AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss: బిగ్ బాస్ మళ్లీ వచ్చేస్తున్నాడు.. కొత్త సీజన్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్.. లేటెస్ట్ ప్రోమో చూశారా?

బిగ్ బాస్ సీజన్ మళ్లీ షురూ కానుంది. తెలుగుతో పాటు ప్రముఖ భాషల్లోనూ త్వరలోనే ఈ రియాలిటీ షో సందడి మొదలు కానుంది. ఇప్పటికే ప్రోమోలు, గ్లింప్స్ అంటూ బిగ్ బాస్ కొత్త సీజన్ పై బాగా హైప్ పెంచుతున్నారు మేకర్స్.

Bigg Boss: బిగ్ బాస్ మళ్లీ వచ్చేస్తున్నాడు.. కొత్త సీజన్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్.. లేటెస్ట్ ప్రోమో చూశారా?
Bigg Boss Reality Show
Basha Shek
|

Updated on: Aug 01, 2025 | 5:26 PM

Share

బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్‌బాస్‌ కు అంతా సిద్ధమైంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లోనూ త్వరలోనే ఈ రియాలిటీ షో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆయా భాషల్లో నయా సీజన్లకు సంబంధించిన ప్రోమోలు, గ్లింప్స్ కూడా రిలీజయ్యాయి. కంటెస్టెంట్ల పేర్లు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే బిగ్‌బాస్‌ హిందీ కొత్త సీజన్ కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్‌ అధికారికంగా ప్రకటించింది. హిందీలో ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా 18 సీజన్లు పూర్తయ్యాయి. 19వ సీజన్ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసారి కూడా నటుడు సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ షోను హోస్ట్ చేయనున్నారు. కొన్ని రోజుల క్రితం బిగ్ బాస్ కొత్త సీజన్ కొత్త లోగో విడుదలైంది. ఇప్పుడు ప్రోమో విడుదలైంది. అలాగే, ‘బిగ్ బాస్ 19’ ప్రీమియర్ తేదీని ప్రకటించారు. హిందీ బిగ్ బాస్ కొత్త సీజన్ ఆగస్టు 24న గ్రాండ్‌గా ప్రారంభమవుతుంది. ఈసారి బిగ్ బాస్ కాస్త భిన్నంగా ఉంటుంది. ప్రతిసారీ లాగే, ఈసారి కూడా కొన్ని ప్రయోగాలు చేయాలని నిర్ణయించారు. నివేదికల ప్రకారం, బిగ్ బాస్ 19వ సీజన్ సరిగ్గా ఐదున్నర నెలలు కొనసాగుతుంది. గత సంవత్సరం ఇది మూడు లేదా మూడున్నర నెలలు మాత్రమే కొనసాగింది. అయతే ఈసారి, ప్రేక్షకులకు మరింత ఎంటర్ టైన్మెంట్ అందించాలని ఏకంగా 5 నెలల పాటు బిగ్ బాస్ షోను రన్ చేయనున్నారు

వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు బిగ్ బాస్ ఆఫర్లు వచ్చినట్లు తెలుస్తోది. ప్రేక్షకులు కూడా బిగ్ హౌస్‌లోకి ఎంటర్ అయ్యే కంటెస్టెంట్ల గురించి తెలుసుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు. బిగ్ బాస్ 19వ సీజన్ ప్రారంభానికి ఇంకా నెల రోజులు కూడా లేదు. సల్మాన్ ఖాన్ నటించిన ప్రోమో చూసిన తర్వాత అభిమానుల అంచనాలు మరింత పెరిగాయి. బిగ్ బాస్ హిందీ సీజన్ 19 కొత్త ప్రోమోలో సల్మాన్ ఖాన్ ఒక రాజకీయ నాయకుడి గెటప్‌లో కనిపిస్తున్నాడు. ‘ఈసారి ఇది హౌస్‌మేట్స్ ప్రభుత్వం’ అని ఆయన అంటున్నారు. దీని ద్వారా, కొత్త సీజన్ థీమ్ గురించి ఆయన హింట్ ఇచ్చారు. బిగ్ బాస్ 19 ‘జియో హాట్ స్టార్’ , ‘కలర్స్’ ఛానెళ్లలో ప్రసారం అవుతుంది.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ హిందీ సీజన్ 19 లేటెస్ట్ ప్రోమో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం