. భగవంత్ కేసరి, హనుమాన్‌తోపాటు ఈ సినిమాలు కూడా
71జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించింది కేంద్రం. 22 భాషల్లో 115 సినిమాలు వీక్షించిన జ్యురీ అవార్డులను అనౌన్స్ చేసింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాను అనౌన్స్ చేశారు.అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన భగవంత్ కేసరి సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

71జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించింది కేంద్రం. 22 భాషల్లో 115 సినిమాలు వీక్షించిన జ్యురీ అవార్డులను అనౌన్స్ చేసింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాను అనౌన్స్ చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన భగవంత్ కేసరి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. బాలకృష్ణ ఈ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడి ఆకట్టుకున్నారు. అలాగే ఈ సినిమాలో శ్రీలీల కీలక పాత్రలో కనిపించింది. మంచి కథ కథనంతో తెరకెక్కిన ఈ మూవీకి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు అనౌన్స్ చేయడంతో అభిమానులు, చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అలాగే బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ కేటగిరిలో హనుమాన్ సినిమాను అనౌన్స్ చేశారు. తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. అలాగే బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా డైరెక్టర్ సుకుమార్ కూతురు శుకృతివేణి( గాంధీ తాత చేటు) ఎంపికైంది, బెస్ట్ లిరిక్స్ కేటగిరిలో బలగం సినిమాకు అవార్డు ప్రకటించారు. వేణు దర్శకత్వంలో బలగం వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా బేబీ సినిమాకు గాను సాయి రాజేష్ కు అవార్డు ప్రకటించారు. అదేవిధంగా బెస్ట్ మేల్ సింగర్ గా పీవీఎన్ఎస్ రోహిత్ (ప్రేమిస్తున్నా పాట) అవార్డు వరించింది. 71జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. తెలుగు సినిమాలకు అవార్డులు రావడంతో అభిమానులు, తెలుగు ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.







