AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Siri Hanumanthu: పెళ్లి కాకుండానే.. ప్రియుడితో కలిసి ‘వరలక్ష్మి వ్రతం’ చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్

పవిత్రమైన శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని చాలా మంది తమ ఇళ్లల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ వేడుకల్లో భాగమయ్యారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఫేమ్ సిరి హనుమంతు తన ప్రియుడు శ్రీహాన్ తో కలిసి వరలక్ష్మి వ్రతం చేసింది.

Siri Hanumanthu: పెళ్లి కాకుండానే.. ప్రియుడితో కలిసి 'వరలక్ష్మి వ్రతం' చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్
Siri Hanumanthu
Basha Shek
|

Updated on: Aug 01, 2025 | 6:37 PM

Share

ప్రముఖ నటి సిరి హనుమంతు గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. విశాఖపట్నంలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ మొదట న్యూస్ ప్రజెంటర్ గా కెరీర్ ప్రారంభించింది. ప్రముఖ న్యూస్ ఛానెల్స్ లో పనిచేసింది. ఆ తర్వాత బుల్లితెరపై అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఎవరే నువ్వు మోహిని, సావిత్రమ్మగారి అబ్బాయి, అగ్నిసాక్షి తదితర సీరియల్స్‌లో నటించి మెప్పించింది. ఇక సిరి హన్మంతు కెరీర్ కు బిగ్ బాస్ షో మంచి బూస్టప్ ఇచ్చింది. ఈ షో ద్వారానెగెటివిటీ తెచ్చుకున్నప్పటికీ బయటకు వచ్చాక ఈ ముద్దుగుమ్మకు సినిమా అవకాశాలు పెరిగాయి. ఇద్దరి లోకం ఒకటే, నరసింహపురం, ఓరేయ్ బుజ్జిగా, బూట్ కట్ బాలరాజు తదితర సినిమాల్లో యాక్ట్ చేసింది. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమాలోనూ ఓ క్యామియో రోల్ లో కనిపించింది. వీటితో పాటు పులి మేక వంటి వెబ్‌ సిరీస్‌లతోనూ ఫుల్‌ పాపులర్‌ అయింది.

సినిమాలు, వెబ్ సిరీస్ లతో పాటు తన రిలేషన్ షిప్ విషయంతోనూ వార్తల్లో నిలుస్తుంటుంది సిరి. ప్రముఖ నటుడు, బిగ్ బాస్ ఫేమ్ శ్రీహాన్ తో ఎన్నో ఏళ్లుగా ప్రేమలో ఉందీ అందాల తార. వీరిద్దరూ ఓ బాబును దత్తత కూడా తీసుకుని పెంచుకుంటున్నారు.సిరి-శ్రీహాన్‌ రిలేషన్‌, పెళ్లి గురించి ఎన్ని రూమర్లు వచ్చినా వీరు మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోవట్లేదు. తమకు నచ్చినట్లు లైఫ్ లీడ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వరలక్ష్మీ వ్రతంలో సిరి హనుమంతు, శ్రీహాన్..

తాజాగా సిరి హనుమంతు శ్రీహాన్‌తో కలిసి వరలక్ష్మి వ్రతం పూజ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఈ సందర్భంగా సిరి చీరలో అందంగా ముస్తాబు కాగా, శ్రీహాన్ పంచెకట్టులో కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు పెళ్లి కాకుండా ఇలా జంటగా వరలక్ష్మి వ్రతం చేయొచ్చా? అని ప్రశ్నలు వేస్తున్నారు.

బిగ్ బాస్ బ్యూటీలందరూ ఒకే చోట..

చార్మినార్ దగ్గర..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
పృథ్వీరాజ్ స్పీడ్, టైమ్ మేనేజ్మెంట్ చూసి ఇండస్ట్రీ వర్గాల షాక్
పృథ్వీరాజ్ స్పీడ్, టైమ్ మేనేజ్మెంట్ చూసి ఇండస్ట్రీ వర్గాల షాక్
వినాయకుడిని ఇంట్లో ఎన్ని రోజులు ఉంచితే మంచిది?
వినాయకుడిని ఇంట్లో ఎన్ని రోజులు ఉంచితే మంచిది?
మెంతులు వీరికి విషంతో సమానం.. తింటే ఈ సమస్యలు ఖాయం..
మెంతులు వీరికి విషంతో సమానం.. తింటే ఈ సమస్యలు ఖాయం..
ఆవాలు, జీలకర్రే కాదు.. పోపులో ఈ గింజలు ఎందుకు వేస్తారో తెలుసా?
ఆవాలు, జీలకర్రే కాదు.. పోపులో ఈ గింజలు ఎందుకు వేస్తారో తెలుసా?
గణేషుని పూజకు ఇలాంటి డ్రెస్‌లో వస్తావా? 'కల్కి'హీరోయిన్‌పై ఆగ్రహం
గణేషుని పూజకు ఇలాంటి డ్రెస్‌లో వస్తావా? 'కల్కి'హీరోయిన్‌పై ఆగ్రహం
భోజనం ఇలా తింటున్నారా? లక్ష్మీదేవికి కోపం వస్తుందట!
భోజనం ఇలా తింటున్నారా? లక్ష్మీదేవికి కోపం వస్తుందట!
ఒకే ఓవర్లో 27 పరుగులు.. 20 బంతుల్లో ఇచ్చిపడేసిన శాంసన్..!
ఒకే ఓవర్లో 27 పరుగులు.. 20 బంతుల్లో ఇచ్చిపడేసిన శాంసన్..!
చేరికలు, అలకలు, చీలికలు, కన్నీళ్లు.. ఎవరికి లాభం, ఎవరికి నష్టం?
చేరికలు, అలకలు, చీలికలు, కన్నీళ్లు.. ఎవరికి లాభం, ఎవరికి నష్టం?
వినాయక చవితి.. మూడో రోజు ప్రసాదానికి ఈ నైవేద్యం 100 మందికి
వినాయక చవితి.. మూడో రోజు ప్రసాదానికి ఈ నైవేద్యం 100 మందికి
బాక్సాఫీస్ శత్రువుల దోస్తీ.. సీఎం- ఆ స్టార్ హీరో మధ్య స్నేహం..
బాక్సాఫీస్ శత్రువుల దోస్తీ.. సీఎం- ఆ స్టార్ హీరో మధ్య స్నేహం..